పొన్నూరు మళ్లీ టీడీపీ కంచుకోట అవుతుందా ?

By KTV Telugu On 11 January, 2024
image

KTV TELUGU :-

ఆది నుంచి ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా కొనసాగుతోంది. ఈ సారి కూడా అక్కడ విజయం తమదేనని టీడీపీ చెప్పుకుంటోంది. పార్టీలో విభేదాలను విడనాడి గెలుపు కోసం పనిచేస్తామని తెలుగు  తమ్ముళ్లు చెబుతున్నారు. మరో పక్క వైసీపీ అక్కడ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రోశయ్య పట్ల జనంలో వ్యతిరేకత పెరిగిపోతోంది..

పొన్నురు అనగానే గుర్తుకు వచ్చే పేరు ధూళిపాళ్లు నరేంద్ర కుమార్. ఆయన  తండ్రి వీరయ్య చౌదరి, ఒకప్పుడు పొన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 1994లో వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన వారసత్వంగా నరేంద్ర కుమార్  రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి 2019 వరకు  ఆయన పొన్నూరు  నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. పొన్నూరు అంటే  నరేంద్ర కుమార్ , నరేంద్ర కుమార్ అంటే పొన్నూరు అన్నట్లుగా రాజకీయం తయారైంది. పొన్నూరు  నియోజకవర్గంలో ప్రతీ వ్యక్తిని గుర్తు పెట్టుకుని  పలుకరించే నాయకుడిగా నరేంద్రకు పేరుంది.ప్రతీ సమస్య తనదిగా చేసుకుని ఆయన దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుూనే ఉంటారు.. అందుకే ఆయనంటే జనానికి విపరీతమైన అభిమానం..

వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో పొన్నూరు కూడా ఒకటని చెప్పాలి. రోశయ్య పట్ల జనాగ్రహం పెరిగిపోతూనే ఉంది. దాని నుంచి డైవర్షన్ కోసమే నరేంద్రను వేధిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.  అయినా తట్టుకుని  నిలబడిన ధూళిపాళ్ల మళ్లీ నెగ్గేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు

పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌టి నుంచి కామ‌న్‌గానే కంటిన్యూ అవుతుంది.ఈ విష‌యం పార్టీలోని పెద్ద‌ల‌కు కూడా తెలుసు. పార్టీ ఏర్పాటు అయిన నాటి నుంచి రావి వెంక‌ట రమణ…అప్పట్లో జ‌గ‌న్‌తో పాటే ఉంటూ పార్టీని నియోజ‌క‌వ‌ర్గంలో ముందుకు న‌డిపించారు. అయితే 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో పీకే స‌ర్వే ఆదారంగా జ‌గ‌న్ సీట్ల‌ను కేటాయించారు. ఇందులో రావి వెంక‌ట‌ర‌మ‌ణను ప‌క్క‌న పెట్టి, అప్ప‌టి క‌ప్పుడు వ‌చ్చిన కిలారి రోశ‌య్య‌కు జ‌గ‌న్ సీట్‌ కేటాయించారు. ఆ త‌రువాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం పార్టీ త‌ర‌పున నిల‌బ‌డిన కిలారి రోశ‌య్య విజ‌యం సాధించారు.ఎన్నికైందే తడవుగా రోశయ్య తన  చేతివాటం చూపించారు. అవినీతికి తెరతీశారు. పార్టీ వారినే ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టారు. దానితో రోశయ్యకు వ్యతిరేకంగా వైసీపీలో ఒక వర్గం పనిచేయడం మొదలు పెట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ట్టి త‌ర‌లింపు వ్య‌వ‌హ‌రం పై తీవ్ర స్దాయిలో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ వ్య‌వ‌హ‌రంలో స్థానికంగా ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య‌ను  టీడీపీ నేత ధూళిపాళ్ళ న‌రేంద్ర టార్గెట్‌గా చేసి విమ‌ర్శ‌లు చేశారు. ఏకంగా మ‌ట్టి త‌ర‌లించే ప్రాంతానికి వెళ్లి అక్క‌డ ట్రాక్ట‌ర్ల‌ను, జేసీబీల‌ను అడ్డుకొని ఎమ్మెల్యే కిలారిపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇక్క‌డ కూడ మ‌రో కీల‌క అంశం తెర మీద‌కు వ‌చ్చింది. ధూళిపాళ్ళ న‌రేంద్ర మ‌ట్టి మాఫియా అంశం రావి వ‌ర్గం ద్వారానే తెర మీద‌కు తెచ్చి ఎమ్మెల్యే కిలారి రోశ‌య్యపై అస‌త్య ప్ర‌చారాలు చేశారంటూ, పార్టీ  పెద్ద‌ల‌కు కూడా ఫిర్యాదులు అందాయి.అయితే జగన్ విడిగా ఒక నివేదిక తెప్పించుకోవడంతో రోశయ్య బాగోతం బయటపడింది. మరో పక్క ధూళిపాళ్ల నరేంద్రను ఇబ్బంది పెట్టేందుకు ఆయన చైర్మన్ గా ఉన్న సంగం డైరీని టార్గెట్ చేశారు. ఆ విషయంలో నరేంద్ర అరెస్టు  కూడా జరిగింది.  చివరకు నరేంద్ర హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. నరేంద్రపై  వైసీపీ ప్రభుత్వం హత్యాయత్నం కేసు పెట్టడంతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి చర్యలన్నీ టీడీపీ కేడర్లో పట్టుదల పెరగడానికి కారణమవుతున్నాయి. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నరేంద్ర సేవలను వారు  ప్రచారం చేస్తున్నారు. టీడీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లే కేడర్ చిత్తశుద్ధితో పనిచేశారు.

కార్యకర్తలంతా ఒకటై నరేంద్రను గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి ఇప్పుడు జనసేన  అండ కూడా లభిస్తోంది. టీడీపీ-జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయడంతో సామాన్య ఓటర్లలో ఆ పొత్తుపై విశ్వాసం పెరిగింది. చిన్న చిన్న విభేదాలను ఆత్మీయ సమావేశాల ద్వారా వారు పరిష్కరించుకుంటున్నారు. దీనితో వైసీపీ వారికి నిద్రపట్టని పరిస్థితి వచ్చేసింది. కిలారి రోశయ్యకు  బదులుగా వేరే అభ్యర్థిని పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి