రెండు దశాబ్దాలుగా సంఘ్ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తాండ్ర వినోద్ రావు లాంఛనంగా బీజేపీలో చేరారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆసక్తిని బీజేపీ నాయకత్వం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు,
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ లను కలిసి ఆశీస్సులు అందుకున్న వినోద్ రావు. సంఘ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, నిబద్ధత గల సేవకుడిగా పేరు పడటం అభినందనీయం అని బీజేపీ నాయకత్వం అభినందించింది. క్షేత్రస్థాయిలో సంఘ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, ఏకలవ్య ఫౌండేషన్ సెక్రెటరీగా, సేంద్రిక మిత్ర లాంటి అనేక విభాగాల్లో తనదైన ముద్ర వేసిన వినోద్ రావు … రాజకీయాల్లోకి రావడానికి ప్రజాసేవ చేయాలన్న సంకల్పమే కారణం అని చెప్పారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…