నారా లోకేష్ అమెరికా పోలీసుల అదుపులో ఉన్నారంటూ గుప్పుమన్న వార్త తుస్సున చల్లారిపోయింది. నిజంగా లోకేష్ అమెరికాలో ఉన్నారా..ఆయన ఎక్కడున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తొందరగానే దొరికినా అసలు లోకేష్ అమెరికా ఎందుకు వెళ్లారనేదే పెద్ద ప్రశ్న. దీనికి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనేక కోణాల్లో పరిశీలన జరుగుతోంది…
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్నారనే వార్త గుప్పుమంది. అమరికాలో కొందరు సొంత సామాజికవర్గం వారి వద్ద డబ్బులు వసూలు చేసి హవాలా మార్గంలో దాన్ని ఏపీకి తరలించేందుకు లోకేష్ వెళ్లారని ప్రతికూల సోషల్ మీడియా ప్రచారం చేసింది. ఆ మాట ఎలా ఉన్నా.. లోకేష్ అమెరికా పోలీసుల అదుపులో ఉన్నది మాత్రం నిజం కాదని తెలిపోయింది. లోకేష్ వెళ్లిన చాన్నాళ్లకు మాత్రమే వ్యతిరేక మీడియాకు ఆ వార్త అందింది. ఈ లోపు టీడీపీ పెద్దలు చాలా మంది అమెరికా వెళ్లారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కొందరు కులపెద్దలు కూడా వెళ్లారు. ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. ఎలక్షన్ ఫండ్ కు సంబంధించిన చర్చలు, నిధులు ఇండియాకు తీసుకొచ్చే మార్గం చర్చకు వచ్చి… అనుకున్నది సాధించుకున్నారు. అందరూ వచ్చేసిన తర్వాత మాత్రమే వ్యతిరేక మీడియా స్టోరీలు మొదలు పెట్టింది. అప్పటికే లోకేష్ ఇండియాలో ల్యాండ్ అయ్యారన్నది వ్యతిరేక ప్రచారం చేసిన వారికి తెలీదు. ఎందుకంటే ఎలాంటి ప్రచారమూ లేకుండా లోకేష్ అమెరికా వెళ్లారు. అదే రేంజ్ లో కామ్ గా తిరిగొచ్చారు.దీనితో లోకేష్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారన్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఫండింగ్ కోసం వెళ్లిన మాట నిజమని అర్థమైపోయింది..
లోకేష్ ఇప్పుడేం చేస్తున్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారని ఎవరైనా అడిగితే అది వాళ్ల ఆలోచనా విధానమే అవుతుంది. లోకేష్ ఒక స్కీమ్ ప్రకారం పనిచేస్తున్నారని 175 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెడుతూనే, మంగళగిరి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి..
లోకేష్ ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. ఆయన ప్రధానంగా రెండు పనులపై ఎక్కువ టైమ్ గడుపుతున్నారు. అత్యధిక సంఖ్యలో వైసీపీ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. అదీ వైసీపీ వారిపై మైండ్ గేమ్ కూడా అవుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకే టీడీపీ వారికి అప్పాయింట్ మెంట్ ఇచ్చే కార్యక్రమాలకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి…వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వారితో సెల్ఫీలు దిగుతున్నారు. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగం జనంలోకి తీసుకెళ్తోంది. టీడీపీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని,కలిసి నడుద్దామని ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆయన నూరిపోస్తున్నారు. టికెట్ల కోసం తనను ప్రసన్నం చేసుకోవాలనుకునే నేతలకు ఆయన అస్సలు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. మంగళగిరి నియోజకవర్గంపై ఎక్కువ ఏకాగ్రత చూపడం లోకేష్ రెండో వ్యూహం. ఎలాగైనా తనను ఓడించేందుకు జగన్ స్కెచ్ వేస్తారని లోకేష్ కు తెలుసు. అందుకే విజయవాడలో ఉంటూ రోజులో సగం టైమ్ మంగళగిరి వ్యవహారాలు చూస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి శ్రేణుల్లో ప్రతీ ఒక్కరూ లోకేష్ కు పరిచితులే. ప్రతీ ఒక్క కార్యకర్త అభిప్రాయాలు తెలుసుకుంటూ నియోజకవర్గానికి కావాల్సిందేమిటో ఆయన అంచనా వేసుకుంటున్నారు. సొంత నిధులతో ఇప్పటికే కొన్ని పనులు చేయించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కసితో ఉన్న లోకేష్.. ఈ సారి ఎట్టి పరిస్తితుల్లో మంగళగిరి నుంచి గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు…
ఎన్నికలకు ఇంకో 75 నుంచి 80 రోజులు మాత్రమే ఉందని లోకేష్ కు తెలుసు. పొత్తుల విషయం దాదాపుగా ఖరారైందని అంచనాకు వచ్చేశారు. చంద్రబాబు సహా నేతలంతా ఏదో విధంగా జనంలో ఉంటున్నారు. ఈ క్రమంలో లోకేష్ పారలల్ గేమ్ ఆడుతున్నారు. చేరికలతో ప్రత్యేక దృష్టి పెడుతూ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…