మేడ్చల్ రాజకీయం మారబోతోంది. ఓ రైజింగ్ స్టార్ అసెంబ్లీ ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డితో విసుగుచెందిన జనం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వేళ తోటకూర జంగయ్య యాదవ్ అలియాస్ వజ్రేష్ జనంలోకి వచ్చారు. సమస్యల పరిష్కారం తనవల్లే సాధ్యమని చెప్పేందుకు ఆయన వెనుకాడటం లేదు.
సామాజిక కార్యకర్త రాజకీయాల్లోకి అడుగుపెడితే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా మేడ్చల్ నియోజకవర్గం పరిస్తితి వజ్రేష్ యాదవ్ కు పాజిటివ్ గా తయారైంది. మంత్రి మల్లారెడ్డి అవినీతి, మితిమీరిన పబ్లిసిటీ కారణంగా జనం మదిలో నెగిటివ్ మైండ్ సెట్ ఏర్పడిన నేపథ్యంలో నేనున్నానంటూ వజ్రేష్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. సామాజిక సేవలో తరిస్తూనే పీఆర్పీ, టీడీపీ లాంటి పార్టీల్లో పనిచేసిన వజ్రేష్.. తన మిత్రుడు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ట్రాక్ రికార్డు చూసిన వెంటనే పీసీసీ ఉపాధ్యక్ష పదవి కూడా అంది వచ్చింది. ఇప్పుడాయన మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. అధిష్టానం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచి అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మేడ్చల్ కు టికెట్ కేటాయించింది. పార్టీ బలం, సొంత బలం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
పీఆర్పీలోనైనా, ఇతర పార్టీలోనేనా పోటీ చేయడం వేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడం వేరు.టీడీపీ దెబ్బతిన్న తర్వాత తెలంగాణలో బీసీలంతా కాంగ్రెస్ వైపుకు చూస్తున్న తరుణంలోనే వజ్రేష్ యాదవ్ కూడా హస్తం పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఐదు బలమైన బీసీ కులాల్లో యాదవులు కూడా ఒకటి కావడం కాంగ్రెస్ అభ్యర్థిగా వజ్రేష్ కు కలిసొచ్చే అంశం. పైగా నిత్యం జనంలో ఉండటం వజ్రేష్ కు ఉన్న అదనపు ఆకర్షణగా చెప్పాలి.
వజ్రేష్ ను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి చేయని ప్రయత్నం లేదు. మూడెకరాలు కబ్జా చేశారంటూ ఆయన స్థలానికి కట్టుకున్న గోడను కూల్చేయించారు. పట్టా పాస్ బుక్ ఉందీ,రైతు బంధు ఉందని డాక్యుమెంటు చూపించినా ప్రభుత్వం వినలేదు. ఇప్పుడదే వజ్రేష్ కు పాజిటివ్ గానూ, మల్లారెడ్డికి నెగిటివ్ గానూ తయారైంది. రాజకీయ ప్రత్యర్థులను ప్రభుత్వం ఎలా వేధిస్తుందో తెలిసిపోయింది. వజ్రేష్ మాత్రం తన నిజాయితీని నిరూపించుకుని ఇమేజ్ పెంచుకున్నారు. మరో పక్క వజ్రేష్ కు కొన్ని నెగిటివ్ పాయింట్లు కూడా లేకపోలేదు. బోడుప్పల్ ప్రాంతంలో ఆయనకు ఉన్నంత పబ్లిసిటీ.. ఇటు వైపు లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కనీసం ముఖ పరిచయం లేని కాలనీలు కూడా చాలానే ఉన్నాయి. ఉన్న కొద్ది పాటి సమయాన్ని ఆయన జనంలోకి వెళ్లడానికి వినియోగించాల్సి ఉంటుంది.
మేడ్చల్ లో కాంగ్రెస్ హవా వీస్తోందని తాజా సర్వేలు తేల్చాయి. పరిస్థితులు వజ్రేష్ కు అనుకూలంగా మారుతున్నాయని అదే సర్వేలు చెబుతున్నాయి. దాదాపు 60 శాతం మంది జనం కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మల్లారెడ్డి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని తేలిపోయింది. పైగా ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ వజ్రేష్ యాదవ్ కు వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి