కేశినేని నాని రాముడికి ఆంజనేయుడు అవుతారా?

By KTV Telugu On 6 January, 2024
image

KTV TELUGU :-

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకి ,కేశినేని నాని నమ్మిన బంటు గా ఉంటారా? మరి ఆయన వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదని సవివరం గా Facebook లో పెట్టిన పోస్ట్ కి అర్థమేమిటి అన్నది విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారింది. ఇటీవల మాజీ మంత్రి ఆలపాటి రాజా, నెట్టం రఘురాం మరియు కొనకళ్ల నారాయణ కేశినేని నానిని కలిశారు. 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు చంద్రబాబు వేరే వారిని ఇన్చార్జి గా నియమించారని తెలిపారు. ఈ సభ విషయంలో మీరు కలగ చేసుకోవద్దు అని అన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో నానికి విజయవాడ లోక్ సభ ఇవ్వడం లేదని తేలింది. దీంతో నాని అధినేత ఆజ్ఞను తూ.చా. తప్పకుండా శిరసా వహిస్తాను అని వారికి హామీ ఇచ్చారు.
రాముడికి ఆంజనేయ భక్తి తరహాలో అధినేత ఆదేశాలు శిరసా వహిస్తాను అంటూనే తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలనే దూరంగా ఉన్నానని, లోకేష్ యువగళం పాదయాత్ర జరిగినప్పడు కూడా విజయవాడ లో ప్రశాంతం గా సాగాలనే తాను దూరం గా ఉన్నట్లు చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని, తాను 2024 మే వరకు ఎంపీనేనని తనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఫిబ్రవరి మొదటి వారం లో తాను నిర్ణయం తీసుకుంటానని, ఇండిపెండెంట్ గా పోటీ చేసినా తాను గెలుస్తానని గతం లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నేను డిల్లీ వెళ్ళడం ఖాయమని, ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకోటి చూసుకోవాలని ఏ ఫ్లైట్ ఖాళీ లేకుంటే ప్రైవేట్ జెట్ లో నైనా వెళ్ళాలి కదా అన్నారు. ఎంపీ నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, విజయవాడ ఎంపీ గా హ్యాట్రిక్ సాదిస్తానని చెబుతున్నారు. చంద్రబాబు కు తాను వెన్నుపోటు పొడవలేదని అలా చేస్తే ఇంకా మంచి పదవిలో ఉండే వాడిని అన్నారు. అధినేత విజయవాడ నుండి టీడీపీ సీట్ ఇస్తే టీడీపీ నుండి లేదంటే వేరే రకంగా నైనా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి