ఒక దెబ్బకు మాల్దీవ్స్ దిగివచ్చింది. భారత ప్రజాగ్రహానికి దాసోహం అన్నది. నోరు పారేసుకుంటే వచ్చే నష్టమేంటో ఆ బుడ్డ దేశానికి బాగానే తెలిసొచ్చింది. మన ప్రధానమంత్రిని విమర్శిస్తే సెలిబ్లిటీల నుంచి సామాన్యుల వరకు ఎలా రియాక్ట్ అవుతారో కళ్లకు కనిపించింది. కళ్లు బయర్లు కమ్మిన మాల్దీవ్స్ ఇప్పుడు ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడమెలాగో అర్థం కాక నానా తంటాలు పడుతోంది…..
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. దీనితో లక్షద్వీప్ అందాలు, పర్యాటక శోభ ప్రపంచానికి కూడా తెలిసిపోయింది. జనం బయటకు చెప్పకపోయినా మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను వదిలిపెట్టి విదేశీ పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నామన్న ఫీలింగు ప్రతీ ఒక్కరిలో వచ్చేసింది. దానితో ప్రధాని పెట్టిన ఫోటోలను కోట్లాది మంది షేర్ చేసుకున్నారు. ఓ సారైనా లక్షదీవులకు వెళ్లిరావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రే బ్రాండ్ అంబాసిడర్ గా మారి పర్యాటకాన్ని ప్రొమోట్ చేయడం కూడా చర్చనీయాంశమే అయ్యింది. కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా పాజిటివ్ వైబ్స్ బాగానే వచ్చాయి.. అయితే భారత ప్రధాని స్ఠాయి నేత తమ పొరుగున ఉన్న లక్షదీవుల అందాలను ప్రశంసించడంతో మాల్దీవ్స్ నేతలు అసహనానికి గురయ్యారు. వారి పర్యాటకాన్ని దెబ్బకొడుతున్నారన్న అనుమానంతో రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించారు. మాల్దీవ్స్ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియునా.. ప్రధాని మోదీపై అనుచిత, వివాదాస్పద కామెంట్లు చేశారు. తర్వాత వాటిని డెలీట్ చేశారు. ఎంపీ జాహీద్ రమీజ్ కూడా లక్షద్వీప్‌లో మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కారు. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేయడం వల్ల మాల్దీవులుపై పెద్ద దెబ్బ పడుతుందన్న వార్తలపై విమర్శలు చేశారు. ‘‘మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేం అందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య” అని ట్వీట్ చేశారు. మరో మంత్రి అబ్దుల్లా మహ్జుమ్ మాజిద్.. తమ దేశాన్ని ఇండియా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. పైగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ కు కొమ్ముకాస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఏ దేశానికైనా అదే దౌత్య నీతి వర్తిస్తుంది. ఇతరుల అంతర్గత అంశాల్లోనూ, ఇతర దేశాల నేతల పట్ల భారత్ ఎప్పుడూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయదు. మనజోలికి వస్తే మాత్రం గట్టిగా సమాధానం చెబుతుంది. అది పాకిస్థాన్ అయినా చైనా అయినా సరే అదే రూలు అమలు చేస్తాం. ఈసారి మాల్దీవ్స్ వ్యవహారాన్ని కూడా మొక్కలోనే తుంచెయ్యాలనుకున్నాం. ఏమిటీ వ్యాఖ్యలు అని భారత ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించింది. అంతే ఆ దేశ పాలకపక్షం విలవిలలాడిపోయింది…
మోదీపై మాల్దీవ్స్ మంత్రులు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాలెలో మాల్దీవులు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని ఇండియన్ హైకమిషనర్ తీసుకెళ్లారు.ఢిల్లీలో మాల్దీవ్స్ రాయబారిని పిలిచి కూడా వివరణ అడిగారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ, భారత ప్రధానమంత్రిని కించపరిచే విధంగానూ వ్యాఖ్యలను చేసిన మంత్రులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.మాల్దీవ్స్ లో కూడా దీని పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఇండియా పట్ల …
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…