పేట ఎవరి కోట

By KTV Telugu On 12 January, 2024
image

KTV TELUGU :-

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం ఇప్పుడు  అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వరుసగా రెండు సార్లు  గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస  రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది . టీడీపీ అక్కడ దూసుకుపోతున్న  తరుణంలో పేట  వైసీపీ  కేడర్లో అసహనం పెరిగిపోయి గందరగోళ పరిస్థితిని సృష్టించేందుకు  ప్రయత్నిస్తున  మాట వాస్తవం. ఉద్యమాల బాట పట్టిన నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్  చదలవాడ అరవింద్ బాబుకు  పాపులారిటీ పెరిగిపోతోంది.

నరసరావుపేట ఒకప్పుడు టీడీపీ  కంచుకోట. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రంలో నరసరావుపేట నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచారు. తర్వాత ఆయన పరాజయం పాలై  సత్తెనపల్లికి మారిపోయారు. కోడెల ఉన్నప్పుడు టీడీపీకి తిరుగులేదన్న స్థాయిలో బలముండగా తర్వాతి కాలంలో పార్టీ కొంత బలహీనపడింది. కొత్త  రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్   రెడ్డి గెలిచారు. వృత్తీరీత్యా వైద్యుడైన గోపిరెడ్డి…  వైసీపీలో చేరి పల్నాడు  జిల్లాలో పార్టీకి బలమైన  నాయకుడిగా ఎదిగారు. అయితే మొదటి సారి ఆయనకు మంచి పేరే వచ్చినా రెండో సారి గెలిచిన తర్వాత మాత్రం నియంతృత్వ  ధోరణులు,  ప్రత్యర్థి పార్టీలపై దాడులకు తెగబడటం లాంటి చర్యలకు  దిగారు. సీఎం జగన్ పై ఎన్ని అవినీతి ఆరోపణలున్నాయో…  గోపిరెడ్డిపై  కూడా అన్ని ఆరోపణలున్నట్లు టాక్ నడుస్తోంది.

నియోజకవర్గం వైసీపీ  మూడు గోడవలు,..ఆరు ఆందోళనలతో ఉడికిపోతుంది. గోపిరెడ్డి అధికారంలోకి రాగానే తన విశ్వరూపం చూపించాడనే విమర్శలు స్వంత పార్టీ నుంచే వ్యక్తం అవుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని ఎమ్మెల్యే గోపిరెడ్జి అసలు పట్టించుకోకుండా అణగదొక్కే ప్రయత్నం చేసాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

నాలుగేళ్ళు  అవకాశం కోసం ఎదురు చేసిన అసమ్మతి నేతలు ఒక్కసారి బహిరంగంగా వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖంగుతిన్నారు.  అసమ్మతి నేతలకు నరసరావుపేట కు చెందిన  డాక్టర్ గజ్జల బ్రహ్మ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. నాలుగున్నరేళ్లు తన వల్ల లబ్ది పొందిన వాళ్లు , పదవులు పొందిన వాళ్లు కూడా తనకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడం పై ఖంగుతిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి.. అసలు ఈ ఆందోళనల వెనుకు ఎవ్వరూ ఉన్నారా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. పైకి మాత్రం గజ్జల బ్రహ్మరెడ్డి తనకు వచ్చే ఎన్నికలలో సీటు కావాలనే అడుగుతున్నప్పటికి ఆందోళనల అసలు లక్ష్యం వేరే ఉందని గ్రహించాడట. గురజాల ఎమ్మెల్యే గా ఉన్న కాసు మహేష్ రెడ్డి  నరసరావుపేట వాసి . కాసు మహేష్ రెడ్డి తండ్రి , తాతాలు నరసరావుపేట కేంద్రంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపారు. అయితే గత 2019 ఎన్నికలకు ముందు  కాసు మహేష్ రెడ్డి వైసీపీలో  చేరడంతో నరసరావుపేటకు అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గా గోపిరెడ్డి ఉండటంతో కాసు మహేష్ రెడ్డిని  గురజాల నియోజకవర్గానికి పంపి అక్కడ నుంచి పోటీ చేయించారు. గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు.  రాజకీయ ప్రాధాన్యత కలిగిన కాసు కుటుంబాన్ని, కాసు అనుచరులను నరసరావుపేట లో ఎమ్మెల్యే గోపిరెడ్డి అణిచివేసే ప్రయత్నం చేసాడని కాసు వర్గం రగిలిపోతుంది. పలు  సందర్భాలలో కాసు మహేష్ రెడ్డిని, మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డిని నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపి రెడ్డి అవమావపరిచే విధంగా ప్రవర్తించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కాసు వర్గం తాజాగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులను వెనక నుంచి ప్రోత్సాహిస్తూ తమ ప్రతాపం చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.  కాసు మహేష్ రెడ్డికి  కూడా గురజాల నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కవగా ఉండటంతో వచ్చే ఎన్నికలలో తమ స్వంత నియోజకవర్గం నరసరావుపేట నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని కాసు మహేష్ రెడ్డి బావిస్తున్నారట.

స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డిని టీడీపీ గట్టిగానే టార్గెట్ చేసింది. నియోజకవర్గంలో ఆయన  ఎక్కడ ఉన్నారో కూడా కనిపించడం లేదని టీడీపీ గోల చేస్తోంది. దానితో టీడీపీ వారిపై దొంగకేసులు పెట్టి వేధించే ప్రక్రియకు  గోపిరెడ్డి వేగం పెంచారు. అయితే ఛాలెంజులతో ఆయన పరువు పోగొట్టుకుంటున్నారన్న  వాదన కూడా వినిపిస్తోంది..

గత ఏడాదిగా నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం ఊపందుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి , టీడీపీ నేత అరవిందబాబు మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కోటప్పకొండలో త్రికుటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమంటూ నేతలిద్దరూ బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలను నిరూపిస్తానంటూ టీడీపీ నేత అరవిందబాబు కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. మరో పక్క రొంపిచర్ల మండలం వైసీపీ  అధ్యక్షుడు బాలకోటి రెడ్డిని ఎమ్మెల్యేనే హత్య చేయించారని అరవిందబాబు ఆరోపించడంతో దుమారం చెలరేగింది. అది కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లుగా కొనసాగింది.అరవింద్ బాబు వేగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఆయనపై అరడజనుకు పైగా కేసులు పెట్టించింది. ఒక దశలో టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు కూడా జరిగాయి. ఇలాంటి చర్యలన్నీ వైసీపీ ప్రతిష్టను దిగజార్చి టీడీపీ పట్ల జనంలో గౌరవం పెరిగింది…

నరసరావుపేట నియోజకపర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమే అవుతుంది. అక్కడ గెలిస్తేనే నరసరావుపేట లోక్ సభను చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని లెక్కచెబుతున్నారు… పక్కనున్న సత్తెనపల్లి, చిలకలూరిపేట, గుజరాల నియోజకవర్గాలపై కూడా నరసరావుపేట ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి