ఖమ్మం జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటమిలపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి…ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పటికే 100కోట్లపైనే బెట్టింగ్ మార్క్ దాటినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..పొలింగ్ సమయానికి ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది…ఆంధ్రాకు చెందిన ఓ వర్గం వాళ్లు ఈ బెట్టింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది..మరోవైపు అభ్యర్థులు సైతం గెలుపు,ఓటమిలపై బెట్టింగ్ లు పెట్టవద్దని సూచిస్తున్నారు..ఇంతకీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ లు భారీ ఏత్తున్న నడుస్తున్న ఆ నాలుగు నియోజకవర్గాలేంటి?
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం వైపు చూస్తున్నాయి..కాంగ్రెస్,బీఆర్ఏస్ పార్ట ల మధ్యనువ్వా నీనా అనేరితిలో టఫ్ ఫైట్ నడుస్తుంది.ప్రధాన పార్టీల మధ్య తగ్గాపోరు నడుస్తు ఉండటంతో బెట్టింగ్ లు సైతం అదే స్థాయిలో రంజుగా నడుస్తున్నాయి.ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బెట్టింగ్ లు పెద్ద ఏత్తున నడుస్తున్నాయి.ఇందులో టాప్ లో ఖమ్మం,పాలేరు నియోజకవర్గాలు ఉండగా..తర్వాత స్థానాల్లో సత్తుపల్లి,మధిర నియోజకవర్గాలు ఉన్నాయి.
ఖమ్మం అసెంబ్లీ బరిలో బీఆర్ఏస్ పార్టీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు బరిలో ఉన్నారు..ఈ ఇద్దరి గెలుపు ఓటమిలపై భారీ బెట్టింగ్ లు నడుస్తున్నాయి..పది వేలలోపు మోజార్టీ తో గెలుస్తారని రెండు వైపుల బెట్టింగ్ నడుస్తు ఉండగా…30వేలు మోజార్టీ దాటుతుందని ఓ పార్టీ అభ్యర్థిపై భారీ ఏత్తున బెట్టింగ్ పెట్టారు..పాలేరు నియోజకవర్గంలో సైతం అదే పరిస్తితి ఉంది…ఇక్కడ కూడ బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది..బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు..ఇక్కడ కూడ ఓ పార్టీ అభ్యర్థి 20వేల లోపు మోజార్టీతో గెలుస్తారని బెట్టింగ్ లు నడుస్తున్నాయి.
ఓక్క ఓటుతోనైన అభ్యర్థుల గెలుపు,ఓటమిలకు సంబంధించే ఏక్కువగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి..ప్రస్తుతం ఖమ్మం,పాలేరు ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఏకంగా 100కోట్లు బెట్టింగ్ లు దాటాయనే ప్రచారం జరుగుతుంది..ఈ ఎన్నికల పొలింగ్ సమయానికి ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..తర్వాత స్థానాల్లో సత్తుపల్లి,మధిర నియోజకవర్గాలు ఉన్నాయి..అనుహ్యంగా సత్తుపల్లి నియోజక వర్గంలో బెట్టింగ్ లు భారీ గా పెరిగాయి..ఇక్కడ కూడ ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోటి నడుస్తు ఉండటమే ఇందుకు కారణం..ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులకు సంబంధించి 5 వేల లోపు మోజార్టీతో బయట పడుతారని బెట్టింగ్ లు నడుస్తున్నాయి.
బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయి బరిలో ఉన్నారు…మధిర లో సైతం సీఏల్పీ నేత భట్టి విక్కమార్క గెలుపు,ఓటమిలపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి…మధిర లో బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్ బరిలో ఉండగా…కాంగ్రెస్ నుంచి భట్టి విక్కమర్క బరిలో ఉన్నారు..10వేల లోపు మోజార్టీతో గెలుస్తారని రెండు వైపుల నుంచి బెట్టింగ్ లు నడుస్తున్నాయి…ఇదిలా ఉంటే ప్రదాన పార్టీల అభ్యర్థులు సైతం గెలుపు,ఓటమిలపై బెట్టింగ్ లు పెట్టవద్దని సూచిస్తున్నారు…ఓ పార్టీ కి చెందిన అభ్యర్థి ఇదే విషయంను డైరెక్ట్ గానే ప్రెస్ మీట్ లో పెట్టారు..దిన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఖమ్మంలో బెట్టింగ్ లు ఏస్తాయిలో నడుస్తున్నాయో తెలుస్తుంది.
రోజు రోజుకి పొలిటికల్ ఈక్వేషన్స్ షరవేగంగా మారుతు ఉండటంతో బెట్టింగ్ లు సైతం అదే స్థాయిలో స్పీడ్ అందుకుంటున్నాయి..ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఏవరు గెలుస్తారు ఏవరు ఓడుతారన్న దానిపై నిరంతరం ఆరా తీస్తు బెట్టింగ్ లు పెడుతున్నారు…ఇదిలా ఉంటే ప్రదాన పార్టీల అభ్యర్థులు సైతం గెలుపు,ఓటమిలపై బెట్టింగ్ లు వేయద్దని సూచిస్తున్నారు…ఓ పార్టీ కి చెందిన అభ్యర్థి ఇదే విషయంను డైరెక్ట్ గానే ప్రెస్ మీట్ లో పెట్టారు..దిన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఖమ్మంలో బెట్టింగ్ లు ఏస్తాయిలో నడుస్తున్నాయో తెలుస్తుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…