విశాఖ తూర్పులో సైకిల్ జోరు – మనీ పవర్‌తో వైసీపీ పోరు !

By KTV Telugu On 10 January, 2024
image

KTV TELUGU :-

విశాఖ సిటీలో మొత్తం నాలుగు నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి ఘోరమైన ఓటమి ఎదురయినప్పటికీ విశాఖ సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ గెలిచిందంటే.. ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు నియోజకవర్గాల్లో  తూర్పు నియోజకవర్గానిదో ప్రత్యేకత. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి మూడు సార్లు టీడీపీనే గెలిచింది. ఈ సారి టీడీపీకి బ్రేకులు వేయడానికి సీఎం జగన్ మనీ పవర్ తో  ప్రయత్నిస్తున్నారు. మరి అది వర్కవుట్ అవుతుందా ?

విశాఖపై జెండా ఎగరెయ్యడానికి  వైసీపీ అధినేత జగన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  రాష్ట్రంలో మరే నగరానికి ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్న విశాఖలో రాజకీయంగా వైసీపీకి సరైన ఫలితాలు రావటం లేదు.  విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీవిజయం సాధించినా టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి విశాఖ సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలుద్దామనుకున్న ప్లాన్ తో ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ వస్తున్నారు.  ఈ క్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ గెలవాలంటే సామాజిక సమీకరణాలు పనికి రావని మనీ పవర్ ఉండాలని… చాలా రోజుల క్రితమే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రంగంలోకి దించారు.  ఆర్థికంగా అత్యంత బలవంతుడైన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ…  ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు.  లోకల్ లీడర్స్ కు బహుమతులు ఇస్తూ… తనదైన రాజకీయం ప్రారంభించారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో   గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అడ్డాగా మారిపోయింది విశాఖ తూర్పు. కార్పొరేటర్‌గా రాజకీయాలు ప్రారంభించిన వెలగపూడి క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో పాతుకుపోయారు. ఆయన సామాన్యుడిలో సామాన్యుడిగా ఉంటారు. అందరికీ అందుబాటులో ఉంటారు. టీడీపీకి విధేయుడైన నేత.  కులమతాలకు అతీతంగా ఆయన పనితీరును ప్రజలు అభిమానిస్తారు  రామకృష్ణబాబు… నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు..  . మత్స్యకార సామాజికవర్గంలో మంచి పట్టు సాధించారు. విద్యావంతులు, వ్యాపారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇలాంటి ఎమ్మెల్యేకు సరైన ప్రత్యర్థిని దింపడంలో గత రెండుసార్లు వైసీపీ అంచనాలు తప్పాయి. అందుకే ఈ సారి వెలగపూడికి మించిన స్థాయిలో అంగ, అర్ధబలాలు ఉన్న దీటైన నేత, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు ఇన్‌చార్జిగా నియమించింది వైసీపీ హైకమాండ్. వెలగపూడిని ఓడించాలంటే..  ప్రలోభాలతోనే సాధ్యమన్నట్లుగా ఎంవీవీ సత్యనారాయణ రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గంలో విందు రాజకీయాలు మొదలుపెట్టిన ఎంపీ.. యవతను ఆకర్షించే రీతిలో ప్రత్యేక బహుమతులు పంపిణీ చేస్తున్నారు. ఎలాగైనా సరే వెలగపూడి దూకుడికి బ్రేక్ వేసి టీడీపీ హవాకు చెక్ చెప్పేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఐతే గత ఇన్‌చార్జి విజయనిర్మల మాత్రం ఇంకా టికెట్ ఆశలో ఉన్నారు. ఇప్పటివరకు ఎంపీ ఎంవీవీకి ఆమె మద్దతు ప్రకటించలేదు. ఆమెతో కూడా సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు ఎంపీ.. అధిష్టానం ఈ ఇద్దరి మధ్య రాజీకుదిర్చేందుకు విజయనిర్మలకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.  మరో నేత వంశీకృష్ణయాదవ్ జనసేనలో చేరిపోయారు. దీంతో  ఎంవీవీకి మరింత సమస్య వచ్చినట్లయింది.

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రకటన వైసీపీకి ప్లస్ కన్నా  మైనస్ ఎక్కువగా అయింది. వైసీపీ ఆ ప్రకటన చేసిన తర్వాత కడప నుంచి పెద్ద ఎత్తున జనం విశాఖలో మకాం వేశారు., వారు చేసిన  రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.  తమ ఆస్తులకు గ్యారంటీ ఉండదేమో అన్న ఆందోళన ప్రజల్లో వచ్చేలా చేయడంలో విపక్షాలు సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది.  విజయసాయిరెడ్డి ఇంచార్జిగా ఉన్నంత కాలం …  ప్రతీ శుక్రవారం జేసీబీలకు పని చెప్పేవారు ఇష్టం వచ్చినట్లుగా ఆస్తులు రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ప్రచారాలను ప్రజల భయాలను తోసి పుచ్చి విజయం సాధించడం  వైసీపీకి అంత తేలికగా కనిపించడంలేదు.  వైసీపీ పరిస్థితిని గుర్తించి ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కార్పొరేటర్లు కూడా పార్టీ మారిపోతున్నారు.

ఎలా చూసినా అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా మారిందన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో విశాఖలోనూ భిన్నంగా ఉండే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో  విశాఖ తూర్పులో జనసేన పాతిక వేల ఓట్లను చీల్చుకుంది. సిట్టింగ్ సీటును జనసేనకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి…  టీడీపీకి అదనపు బలం సమకూరినట్లే. ఏకపక్ష విజయం వవస్తుందని టీడీపీ భావిస్తోంది. అయితే  ఎంవీవీ సత్యనారాయణ ఎలాగైనా గెలుస్తారని వైసీపీ ఆశలు పెట్టుకుంటోంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి