తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల పాటు సంయమనంంగా ఉండగలిగారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పి పోతున్నారు. దారుణమైన భాషతో కేసీఆర్ పై ,బీఆర్ఎస్ పై విరుచుకపడుతున్నారు. ఆ భాష గతంలో కేసీఆర్ వాడిందేనని సమర్థించుకుంటున్నారు. కానీ కేసీఆర్‌ది తప్పు అని నిందించి.. ఇప్పుడు అదే తప్పు తాము చేస్తున్నామని చెప్పుకోవడంలోనే పతనం ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకింత అసహనానికి గురవుతున్నారు ?. ఇంద్రవెల్లి బహిరంగసభ, హైదరాబాద్ ప్రెస్ మీట్లలో ఆయన భాష ముఖ్యమంత్రి పదవికి శోభ తేచ్చేదేనా ? . వాళ్లు అన్నారని.. వీళ్లు అంటే ఇక విలువలకు పాతరేనా ?
బూతుల నేతలపై వెంకయ్యనాయుడు బైట్ తో ప్రారంభించాలి రాజకీయాలు హుందాగా ఉండాలని వ్యక్తిగత విమర్శలు, బూతులు తిట్టే వారిని ప్రజలు పోలింగ్ బూతుల్లోనే బుద్ది చెప్పాలని పద్మ విభూషణ్ వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చెప్పారు. ఆ సభా వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ సన్మానం నుంచి రేవంత్ రెడ్డి నేరుగా సెక్రటేరియట్‌కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఇవీ ..
కేసీఆర్ పై అభ్యంతరకరంగా మాట్లాడిన రేవంత్ రండ మాటల బైట్ ఇక్కడ వాడాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా కంట్రోల్ తప్పిపోయారు. ప్రతిపక్ష నేతను ఇష్టం వచ్చినట్లుగా దూషించారు. వెంటనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో గతంలో కేసీఆర్ అవే మాటలన్నారంటూ కొన్ని క్లిప్పులు ప్రచారం లోకి తెచ్చారు. కేసీఆర్ మాటలు తప్పు అని అప్పట్లో సమాజం ఖండించింది. ఆయన గొప్పగా మాట్లాడారని ఎవరూ అనలేదు. అప్పట్లో కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తప్పు పట్టారు. మరి అదే తప్పును రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు ?. అంత కంటే ఘోరంగా ఎందుకు మాట్లాడారు ?
రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ తప్పులు చేసి తమపై నిందలు వేస్తుందని చెప్పే క్రమంలో ఆవేశ పడ్డారు. అక్కడ తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది.. నిజాలన్నీ ప్రజల ముందు పెడితే అర్థం చేసుకుంటారు. అందుకు అసెంబ్లీ అనే ప్రజాస్వామ్య వ్యవస్థ మన దగ్గర ఉంది. అందులోనే చర్చ పెడతామని కూడా చెప్పారు. అంత మంచి పరిష్కారం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎదురుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ఈ అంశాన్ని పక్కదారి పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?
శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్ నిర్మాణ సభలోనూ రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడున్నారని వారిని పండబెట్టి తొక్కుతామని కట్టేసికొడతామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం.. ప్రభుత్వాలను పడగొట్టడానికి చాన్స్ వస్తే వదులుకోవని అందరికీ తెలుసు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన పని సీఎం మీదనే ఉంటుంది. కానీ ఈ మాటల వల్ల ఆయన ప్రభుత్వం బలంగా మారుతుందా అంటే పెదవి వివరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
రాజకీయాల విలువల్ని రాజకీయ నేతలు తగ్గిస్తున్నారన్నది నిజం. ఒకరు ఈ రోజు తప్పు చేశారని.. తర్వాత అధికారంలోకి వచ్చే వారు అంత కంటే ఎక్కువ తప్పు చేస్తున్నారు. అదేంటి అంటే అంతకు ముందు వారు చేశారు కదా అని దబాయిస్తున్నారు. అందుకే ఓడించి పక్కన పెట్టి మీకు చాన్సిచ్చారు.. మీరు కూడా అలా చేస్తే ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే కోపాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థానానికి ఓ గౌరవం ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత.. ఆ సీటులో కూర్చున్న వారికే ఉంటుంది. నాడు కేసీఆర్ అలా చేశారని ఈ రోజు రేవంత్ రెడ్డి అంతకు మించి చేస్తే..రేపు వచ్చే వాళ్లు మరింత దిగజారుస్తారు. అప్పుడు పోయేది ఆయా వ్యక్తుల పరువు కాదు.. సీఎం హోదా పరువు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని రాష్ట్ర పాలకుడు ఇప్పటికైనా గుర్తిస్తారని ఆశిద్దాం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…