భీమవరంలో జనసేనాని యుద్ధం గెలుస్తారా ?

By KTV Telugu On 25 December, 2023
image

KTV TELUGU :-

జనసేన అదినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అందులో ఒకటి భీమవారం. భారీ మెజార్టీ వస్తుందనుకున్న స్థానంలో ఆయన పరాజయం పాలయ్యారు. అది ఎలా జరిగిందన్నది ఇప్పటికీ  జనసైనికులకు  అర్థం కావడం లేదు. అయితే ఈ సారి పవన్ భీమవరం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు భీమవరంలో పరిస్థితి ఎలా ఉంది ?  టీడీపీతో పొత్తుతో పవన్ గెలుస్తారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మళ్లీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉందని డిస్కషన్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. ఆ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈసారి భీమవరం నుంచే బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.  వేరే నియోజకవర్గాలకు వెళ్లరని ఖచ్చితంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో గాజువాక కన్నా భీమవరానికి పవన్ ప్రాథాన్యమిచ్చేఅవకాశాలు ఉన్నాయి.

పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం మూడోస్థానంలో నిలచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లును కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం ఖాయమని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి.

తెలుగుదేశం, జనసేన పొత్తులపై రెండు పార్టీల అధిష్ఠానాలు స్పష్టత ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ముందునుంచే కలయిక ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీ నాయకులు చర్చించుకునే బరిలో నిలిచారు. ఆచంట, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించారు. అప్పటినుంచే రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది. గత ఎన్నికల్లోనే.. జనసేనకు 62 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి.. భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా.. వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ నాయకులంతా.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భీమవరంలో.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు.. భీమవరమేనని చెబుతున్నారు.

ఒకప్పుడు.. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న భీమవరం.. రకరకాల రాజకీయ కారణాలతో.. పట్టు కోల్పోయింది.    1952లో.. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు.. 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో వీచిన జగన్ వేవ్‌లో.. వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో.. భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం, వీరవాసరం  మండలాలున్నాయి. వీటి పరిధిలో.. 2 లక్షల 46 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా క్షత్రియ, కాపు  సామాజికవర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ సెగ్మెంట్‌లో.. కాపు సామాజికవర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది.

భీమవరంలో తెలుగుదేశంకి గట్టి నాయకుడు లేరు.  గ్రూప్ పాలిటిక్స్.. పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకప్పుడు.. టీడీపీకి ఎదురులేని సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్.. ఇప్పుడు సరైన నాయకత్వం లేక.. వెనుకబడిపోతోంది. ప్రస్తుతం.. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న, జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి  కి వ్యతిరేకంగా.. పార్టీలో కొత్త వర్గం తయారైంది. సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా.. టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో.. భీమవరంను జనసేనకు కేటాయించడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు.  భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని.. ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. దాంతో.. ఎలాగైనా.. ఇక్కడ గెలవాలని, అధికార, ప్రతిపక్ష పార్టీలు.. వ్యూహాలు రచిస్తున్నాయ్. ఎవరికి వారు.. నియోజకవర్గంలో బలపడేందుకు.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరంలో పొత్తులు కీలకం కానున్నాయి. టీడీపీ, జనసేన కలిస్తే…  ఈ నియోజకవర్గంలో ఫలితం ఏకపక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేపై వ్యతిరేకత..  ప్రభుత్వంపై వ్యతిరేకత .. అన్నీ కలిపి ఫలితాలను నిర్ణయించనున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి