చంద్రబాబు ఆరోగ్యంపై వై”ఛీ”పీ

By KTV Telugu On 28 October, 2023
image

KTV TELUGU :-

రాజకీయాలంటేనే ఛీప్ ట్రిక్స్. అందులోనూ ఏపీ అధికార పార్టీ వైసీపీ కాస్త ఎక్కువే ఛీప్ ట్రిక్స్ వదులుతుంటుంది. అధికారంలో అంటి పెట్టుకుని ఉండేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం లేదు. లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేసి,కేసులు మీద కేసులతో విసిగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మైండ్ గేమ్ కు కూడా తెరతీసింది. చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు దాచడమే కాకుండా ఏదో జరిగిపోతోందన్న రేంజ్ లో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడు పదుల వయసులో ఆయనకు కంటి సమస్యలతో పాటు ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని తెలుస్తోంది. కుడికంటికి సత్వరమే శస్త్రచికిత్స చేయాలని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్రవైద్యశాల నిపుణులు సూచించగా.. ఆయనకు వెంటనే వివిధ రకాల వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ నెల 21న ఒక నివేదికలో వివరించారు.

నిజానికి చంద్రబాబు నేత్ర సమస్య కొంత తీవ్రమైనదేనని చెప్పాలి. ఈ ఏడాది జూన్ 21న ఆయన ఎడమ కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేశారు. అప్పుడు రెండు కళ్ల చూపులో కొంత వ్యత్యాసం ఏర్పడిన మాట వాస్తవం. దాని కోసం మూడు నెలల్లో కుడి కంటి శుక్లానికి కూడా శస్త్రచికిత్స చేయాలని ఎల్‌వీ ప్రసాద్‌ వైద్యులు సూచించారు. అది కూడా ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ను మేనేజ్‌ చేస్తూ, గ్లకోమా వైద్య నిపుణుల పర్యవేక్షణలో, అన్ని వసతులున్న నేత్ర చికిత్సా కేంద్రంలోనే ఆపరేషన్ చేయాలి. ఇదిలా ఉండగా ఆయన మరికొన్ని  ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు.

చంద్రబాబుకు వెన్ను కింద భాగంలో నొప్పి, మల ద్వారం వద్ద నొప్పితో బాధపడుతున్నారని , ఒంటిపై దద్దుర్లు బాగా పెరిగాయని వైద్య నివేదిక చెబుతోంది. పైగా రెండు రకాల వైద్య నివేదికలు రూపొందించి ఒకటి జనంలోకి వదిలి, మరోటి కుటుంబ సభ్యులకు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఆయనకు 2డీ ఎకో సహా అనేక పరీక్షలు చేయాల్సి ఉన్నప్పటికీ బీపీ,షుగర్ చెక్ చేయడం తప్పితే ఒరిగించిందేమీ లేదనే చెప్పాలి.  ఐనా వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు పట్ల అత్యంత   అనాగరికంగా వ్యవహరిస్తున్నారు.  2024లో చంద్రబాబు ఛస్తారని.. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  జోస్యం చెప్పడం ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. చంద్రబాబు ముందు బస్సు యాత్రచేశారని, ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని మాథవ్ వ్యాఖ్యానించారు. ఇదీ వైసీపీ నేతల్లో ఉన్న ఉద్దేశాన్ని  బయట పెడుతోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.ఇలాంటి ప్రచారాలు చేసి  చివరకు చంద్రబాబును జైల్లో చంపేసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు భయపడతున్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు అడ్డూ అదుపు లేకపోవడం, జైల్లో జరుగుతున్న కుట్రను వాళ్లు నర్మగర్భంగా వెల్లడి చేస్తున్నారని కూడా టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి..

చంద్రబాబు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు చల్లటి వాతావరణాన్ని కొనసాగించాలి., శరీరానికి బాగా గాలి తగిలే దుస్తులు ధరించాలి, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోకూడదు. సౌకర్యంగా ఉండే కుర్చీనే వాడాలి. ఈ సంగతులన్నీ తెలిసినా జైలు అధికారులు కానీ, ప్రభుత్వం గానీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కోర్టు  ఉత్తర్వుల తర్వాతే టవర్ ఏసీ ఏర్పాటు చేశారు. అందుకే సాధ్యమైనంత వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టి మానసిక వత్తిడికి గురి చేసే  ప్రయత్నం జరుగుతోందని టీడీపీ  వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా  నేకెడ్ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన  వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లుంది. ఆయన ఒక్కరే కాదు. వైసీపీ నేతల్లో చాలా మంది చంద్రబాబును అనరాని మాటలు అంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే తప్పేమిటన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి వారి మాటలు కరెక్టో కాదో.. జనమే సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారు. ప్రజల మనోగతమే  ముఖ్యమని మరిచిపోకూడదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి