పుష్కర కాలం దాటిన కొద్దిరోజులకే పెళ్లి పెటాకులైంది. సానియా , షోయబ్ విడిపోయారు. ఇదీ పాకిస్థాన్, ఇండియా విడిపోయిన ఘటన కంటే అభిమానులకు ఎక్కువ బాధ కలుగుతున్న మాట వాస్తవం. ఇప్పుడు షోయబ్ మూడో పెళ్లి కూడా చేసుకున్నారు. డైవర్స్ వ్యవహారాన్ని సానియా కూడా బయటపెట్టింది. అసలేం జరిగింది…
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. పాక్ ప్రముఖ నటి సనా జావేద్‌ను వివాహమాడాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల దాటిన ఈ ప్రేమ జంట విడిపోతున్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ మాలిక్ మరో వివాహం చేసుకోవడం గమనార్హం.తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియా మీర్జాను షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. పరిచయమైన కొన్ని నెలల్లోనే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోవడంపై గతంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఆ సమయంలో ఆ జంట వాటిని కొట్టిపారేసింది. కామన్ ఫ్రెండ్‌తో ఏర్పడిన వారి పరిచయం, స్నేహంగా తర్వాత పెళ్లిగా మారింది. కాగా, వారికి అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు.ఇప్పుడు షోయబ్ ముూడో పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో సానియా కుటుంబం స్పందించింది. సానియా ముందే ఖుల్లా ఇచ్చారని తెలిపింది. భర్త పద్ధతి, వేధింపులు నచ్చకపోయినా, ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా మహిళలు స్వయంగా విడాకులు ప్రకటించే పద్ధతిని ఇస్లాంలో ఖుల్లా అంటారు. ఇక 24 గంటల్లో సానియా కుటుంబం అధికారికంగా స్పందించింది. కొన్ని రోజుల క్రితమే డైవర్స్ ప్రక్రియ పూర్తయ్యిందని, ఇంతకాలం వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా ఉంచామని ఇప్పుడు అనివార్యంగా బయటపెడుతున్నామని టీమ్ సానియా వెల్లడించింది. ప్రైవసీకి అవకాశం ఇవ్వాలని అభిమానులను కోరింది..ఇంతకంటే స్పందించదలచుకోలేదన్నట్లుగా సంకేతమిచ్చింది.
సానియాకు షోయబ్ అంటే ఎందుకు వ్యతిరేకతా భావం ఏర్పడింది. ఆమె పాకిస్థాన్ వదిలి రావడానికి కారణం ఏమిటి. సానియా వరుస స్టేట్ మెంట్స్ ఇస్తున్న సందేశం ఏమిటి. షోయబ్ తో కాపురంలో ఆమెకు అప్పులు పెరిగిపోయాయా…
సానియా, షోయబ్ పెళ్లి ఒక మిస్టరీ. ఆమె విడాకులు కూడా మిస్టరీనే. ఎందుకంటే ఇద్దరి మధ్య విభేదాలున్నట్లు వస్తున్న వార్తలను చాలా రోజుల పాటు వాళ్లు గోప్యంగా ఉంచటమే కాకుండా బయటకు వచ్చిన వార్తలను కూడా ఖండించారు. అసలు పాకిస్థాన్లో ఉండే షోయబ్ కు, ఇంత దూరం హైదరాబాద్ లో ఉండే సానియాకు ఎలా మనువు కుదరిందన్నది ఇప్పటికీ భారతీయులందరినీ వేదిస్తున్న ప్రశ్న. దగ్గరి బంధువుల ద్వారా పెళ్లి కుదిరిందని సానియా కుటుంబం అప్పట్లో చెప్పినప్పుటికీ ఎవరూ విశ్వసించలేదు. ఇప్పుడు విడాకుల విషయంలోనూ అవే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే విడాకుల వేళ సానియా పెట్టిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఆమె అనుభవిస్తున్న మానసిక ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పక తప్పుదు.షోయబ్ వివాహేతర సంబంధాలతో సానియా విసిగిపోయిందని అందుకే ఆమె విడాకులు తీసుకుందని సన్నిహితంగా ఉన్న వాళ్లు చెబుతున్న మాట. షోయబ్ తో కాపురం వల్ల సానియా ఆర్థికంగా బాగా నష్టపోయిందని ఒక వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. పెళ్లి కష్టం, విడాకులు కష్టం. కష్టాన్ని ఎంచుకో అని ఆమె పోస్ట్ చేసింది. అలాగే అప్పుల పాలవ్వడం కష్టం. ఆర్థిక క్రమశిక్షణ కష్టమని కూడా ఆమె పోస్ట్ చేసింది. దుబాయ్ లో కాపురం ఉండేందుకు చేసిన ఖర్చు మొత్తం సానియానే భరించాల్సి వచ్చిందని, షోయబ్ ఆమె చేత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించేవాడని కొందరు అంటున్నారు. పైగా ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చు చేసేవారని కూడా తెలుస్తోంది. అందులో నిజమెంతో సానియా మాత్రం చెప్పగలదు. ఎందుకంటే సానియాకు అప్పులు పెరిగిపోయాయన్నది ఇప్పుడు వినిపిస్తున్న టాక్..
మన ఎదుటే పెరిగి, మన ఎదుటే సెలబ్రిటీగా మారి, భారతదేశ ప్రతిష్టను పెంచి, హైదరాబాద్ కు గొప్ప పేరు తెచ్చిపెట్టిన సానియా మీర్జా జీవితంలో ఒక ఘట్టం ముగిసింది. కొత్త జీవితం వైపు సానియా అడుగులు వేస్తున్న వేళ ఆమె వ్యక్తిగత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదే కానీ సెలబ్రిటీ కదా..ఏం జరిగినా సాధారణ జనానికి ఆసక్తిగానే ఉంటుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి