బ్రాహ్మణి మౌనానికి కారణం అదేనా ?

By KTV Telugu On 28 October, 2023
image

KTV TELUGU :-

నారా బ్రాహ్మణి ఏం చేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు. దాని వెనుక ఎవరి వ్యూహముంది… అది టీడీపీ గేమ్ ప్లానా. లేక వేరే భయాలు ఏమైనా ఉన్నాయా…

నారా భువనేశ్వరి ఆరు పదులు దాటిన వయసులో ఇప్పుడు ట్రెండింగ్ పాలిటీషియన్. ఇప్పుడామె  టీడీపీకి పెద్ద దిక్కు. పార్టీని దివిటీ పట్టుకుని నడిపిస్తున్నారు. నిజం గెలవాలి బస్సు యాత్ర, బహిరంగ సభ మొదటి రోజు సూపర్ సెక్సెస్ అయ్యిందనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఇల్లు దాటని  భువనేశ్వరి పార్టీ కోసం, తెలుగు ప్రజల కోసం వీధుల్లోకి వచ్చారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అదో ఇమేజ్ బిల్డప్ కావచ్చు. కానీ లోకేష్, బ్రాహ్మణి ఉండగా ఆమె ఎందుకు బయటకు వచ్చారన్నది పెద్ద ప్రశ్న. లేడీస్ సెంటిమెంట్ రగిల్చి అడ్వాంటేజ్ తీసుకోవాలంటే యువ నేతగా నారా బ్రాహ్మణిని రంగంలోకి దించొచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబును అరెస్టు చేసిన తొలినాళ్లలో రాజమండ్రిలో హడావుడి చేసిన నారా బ్రాహ్మణి ఇప్పుడు లో ప్రొఫైల్ గా ట్వీట్లలో ఎందుకు సరిపెడుతున్నారన్న   ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది..

భువనేశ్వరి చేసే యాత్రలు నారా బ్రాహ్మణి చేస్తే యూత్ లో పార్టీకి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేదన్నది ఒక వర్గం వాదన. లోకేష్ ఢిల్లీలో గడపటానికి కారణం ఏదైనా సరే.. బ్రాహ్మణిని మాత్రం జనంలో తిప్పి ఉంటే గేమ్ ఛేంజర్ అయ్యేదన్నది కొందరి టాక్. అయితే చంద్రబాబు సూచనలు, ఆదేశానుసారమే బ్రాహ్మణిని సైడ్ ట్రాక్ చేసి, భువనేశ్వరిని రంగంలోకి దించారని చెబుతున్నారు. భువనేశ్వరి రావడం వల్ల పార్టీ కార్యక్రమాలకు పెద్దరికం అద్దినట్లవుతుందన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. పైగా ఒకటి రెండు తప్పులు జరిగినా  ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. మరో  పక్క  బ్రాహ్మణి రంగంలోకి దిగితే ప్రత్యర్థి  పార్టీలకు ఇంధనం అందించినట్లవుతుందని టీడీపీ పెద్ద ఆలోచించారని  చెబుతున్నారు. వైసీపీ బ్యాచ్ ఆమెపై కామెంట్ చేయడానికి వెనుకాడకపోవచ్చు. చివరకు వైసీపీ సోషల్ మీడియా బాడీ షేమింగ్ కు కూడా పాల్పడే ప్రమాదం ఉందని చంద్రబాబు కుటుంబం ఆలోచించిందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అదే టైమ్ లో పార్టీకి ఉన్న వనరులు, ఎనర్జీస్ ఒకే టైమ్ లో వేస్ట్ చేయడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. బ్రాహ్మణిని బ్యాకప్ గా వాడాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో బ్రాహ్మణి సేవలను  వినియోగించుకుంటే పార్టీకి  కూడా మంచిదని చంద్రబాబు  ఆలోచించినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు చాణక్యం ఇక్కడ కూడా పనిచేసింది. బ్రాహ్మణి ఫేస్ వాల్యూ ఆయనకు బాగానే  తెలుసు. టీడీపీ ఇప్పుడు  పూర్తి సంక్షోభంలో ఉందని కూడా ఆయన అర్థం చేసుకున్నారు.  ఇవ్వాళ కాకపోతే రేపు తాను జైలు నుంచి వచ్చి ప్రజాక్షేత్రంలో ఇంతకంటే ఫోర్స్ గా పనిచేయగలనని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. ఈ లోపే పార్టీకి, ఫ్యామిలీకి ఉన్న రిజర్వ్ ను వాడేస్తే తర్వాత ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోనే బ్రాహ్మణిని కొన్ని రోజులు ఆగమని  చెప్పినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఒక్క సారి ఆమె పూర్తి స్తాయిలో ప్రజాక్షేత్రానికి వస్తే మాత్రం  ఆ తీరే వేరుగా ఉంటుందనడానికి సందేహించాల్సిన పనిలేదు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి