దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడుకు దక్కింది. ఆయన రాజకీయ ప్రస్థానం , దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటే.. ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించడంలో ఏ మాత్రం పొరపాటు లేదని అర్థం చేసుకోవచ్చు. ఆయన బీజేపీ నేత కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందనే విశ్లేషణలు చేసేవారు ఉంటారు కానీ.. పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా ఆలోచిస్తే వెంకయ్యనాయుడు నిఖార్సైన పద్మ విభూషణుడు.
ఏపీలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఉనికి లేని స్టేజ్ లో ఉన్న రాష్ట్రం ఏపీ. అలాంటి రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగిన నేత వెంకయ్యనాయుడు. ఆయన పార్టీలు మారలేదు. విద్యార్థి దశ నుంచి ఆయనది ఒకే భావజాలం. ఎప్పుడూ మారింది లేదు. న్యూఢిల్లీ: చిత్తశుద్ధితో నమ్మిన సిద్ధాంతాల ఆచరణ.. నడిచే దారిలో ఎంత కష్టం వచ్చినా మడమతిప్పక ముందుకే సాగటం వంటి ఉన్నత లక్షణాలు వెంకయ్యనాయుడిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా దోహదపడ్డాయి. తెలుగువారు దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ నిర్వర్తించారు. నిరంతర శ్రమ, అభ్యాసతత్వం, 100 శాతం ఫలితాల సాధనకు యత్నించడం వంటి అంశాలే ఆయన్ను వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి తీసుకెళ్లాయి. తెల్లని పంచె, చొక్కాతో సాధారణ వ్యక్తిగా కనిపించే వెంకయ్యనాయుడుది అత్యంత సునిశిత పరిశీలనా దృష్టి. ఒక వ్యక్తి తన ముందుకొస్తేనే ఆమూలాగ్రం అతనిలోని శక్తిసామర్థ్యాలను అంచనావేసే అరుదైనతత్వం ఆయన సొంతం. నిరంతరం విద్యార్థిలా గతిశీలంగా ఉండటం, భేషజాలకు పోకుండా వాస్తవాలను జీర్ణించుకొని మార్పును వెంటనే అంగీకరించడం ఆయనకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టింది.
వెంకయ్యనాయుడు తన రాజకీయ జీవితంలో గెలుపు ఓటములకు ఎన్నడూ వెరవలేదు. దక్షిణ భారత దేశంలో బీజేపీ పునాదులు అంత బలంగా లేకపోయినా ఆయన ఆ పార్టీకే అంకితయ్యారు. 1977లో ఒంగోలులో జనతాపార్టీ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయినా, 1978లో అదే జనతాపార్టీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో ఇందిరాగాంధీ ప్రభంజనంలో, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఒంటరిగా పనిచేసి గెలిచారు. అయిదేళ్లపాటు అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేతగా వెంకయ్యనాయుడి వాగ్దాటి తెలుగు ప్రజలు ఎన్నటికీ గుర్తుండేలా చేసింది. 1985లో తెలుగుదేశం పొత్తుతో ఉదయగిరి నుంచి కాక ఆత్మకూరులో పోటీచేసి కొద్ది ఓట్లతో ఓటమి పాలయ్యారు. అది రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలవైపు తీసుకెళ్లింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణం కోసం ఆయన పడిన తపన, చిత్తశుద్ధి, నిజాయితీ అగ్రనేతలైన వాజ్‌పేయి, అద్వానీలను ఆకట్టుకున్నాయి. 1993లో అద్వానీ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత వెంకయ్యను జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. నాటి నుంచి జాతీయపార్టీలో ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వచ్చారు. 1989లో బాపట్ల, 1996లో హైదరాబాద్ లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
వాజ్‌పేయ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధిమంత్రిగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి గ్రామాలను రహదారి అనుసంధానించారు. మారుమూల గ్రామాలకూ మట్టిరోడ్లు, తారురోడ్లు తెచ్చారు. ఇప్పుడు పట్టణాభివృద్ధిమంత్రిగా స్మార్ట్‌సిటీలు, అమృత్ పథకాలు తెచ్చి తనదైన ముద్రవేశారు.వెంకయ్యనాయుడు జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగినా తెలుగు వాడిగా ఉన్న గుర్తింపును పోగొట్టుకోలేదు. సాధారణంగా జాతీయస్థాయి నాయకులు తనపై ప్రాంతీయ ముద్రపడకుండా జాగ్రత్తలు పడతారు. మాతృభాషలో మాట్లాడితే ఎక్కడ తన స్థాయి కుంచించుకుపోతుందోనన్న భయంతో ఆంగ్లం, హిందీల్లో మాట్లాడటానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, వెంకయ్య తెలుగు మీద ప్రేమను మాటల్లోనే కాకుండా, చేతల్లోనూ చూపారు. ఎంతస్థాయికి ఎదిగినా ధైర్యంగా తెలుగులోనే మాట్లాడారు. ఆయన ఎప్పుడూ వ్యక్తులను, వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయలేదు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సిద్ధాంతపరమైన విమర్శలే చేశారు. అందుకే ఎవ్వరితోనూ వ్యక్తిగత బంధాలు దెబ్బతినలేదు. అందరూ అజాతశత్రువుగా భావిస్తారు. వెంకయ్య మనిషి నిండా మంచిదనం., మనసు మకరందం అని తెలిసిన వాళ్లు పొగుడుతూ ఉంటారు.
రాజకీయాలంటే వంద శాతం అందర్నీ మెప్పించలేరు. కానీ మెజార్టీని మెప్పించాలి. ఈ విషయంలో వెంకయ్యనాయుడుపై అనేక మంది అనేక రకాలుగా విమర్శలు చేయవచ్చు. కానీ ఆయన రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే ఎంతో మంది గొప్ప నేతల కన్నా.. వెంకయ్యనాయుడు మేలైన నేత. దేశం కోసం ఆయన చేసిన సేవలకు తగ్గ ప్రతిఫలాన్ని బీజేపీ ఇచ్చిందని అనుకోవచ్చు. ఒక వేళ వేరే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఆయనను గుర్తించదు. ఎందుకంటే.. బీజేపీ తరపున దేశం కోసం సేవ చేసిన వారిని ఇతర పార్టీలు గుర్తించవు. మొత్తంగా వెంకయ్యనాయుడు తెలుగు దిగ్గజాల్లో ఒకరు. ఇప్పటి నుండి దేశ రెండో అత్యున్నత పురస్కార గ్రహీత…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…