గెలుపు మంత్రం..రేవంత్ నాయకత్వం

By KTV Telugu On 4 December, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ అనుకున్నది సాధించింది. రేవంత్ రెడ్డి కొత్త చరిత్రకు తెరతీశారు. అధికార బీఆర్ఎస్‌ను కిందకు లాగి హస్తం పార్టీ తెలంగాణలో అధికారాన్ని హస్తగతం  చేసుకుంది. రెండు నెలలుగా మెజార్టీ వర్గంలో ఈ విజయంపై ఆశలుండగా, మిగిలిన వారి అనుమానాలు కూడా కౌంటింగ్‌తో పటాపంచలైంది.

మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి నినాదం బాగానే పనిచేసింది. జనం నిజంగానే మార్పు కోరుకున్నారని ఫలితాలు తేటతెల్లంచేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ అసలు ఫలితాలు వచ్చేశాయి. రెండు పర్యాయాలుగా  ఇంటికి పరిమితమవుతున్న  కాంగ్రెస్ నేతలు ఈ సారి అధికారపీఠంపై  కూర్చునే అవకాశం పొందారు. దీనితో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఇంట సంబురాలు జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం తర్వాత కాంగ్రెస్ కు వచ్చి తొలి విజయం కూడా ఇదే. పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ వచ్చిన తర్వాత  తొలి సారి కాంగ్రెస్ అధికారానికి రావడంతో ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా పార్టీ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు…కాంగ్రెస్ విజయానికి కారణాలేమిటంటే చాలానే  ఉన్నాయని చెప్పాలి. ఎన్నడూ లేని ఐక్యత ఈ సారి పార్టీ నేతల్లో కనిపించడం అందులో ఒకటి మాత్రమే. కేసీఆర్ కుటుంబ పాలనపై తెలంగాణ ప్రజలు విసుగుచెందడం కూడా లెక్కగట్టుకోవాలి…

రేవంత్ రెడ్డి నాయకత్వమే ఈ సారి ప్లస్ పాయింట్ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపించింది. ఒకప్పుడు అంతర్గత కుమ్ములాటలతో కూనారిల్లిన కాంగ్రెస్ ఇప్పుడు ఐకమత్యానికి చిహ్నంగా నిలిచింది.  ఒక నేత పైన ఉంటే నలుగురు కిందకు లాగే పరిస్థితుల నుంచి అందరూ రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించే స్థాయికి వచ్చారు. సీఎం అభ్యర్థిపై అనవసర రచ్చ చేసుకోకుండా పార్టీ వారంతా ఏకతాటిపై నిలిచారు. గ్రూపులను ప్రోత్సహించకుండా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్త పడింది. మరో పక్క బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని కాంగ్రెస్ నమ్మించగలిగింది. అంతకు మించి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. వీటన్నింటికీ మించిన అంశం మరోటి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పట్ల తెలంగాణ  ఓటర్లలో విశ్వాసం కలిగింది. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని వాళ్లు నమ్మడమే విజయానికి చిన్నమైంది..ఆరు నెలలుగా కాంగ్రెస్ నేతలు అహర్నిశలు పనిచేశారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ఇస్తున్న హామీలను వివరించారు,. పార్టీకి అపూర్వ విజయం చేకూర్చిపెట్టారు.  ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చరిత్రకు తెరతీసినట్లయ్యింది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి