వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఉండవల్లి శ్రీదేవీ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న చర్చ ఊపందుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవి 2014 ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉండవల్లి.. విజయం దక్కించుకున్నారు. అయితే, తర్వాత పరిణామాల నేపథ్యంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే ఆరోపణలు వచ్చాయి.దీంతో వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక, ఆ తర్వాత ఆమె నేరుగా టీడీపీకి మద్దతు తెలిపారు. శుక్రవారం ఆమె అధికారికంగా టీడీపీలో చేరారు. పార్టీలో చేరకముందు నుంచే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉండవల్లి శ్రీదేవీ.. తాడికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. అక్కడ తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఆమెను నిరాశ పరిచే ఉద్దేశం లేని టీడీపీ అధినేత చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో శ్రీదేవిని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తిరువూరు నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తిరువూరు టీడీపీ నేతలు పార్టీని పటిష్టం చేయలేకపోతున్నారన్న చర్చ నడుమ శ్రీదేవికి ఆక్కడి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనితో శ్రీదేవీ నియోజకవర్గమే కాదు జిల్లా మారినట్లు అవుతుందని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…