ప్రజాపాలన జరిగే విధానం

By KTV Telugu On 27 December, 2023
image

KTV TELUGU :-

ఆరు గ్యారంటీల అమలుకు కసరత్తు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించినది ప్రభుత్వం.ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమాను ప్రారంభించారు. అభయ హస్తం కింద మిగిలిన గ్యారెంటీ లపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గ్రామంలో ప్రజా పాలన సభలను నిర్వహించనున్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు.

ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజా పాలన ప్రజల వద్దకు చేర్చేందుకే ఈ ప్రజా పాలన కార్యక్రమం అంటోంది  ప్రభుత్వం. దానికోసం  ప్రతి గ్రామంలోనూ అభయహస్తం సభలను ఏర్పాటు చేయనుంది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ సభలో ఆరు గ్యారెంటీ ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. మహాలక్ష్మి, గృహజ్యోతి,రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు,చేయూత పథకం, యువ వికాసం పథకాలపై దరఖాస్తుదారులు,తమ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ లతో పాటు ఫోటో జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు పత్రంతో ఆధార్ కార్డు మరియు ఫోటో ఇస్తే సరిపోతుంది. గ్రామసభల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుతో పాటు,చదువు రానివారి కోసం ఆశ వర్కర్లు,అంగన్వాడీ కార్యకర్తలను సహకరించాలని ఆదేశించింది ప్రభుత్వం. ఇక గ్రామసభలను పర్యవేక్షించేందుకు,ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక ప్రత్యేక అధికారి ఉంటారు. ఈ సభలను నిర్వహించేందుకు ఒక్కొక్క సభకు పదివేల రూపాయలు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.

ప్రజా పాలన అర్హుల ఎంపిక వంటి కార్యక్రమాలను ఇన్చార్జ్ మంత్రులు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్- ఉత్తంకుమార్ రెడ్డి,మహబూబ్నగర్ -దామోదర్ రాజనర్సింహ, ఖమ్మం-కోమటిరెడ్డి వెంకటరెడ్డి,

రంగారెడ్డి- శ్రీధర్ బాబు,వరంగల్-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్-పొన్నం ప్రభాకర్, మెదక్-కొండా సురేఖ, ఆదిలాబాద్-సీతక్క, నల్గొండ-తుమ్మల నాగేశ్వరరావు,నిజామాబాద్- జూపల్లి కృష్ణారావు లను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. సభలలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.అనుకున్న విధంగా వంద రోజులలో తమ గ్యారంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటుంది. దీనికిగాను మొత్తం 12,769 గ్రామపంచాయతీలు, 3658 మున్సిపాలిటీలోని వార్డులలో గ్రామసభలను నిర్వహిస్తారు. ప్రతిరోజు రెండు సభలను నిర్వహించి, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే సభకు తాహసిల్దార్ బాధ్యత వహిస్తే,మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే సభకు ఎంపీడీవో బాధ్యత వహిస్తారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి