ఉభయగోదావరి జిల్లాల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న బ్యాడ్ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసుకున్న పెద్దాపురం ఇప్పుడు వివిధ రంగాల్లో ముందంజలో ఉంది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతులయిన ప్రజలు ఉండే నియోజకవర్గం. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాల చినరాజప్ప అనూహ్యంగా ఇక్కడ నుంచి రెండు సార్లు గెలిచారు. మూడో సారి గెలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి ఆయనకు జనసేనతో పొత్తు కలసి వస్తోంది. టీడీపీకి వీర విధేయుడిగా ఉండే అన్నీ మంచి శకునములే అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. వైసీపీ అభ్యర్థి విషయంలో కిందా మీదా పడుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆరు సార్లు గెలిచింది. పీఆర్పీ ఒకసారి గెలిచింది. ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు.హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2019లో జగన్ వేవ్ ను తట్టుకొని విజయం సాధించారు చినరాజప్ప. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలం పుంజుకొని.. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీను కైవసం చేసుకుంది. టీడీపీ కూటమి నుంచి నిమ్మకాలయ చినరాజప్ప అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ తరపున ఇంచార్జుగా దవులూరి దొరబాబు ఉన్నారు. ఆయన కంటే బలమైన నేత ఎవరైనా వస్తే వారికి చాన్సిద్దామని జగన్ చూస్తున్నారు. మొన్నటి వరకూ ముద్రగడ ప ద్మనాభం కుటుంబసభ్యుల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ముద్రగడకు వైసీపీతో కూడా చెడింది. దీంతో దొరబాబుకే చాన్సివ్వొచ్చని నమ్ముతున్నారు.
పెద్దాపురం నియోజకవర్గం అప్రకటిత కాపు రిజర్వుడు నియోజకవర్గం అనుకోవచ్చు. కాపు సామాజిక వర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీకి 41 శాతం ఓట్లు రాగా వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి ఏకంగా పదహారు శాతం ఓట్లు చీల్చారు. అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న తోట నర్సింహం ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వాణికి పెద్దాపురం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చినరాజప్పను కదిలించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరిపోయింది. తోట నరసింహం తన భార్య, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె అయిన వాణిని బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో తోట వాణి గట్టి పోటీ ఇచ్చినప్పటికి ఓడిపోయారు. అయితే అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు రాజప్పనే మరోసారి గెలిపించారు. జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి కూడా ఏకంగా 16 శాతం ఓట్లు సాధించారు. ఆయనకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన సపోర్ట్ లభించింది.
నిమ్మకాయల చినరాజప్ప అందరికీ అందుబాటులో ఉండే నేత. అవినీతి మరక అంటనీయరు. కష్టం వచ్చిన వారిని ఆదుకుంటారు. పార్టీ పట్ల విధేయంగా ఉంటారు. హోంమంత్రిగా ఐదేళ్లు ఉన్న సమయంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఐదేళ్లలో ఎలాంటి ప నులు జరగలేదు. పైగా ఈ సారి జనసేన మద్దతు కలసి వస్తోంది. వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న దొరబాబు కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి… తర్వాత యాక్టివ్ అయ్యారు. అయితే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గాలు ఉన్నాయి. అందుకే ఆయనకు పరిస్థితి అంత సానుకూలంగా లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఈ నియోకవర్గంలో కీలకం కానుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు సగం మంది కాపు సామాజిక వర్గ ప్రజలే ఉన్నారు. దీంతో పొత్తు కారణంగా వారంతా టీడీపీకి ఓట్లు వేసే అవకాశ ముంది. టీడీపీ, జనసేన నేతలు కూడా ఇదే సామాజిక వర్గ నేతలే. మరోవైపు చినరాజప్పకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కూడా టీడీపీకి కలిసొచ్చే అంశం.
ఇప్పటికైతే పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు పూర్తి స్థాయి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆయనకు హ్యాట్రిక్ ఖాయమని వైసీపీ వర్గాలు కూడా ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి. 2014లో చివరి క్షణంలో పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన చినరాజప్ప.. ఆ నియోజకవర్గంలో పాతుకుపోవడం ఆయన నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అనుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…