ముఖ్య మంత్రి జగన్ ఆయన చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. షర్మిల కడప జిల్లాలో పర్యటించి తన అన్న జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు
జగన్ అసలు తన అన్నే కాదని , తాను పులివెందుల బిడ్డనని. పులి కడుపున పులే పుడుతుంది అని . రాజశేఖర్ రెడ్డి రక్తం తనలో ప్రవహిస్తుందని. తన గుండెల్లో నిజాయితీ ఉందని ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడ ఉన్నానని చెప్పారు
జగన్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని ,రక్త సంబంధం ఉందని, వైసిపి నీ అధికారం లోకి తేవడానికి 3200 కి మీ పాదయాత్ర చేశానని, ఎలాంటి పదవి కోరుకోకుండా త్యాగం చేశానని అలాంటి నాపై, నా భర్త పై ఎన్నో నిందలు వేస్తున్నారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక మరిపోయాడని , ఇప్పుడున్న జగన్ నా అన్ననే కాదని, రోజుకో జోకర్ ను తనపైకి ఉసిగొల్పాడని అన్నారు.
జగన్ ను జైల్ లో పెట్టించి తన భర్త అనిల్ తనను సీఎం చేయాలని అడిగారని ఒకరు అంటున్నారని, అనిల్ తన వదినమ్మ భారతి తో కలిసే సోనియా ను కలిశారని. కావాలంటే ప్రణబ్ ముఖర్జీ కొడుకును అడగ వచ్చు అన్నారు.
సాక్షి మీడియా లో తనకూ సమాన భాగం ఉందని రాజ శేఖర్ రెడ్డి గారు చెప్పారని. సాక్షి వాళ్ళు ,తెలంగాణ లో తనతో పని చేసిన వారికి ఫోన్లు చేసి తనకు వ్యతిరేకం గా మాట్లాడితే వారికి కవరేజీ ఇస్తామని చెప్తున్నారట.ఇంతగా దిగజారాలా?
తను ఇష్యూ లను గురించి మాట్లాడితే వారు వ్యక్తిగతం గా తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని. అయినా పర్వాలేదు దేనికీ భయపడే ప్రసక్తే లేదని ,ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికే వచ్చానని. తనలో నియాయితీ ఉందని చెప్పారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…