ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లో గులాబీ పార్టీ అభ్యర్థిని మార్చిం ది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య కు బదులు గా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఈసారి అవకాశం కల్పించారు గులాబీ బాస్. రాజయ్య మెత్తపడినట్లు గా కనిపిస్తున్నా ..ఆయన వర్గం మాత్రం కడియం మీద ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి సింగాపురం ఇందిర బరిలో దిగుతున్నారు. తొలి జాబితాలోనే ఆమె టికెట్ సొంతం చేసుకున్నారు.
టిక్కెట్ ఆశించి భంగపడ్డ రాజయ్య ప్రగతిభవన్‌కు పరిమితమైనా ఆయన అనుచరులు కడియం కు సహకరిస్తారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జనగామ హన్మ కొండ జిల్లాలకు విస్తరించిన స్టేషన్ ఘనపూర్ రాజకీయాలకు ఓ స్పెషాలిటీ ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రం లో అధికారం లోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు డుగా మారినప్పటి నుంచి ఆ సెoటిమెంట్ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం బిఆర్ఎస్ కు చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రా తినిధ్యం వహిస్తున్నా రు . .వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్య మంత్రిగా పని చేసి రికార్డు సృష్టించారు . అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ను కాదని గులాబీ బాస్ సీఎం కేసిఆర్ ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టిక్కె ట్ ఇచ్చా రు .
ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేం దుకు విపక్షాలైన కాంగ్రెస్, బిజేపి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్ధిని రంగంలోకి దింపుతోంది. సింగాపురం ఇందిరకు టికెట్ కేటాయించారు. పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలే తనని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థు ల వేటలో పడి సత్తా చాటేందు కు విపక్షాలు ప్రయత్నిస్తుంటే ఓటమి ఎరుగని అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలు కనిపిస్తున్నా యి. విపక్షాల్లో సరైన అభ్య ర్థి కనిపిం చక…అధికార పార్టీకి వార్ వన్ సైడ్ లా అనిపిస్తు న్నా , అంతర్గత కుమ్ములాటలు గ్రూప్ రాజకీయా లు కొంప ముంచేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి వివాదాస్పదం గా మారడం తో ఈసా రి అభ్యర్థిని మార్చారనే ప్రచారం సాగుతోంది. కడియం ఇదివరకు రెండు సార్లు ఎమ్మెల్యే గా స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా టిఆర్ఎస్ హయాం లో రాజయ్య తర్వాత ఉపము ఖ్యమంత్రిగా పనిచేశారు . ఆయనపై సదభిప్రాయం ఉన్నప్పటికి సామాజిక సమీకరణాల నేపద్యం లో మాదిగ వర్గానికి చెందిన రాజయ్య ను కాదని కడియం కు టికెట్ ఇవ్వడం తో మాదిగ సామాజిక వర్గం కడియం కు ప్రతికూలం గా మారే పరిస్తితులు కనిపిస్తున్నాయి.
బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపోటములను రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.కేంద్రం లో అధికారం లో ఉన్న బిజేపి నుంచి మాజీ మంత్రి విజయరామారావు పోటీకి సిద్దమయ్యారు . ఆయననే ఎన్నికల బరిలో నిలిపేందుకు కమలదళం కసరత్తు చేస్తోంది. మాదాసు వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్ సైతం బీజేపీ టికెట్ రేస్ లో ఉన్నా రు .
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో మారుతున్న రాజకీయ సమీకరణా ల నేపద్యం లో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మె ల్యే రాజయ్య చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుభూతి ఉన్నా ఆయన వ్యవహారశైలి పార్టీకి మైనస్ గా మారే అవకాశాలు న్నాయి. ఇక శ్రీహరి అవినీతి రహితుడనే పేరున్నప్పటికి రాజయ్య సీటును లాక్కున్నాడనే విమర్శల నేపద్యం లో కాంగ్రెస్ బలీయం గా మారితే కడియం కు ప్రతికూల పరిస్తితి ఎదురు కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…