కారులేని కారు పార్టీ చీఫ్   

By KTV Telugu On 11 November, 2023
image

KTV TELUGU :-

కేసీఆర్ అనుకున్నదీ  సాధించారు.. తెలంగాణ  వచ్చింది. సీఎం కావాలనుకున్నారు.  అయ్యారు.వరుసగా మూడో సారి గెలవాలనుకుంటున్నారు.. ఈ పని  జరుగుతుందో లేదో కానీ, ఒక విషయంలో మాత్రం వెలితి కనిపిస్తోంది. ఆయన పార్టీ గుర్తు కారు.  ఇదీ  మొదటి నుంచి ఉన్న గుర్తే  కాకపోతే ఆయన పేరుతో ఒక కారు కూడా లేదు. అదే చోద్యం. నిజంగా  కొనలేకపోయారో, కొనకూడదనుకున్నారో తెలీదు గానీ , కారు పార్టీ ఓనర్ కు కారు మాత్రం లేదు. మరో విషయం ఏమిటంటే ఆయన, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో 14 వాహనాలున్నాయి.  అవన్నీ వ్యవసాయ పనులకు వినియోగించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలనీ కేసీఆర్ చెబుతున్నారు..అందులో ఐదు ట్రాక్టర్లు, ఒక హార్వెస్టర్, డీసీఎం  కూడా ఉన్నాయి.

కేసీఆర్ తాను  ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో  కూడా ఒకే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆయన తన ఆస్తులు, అప్పులు, తనపై ఉన్న కేసులు, విద్యార్హతలు, ఇతర అంశాలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశారు. దాని ప్రకారం.. నామినేషన్ వేసే నాటికి కేసీఆర్ చేతిలో 2,96,605 రూపాయల నగదు ఉన్నట్లు వెల్లడించారు.బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్, టెర్మ్ డిపాజిట్లు వంటి అన్ని ఖాతాలలో ఆయనకు రూ. 11,16,25,887 ఉన్నట్లు చూపించారు.ఆయన భార్య కల్వకుంట్ల శోభకు బ్యాంకులలో 6,29,08,404 రూపాయలుంది ఉంది.అంటే కేసీఆర్  కంటే ఆయన సతీమణి చేతుల్లోనే ఎక్కువ క్యాష్ ఉందనుకోవాలన్నమాట. కేసీఆర్ వార్షికాదాయం కోటి 60 లక్షల 64 వేల 390 రూపాయలు. టీ న్యూస్ లో ఆయన రెండు కోట్ల 31 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నమస్తే తెలంగాణ పత్రికలో ఆయన నాలుగు కోట్ల 16 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మరో విషయం ఏమిటంటే కేసీఆర్ కు అప్పులకేమీ తక్కువ  లేదు. ఆయన చెల్లించాల్సిన అప్పులు 24 కోట్ల 51 లక్షల రూపాయలని తేలింది. కేసీఆర్ పై తొమ్మిది క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కేసీఆర్ దంపతుల పేర్లతో ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ దాదాపు 59 కోట్ల రూపాయలు. అంటే అప్పుల కంటే అవి రెట్టింపు  అన్నమాట.  కాస్తలో కాస్త నయమని చెప్పుకోవాలి.

ఇక బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కంటే ఆయన సతీమణి శైలిమ ఎక్కువ సంపన్నురాలు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో కేటీఆర్‌ తనతోపాటు, తన భార్య ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు అఫిడవిట్‌ సమర్పించారు. దీని ప్రకారం.. కేటీఆర్‌కు ఒక ఇన్నోవా కారుంది. 2018 ఎన్నికల నాటికి ఆయనకు 3 కోట్ల 63 లక్షల రూపాయలు చరాస్తులుండగా.. ప్రస్తుతం అవి ఆరు కోట్ల 93 లక్షలకు పెరిగాయి. కేటీఆర్‌ భార్య శైలిమకు ప్రస్తుతం 26.49 కోట్లవిలువైన చరాస్తులున్నాయి. కేటీఆర్‌ పేరిట 10.41 కోట్లు.. శైలిమ పేరుతో 7.42 కోట్లు, వారి కుమార్తె అలేఖ్య పేరుతో 46.71 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయి. ఈ కుటుంబానికి 14.93 లక్షల మేర ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. కేటీఆర్‌ వద్ద 2.50 లక్షల విలువైన 100 గ్రాములు, శైలిమ వద్ద 1.89 కోట్ల విలువైన 4.7 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి