ఖమ్మం ఇప్పటి వరకూ కమ్యూనిస్టు కంచుకోట అనో… కాంగ్రెస్ అనుకూల ప్రాంతం అనో ముద్ర పడిన చోటు.
అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఊహించని రాజకీయ చర్చ మొదలైంది !
బీజేపీలో చేరికలతో ఓ కలకలమే బయల్దేరింది !
కారణమేంటి ?
ఎవరి చుట్టూ ఈ చర్చ ?
తాండ్ర వినోద్ రావు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షమంలో కాషాయ కండువా కప్పుకున్నాక… కొత్త సంగతి గుప్పుమంటోంది
మోడీ మీద అభిమానంతో బీజేపీలో చేరానని…
సొంత ప్రాంతం పాల్వంచ అని మాత్రమే ఆయన చెప్పారు.
నిజానికి ఆయనో వ్యాపారవేత్త.
రాజకీయ వర్గాలు రీసెర్చ్ చేస్తే… చాలా సంగతులే బయటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా…
ఖమ్మం రాజకీయం అయితే బైనాక్యులర్స్ వేసి వెదికి మరీ కొత్త విషయాలు బయటకు తీస్తోంది.
వినోద్ రావు ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారని…
అందుకే ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో అవలీలగా సమావేశం కాగలిగారని…
ఆయనే ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా చేయొచ్చనే చర్చ మొదలవుతోంది.
ఏంటి … బీజేపీ… ఖమ్మంలోనా ?
ఎస్. ఇదే పాయింటు.
బీజేపీ ఖమ్మంలో ఏం చేస్తుంది ?
గత ఎన్నికల్లో ఖమ్మంలో బీజేపీకి పట్టుమని పాతిక సీట్లు కూడా రాలేదు కదా !
ఇది కూడా పాయింటే !
త్రిపుర అని… ఈశాన్య రాష్ట్రాల్లో ఓ చిన్న రాష్ట్రం.
అక్కడ లెఫ్ట్ ఫ్రంటు 30 ఏళ్లు ఎదురు లేకుండా రాజ్యం చేసింది.
అలాంటి చోట… కనీసం మూలాలు కూడా లేని చోట అమాంతం అధికారంలోకి వచ్చింది బీజేపీ…
రావడమే ఆశ్చర్యం అనుకుంటే… రెండోసారి నిలబెట్టుకుంది కూడా !
అంటే
బీజేపీ…రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పని చేస్తే… ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు.
ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఒకే దెబ్బకు ఓడించిన ఉత్సాహం మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి కలిగింది.
ఇప్పుడు ఖమ్మం వైపు చూస్తుంటే… కొత్త ఆలోచనలు వస్తున్నాయ్ !
ఖమ్మం గుమ్మంలో కొత్త కలకలం అందుకే !
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…