సోమిరెడ్డికి సీటు హుళ‌క్కేనా?

By KTV Telugu On 26 December, 2023
image

KTV TELUGU :-

వరుసగా ఓటమి చెందుతూ వచ్చిన నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే  ప్రసక్తే లేదని టిడిపి జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య  సీనియర్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో  వరుసగా  అయిదు సార్లు ఓటమి చెందిన  నెల్లూరు జిల్లా సర్వేపల్లి  ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే  లోకేష్ వ్యాఖ్యలతో  తీవ్ర ఆందోళనలో పడిపోయారనే చెప్పాలి. 2004  ఎన్నికల నుండి ఆయన ఏ ఎన్నికలోనూ గెలవలేదు. చివరకు ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిలో కొనసాగాల్సి వచ్చింది. ఈ సారి కూడా సర్వేపల్లి నుండి పోటీచేయాలనుకుంటోన్న  చంద్రమోమన్ రెడ్డికి  లోకేష్ బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి  పరిస్థితి  రోజురోజుకు దిగజారిపోతోంది.. ముఖ్య నేతలందరూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి జై కొడుతున్నారు.. ఒక్కొక్కరిగా టిడిపి కీ గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఖరి నచ్చక కొందరు.. పార్టీ ఇక అధికారంలోకి వచ్చేది లేదని డిసైడ్ అయ్యి మరికొందరు.. మంత్రి కాకాని వెంట నడుస్తున్నారు.. క్యాడర్ చెదిరిపోతూ ఉండడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ భయం పట్టుకుందట.

వచ్చే ఎన్నికల్లో సీనియర్లకి టికెట్ ఇచ్చేది లేదని లోకేష్ తేల్చి చెప్పడంతో.. సోమిరెడ్డి అంతర్మదనంలో పడ్డారట.. ఓటమిలో రికార్డులు సృష్టించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీ టిక్కెట్ ఇవ్వకుండా అతని స్థానంలో కొత్తవారిని బరిలోకి దింపాలని టిడిపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది..మాజీ మంత్రి సోమిరెడ్డి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదంటూ సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతుంది.. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ పై క్లారిటీ కోసం చిన్న బాబును కలిశారట.. అక్కడ కూడా ఆయనకి నిరాశ ఎదురయిందట..

ఐదు సార్లు ఓడిపోయిన మీకు టికెట్ ఇచ్చేది లేదని.. సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు వదిలేసి పక్క నియోజకవర్గాల్లో ఎందుకు తిరుగుతున్నారని లోకేష్ సోమిరెడ్డిని ప్రశ్నించారట.. జిల్లాలో మీ వల్లే పార్టీ నాశనం అవుతోందని లోకేష్    సీరియస్ గా  వ్యాఖ్యానించడంతో  సోమిరెడ్డి షాక్ తిన్నారని అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడి వద్దనే  తన టికెట్ సంగతి తేల్చుకోవాలని సోమిరెడ్డి ఉన్నట్లు  ప్రచారం జరుగుతోంది.అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు సోమిరెడ్డికి టికెట్ లేదని లోకేష్ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలంటున్నాయి.

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎదుర్కొనే స్థాయి సోమిరెడ్డికి లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.. దీంతో కొత్త అభ్యర్థి కోసం టిడిపి అన్వేషిస్తోందని  ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఉన్న టిడిపి నాయకులు మంత్రి కాకాని పై పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని.. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో ముఖ్యమైన  నేతలు  వైసీపీలో చేరడం…. సోమిరెడ్డి పై అన్ని వర్గాలలో వ్యతిరేకత కనిపిస్తూ ఉండడంతో నియోజకవర్గం పై అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టిందట..సర్వేపల్లి నియోజకవర్గం లో మాత్రమే తిరగాలని.. బయట నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దని మాజీ మంత్రి సోమిరెడ్డికి టిడిపి హై కమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.

సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి తిరుగుతున్నప్పటికీ ప్రజల నుంచి స్పందన  రావడం లేదని టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి లో సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం డబల్ హట్రిక్ ఓటమి తప్పదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.. సోమిరెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులే సహకరించే పరిస్థితి లేదంటున్నారు. అంతగా  గెలిచే పరిస్థితి లేకపోతే సర్వేపల్లిని జనసేన  కోటాలో రాసిచ్చేసే  అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి