నువ్వా నేనా అన్నట్లు హోరా హోరీ

By KTV Telugu On 21 October, 2023
image

KTV TELUGU :-

ఛత్తీస్ ఘడ్ లో  మరోసారి  తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. అయితే  కొద్ది రోజులుగా బిజెపి కూడా దూకుడు పెంచింది. మొత్తం మీద ఈ సారి హోరా హోరీ పోరు తప్పదంటున్నారు రాజకీయ పండితులు.బీజేపీ నేతలుమాత్రం ప్రజలు తమనే ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు…కింగ్‌ మేకర్‌గా మారాలని వ్యూహాలకుపదునుపెడుతున్నాయి చిన్నపార్టీలు. బిజెపి అగ్రనేతలు ఛత్తీస్ ఘడ్ పై ప్రత్యేకదృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛత్తీస్ ఘడ్ లో పాగా వేయాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు.

ఛత్తీస్ గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరోసారి గెలుపు కోసం కాంగ్రెస్‌ వ్యూహాలకు పదును  పెడుతోంది. గత ఐదేళ్లలో అమలుచేసినసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ఉన్న జనాదరణే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్‌ నాయకులు. మరోవైపు…ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టదలతో ఉన్నారు బీజేపీ నాయకులు. దీని కోసం వారు ప్రచారాన్ని వేగవంతంచేశారు.

బఘేల్‌ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని…వారంతా తమనే ఆదరిస్తారన్న చెబుతున్నారు బీజేపీ నేతలు. ప్రధాన పార్టీలతోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇతర చిన్నా చితక పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. కొన్ని సీట్లయినా గెలుచుకొని కింగ్‌మేకర్‌ కావాలని చిన్నపార్టీలు ఆరాటపడుతున్నాయి.

ఛత్తీస్‌ గఢ్‌లో కాంగ్రెస్‌ 15 ఏళ్ల తర్వాత 2018లో అధికారం వచ్చింది. బీజేపీ మొదట్లో బలహీనంగా ఉన్నట్టు కనిపించినా… ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ కాంగ్రెస్‌కు సవాల్‌ విసురుతోంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతి, స్కామ్‌లు,బుజ్జగింపు రాజకీయాలు, మత మార్పిడులను ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చి బఘేల్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది బీజేపీ. అంతేకాదు… ఎన్నికల ప్రచార వ్యూహాన్ని కూడా మార్చారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్‌అవినీతిని ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకితీసుకెళ్తున్నారు. మోదీకి వస్తున్న జనాదరణ తమకు ఓట్ల రూపంలో లాభం చేకూరుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు.

ఇక…ఛత్తీస్‌గఢ్‌లో ఎలాగైనా పాగా వేయాలని గట్టిగా కోరుకుంటున్నారు  ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. దాంట్లో భాగంగానే గత మూడు నెలల్లో  నాలుగు బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. అమిత్‌ షా కూడాతరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పైగా…అధికారంలోకి వచ్చిన వెంటనే బఘేల్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణజరిపిస్తామని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు… రాష్ట్ర బీజేపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలనుపరిష్కరించడంపైనా మోదీ, షా దృష్టిపెట్టారు.ఛత్తీస్‌ గఢ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాని పోటీ ఉంది. గత ఎన్నికల్లో ఆప్‌ పోటీచేసినా  పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ఈసారి కొన్ని సీట్లయినా గెలుచుకుని అసెంబ్లీలోకి అడుగుపెడతామని ధీమా వ్యక్తంచేస్తున్నారు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు. ఈ ఎన్నికల్లో సర్వ ఆదివాసీ పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీలు కూడాపోటీపడుతున్నాయి.

జనాభాలో 32 శాతం మంది ఉన్న గిరిజనులపై పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకుగాను కాంగ్రెస్‌ 68 స్థానాలను గెలిచింది. బీజేపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చాయి. మాజీ సీఎం అజిత్‌ జోగీ ఏర్పాటుచేసిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌కు ఐదు సీట్లు వచ్చాయి. బీఎస్పీ రెండు స్థానాలను గెలుచుకుంది. మరి ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కుతుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి