ప్రతీ ఏడాది ఫిబ్రవరి వస్తోందంటే బడ్జెట్ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఆదాయపు పన్ను ఎక్కడ వరకు మినహాయింపు లభిస్తుంది.. రేట్లు పెరిగే వస్తువులేవి..తగ్గే వస్తువులేవి అన్న అంశాలపై చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి. నిజానికి అవి బడ్జెట్ లో చాలా చిన్న విషయాలు. బడ్జెట్ అంటే.. ఏడాది మొత్తం జమా ఖర్చుల వివరాలు కాదు.. దేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రాధాన్యాలను గుర్తుంచుకుని దానికి అనుగుణంగా నిధుల్ని కేటాయించడం.. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా సంపాదన ఉండేలా చూసుకోవడం. అదే సమయంలో ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని పెంచగలగడం. అందుకే ఈ బడ్జెట్ అనే పదానికే సుదీర్ఘమైన చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి భారత్‌లో బడ్జెట్ ఉంది. ఆ చారిత్రక విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మానవ జీవితాల్లో కీలకమైనది. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే బడ్జెట్ల విషయంలోనే కాదు ప్రతి మనిషి తన ఆదాయ వ్యయాలను ప్రణాళికాలను బడ్జెట్ రూపంలో వేసుకుంటూనే ఉంటారు. ఈ బడ్జెట్ అనేది బ్రిటిష్ పాలనలో మొదటి సారిగా ఇండియాలో ప్రవేశ పెట్టారు. 1860లో గ్రేట్ బ్రిటన్‌లోని స్కాట్లాండ్‌కు చెందిన జేమ్స్ విల్సన్ బ్రిటిష్ పాలకుల తరపున ఆర్థిక వ్యవహారాలు చూసేందుకు భారత్ లో నియమితులయ్యారు. ఆయనే మొదటి సారిగా 1860లో బడ్జెట్ ను ప్రతిపాదించారు. జేమ్స్ విల్సన్ గ్లోబల్ దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , అలాగే్ బిజినెస్ మ్యాగజైన్ ‘ది ఎకనామిస్ట్’ స్థాపకుల్లో ఒకరు. అవిభాజ్య భారతదేశంలోని వైస్రాయ్ లార్డ్ కానింగ్స్ కౌన్సిల్‌లో ఫైనాన్స్ సభ్యునిగా నియమితులయిన తర్వాత ఆర్థిక రంగంలో నిపుణుడిగా ఎదిగాడు. తర్వాత బ్రిటీష్ పార్లమెంట్ సభ్యునిగా.. UK ట్రెజరీకి ఫైనాన్స్ సెక్రటరీ , బోర్డ్ ఆఫ్ ట్రేడ్ వైస్ ప్రెసిడెంట్ కూడా పని చేశారు.
విల్సన్ 1859లో భారతదేశానికి వచ్చారు. సిపాయిల తిరుగుబాటు , మొదటి స్వాతంత్ర్య యుద్ధం కారణంగా ఆర్థిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఆయన వచ్చారు. బ్రిటీష్ ప్రభుత్వం సైనిక బలగాల కోసం ఖర్చు చేయాల్సి రావడంతో భారీ అప్పులను చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి జేమ్స్ విల్సన్‌ను పిలిపించారు. ఆయన మొదటి సారిగా దేశ ప్రజలు ఆదాయపు పన్నును పెట్టారు. ఏటా రెండు వందల రూపాయల కన్నా ఎక్కువ సంపాదన ఉన్న వారు పన్ను కట్టాల్సిందేనని చట్టం తెచ్చారు. సహజంగానే ఇది తీవ్ర వివాదాస్పదమయింది. అందరూ వ్యతిరేకించారు. బ్రిటీష్ ప్రభుత్వం వ్యాపారులకు వాణిజ్యానికి అవసరమైన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించిందని అందుకే పన్ను వసూలు చేసుకునే అర్హత ఉందని విల్సన్ వాదించారు. చివరికి ఎంత మంది వ్యతిరేకించినా ఆదాయపు పన్ను కొనసాగించాడు. బ్రిటిష్ హయాంలోనే భారత్ కు మొదటగా బడ్జెట్ పరిచితమయింది. ఆదాయపు పన్ను కూడా బ్రిటిష్ హయాంలోనే పుట్టింది.
అవిభాజ్య భారత్ లో 1860లో రావొచ్చు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా పురాతన సామ్రాజ్యాల చరిత్రను పరిశీలిస్తే…. ఈజిప్షియన్లు, , రోమన్లకు కూడా బడ్జెట్లు నిర్వహించేవారు. పేరుకు బడ్జెట్ కాకపోయినా ఆర్థిక నిర్వహణ మాత్రం ఉండేది. వీరి ఆర్థిక నిర్వహణ అంతా గోల్డ్, సిల్వర్ నిల్వల రూపంలో ఉంటాయి. ఇక మౌర్యుల కాలంలోనూ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. అశోకుని కాలంలో ఇన్ ఫ్రాకు నిధులు ఎక్కువగా ఖర్చు చేసేవారు. అక్బర్ పాలన ఫిస్కల్ పాలసీలకు ప్రసిద్ధి చెందింది. మొగల్స్ కాలంలో ఇండియా జీడీపీ వాటా ప్రపంచంలో ఇరవై శాతం ఉండేది. ఆయా సామ్రాజ్యాల్లో ఉండే పేర్లను వాడుకున్నప్పటికీ కామన్‌గా 1800 కాలం నుంచి బడ్జెట్ అనేది సహజం అయిపోయింది. ఫ్రాన్స్ లో నెపోలియన్ 1803 అన్ని విభాగాలకు ఆదాయం , ఖర్చుల లెక్కలు ఉండాల్సిందేనని ఆదేశించారు. తర్వాత ఫ్రాన్స్ 1860 నాటికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఆడిటర్ జనరల్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక అమెరికా 1911 నాటికి ఫ్రాన్స్ నుంచి బడ్జెట్ చట్టాలన్నింటినీ అడాప్ట్ చేసుకోవడం ప్రారంభించాయి. 1921 నుంచి అమెరికాలో బడ్జెట్ పూర్తిగా చట్టబద్దమయింది.
బ్రిటిష్ హయాంలో జేమ్స్ విల్సన్ మొదటి బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత బ్రిటిష్ పాలకులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ స్వాతంత్రం పొందిన తర్వాత తొలిసిగా ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి భారత్ తొలి బడ్జెట్ ను 1947 ఆగస్టు పదిహేను నుంచి . మార్చి 31 1948 వరకు ప్రతిపాదించారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఉండే ప రిస్థితుల్ని అంచనా వేయడం కష్టం. అయినా మొక్కవోని పట్టుదలతో ఆర్థిక నిర్వహణ ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి బడ్జెట్లు ఎప్పటికప్పుడు మెరుగుపడుతూనే ఉన్నాయి. దేశానికి ఎన్నో రకాలుగా మౌలిక సదుపాయాలను కల్పించినది బడ్జెట్ కేటాయింపుల నిధుల ద్వారానే. దేశంలో కొన్ని బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. యూపీఎ హయాంలో ఆర్థిక మంత్రిగా చిదంబరం ప్రవేశ పెట్టిన బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్‌గా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇక 2000లో మిలీనియం బడ్జెట్‌గా ఆర్థిక వేత్తలను ఆకట్టుకుంటారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానం కాలంతో పాటు మారుతూ వస్తోంది. 2021 నుంచి బడ్జెట్ ప్రతులను టాబ్లెట్ల రూపంలో ఇస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యస్థను ఓ దిశకు మరల్చేదే బడ్జెట్. అనేక మంది ఆర్థిక మంత్రులు ఈ విషయంలో తమదైన ముద్ర వేశారు. చాలా కాలం పాటు రైల్వే బడ్జెట్ వేరుగా ఉండేది. సాధారణ బడ్దెట్ ప్రవేశ పెట్టే ముందు రోజే ఈ రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టేవారు. అయితే బీజేపీ వచ్చిన తర్వాత మార్చేసింది. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్ ను కలిపేశారు. అలాగే బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని కూడా మార్చారు. గతంలో మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు. కానీ గత రెండేళ్లుగా ఫిబ్రవరి ఒకటో తేదీనే పద్దులు సమర్పిస్తున్నారు. ఇదీ బడ్జెట్‌కు ఉన్న చరిత్ర…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…