విలన్ బీజేపీ !

By KTV Telugu On 14 February, 2024
image

KTV TELUGU :-

అసెంబ్లీలో  కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యుద్ధం జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడ్డాయి. ఎవరి వాదన వారు వినిపించారు. ఇందులో రాజకీయం ఉందా..  రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా అన్న సంగతి తర్వాత కానీ..  అసలు విషయం రెండు పార్టీలు కలిసి బీజేపీని విలన్ ను చేశాయి.  ప్రాజెక్టులు అప్పగించడం లేదా ఉంచుకోవడం రెండింటిలో దేన్నీ తమ విధానంగా చెప్పలేని పరిస్థితిలో బీజేపీ పడిపోయింది.  ఈ వ్యవహారంలో బీజేపీ ఆటలో అరటిపండుగా మారింది. ఇది బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు తీర్చలేని సమస్యే.

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై అసెంబ్లీలో  వాడివేడి చర్చ జరిగింది.  ఈ చర్చ సారాంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టులను బలవంతంగా తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్న సందేశం ఇవ్వడం. బీఆర్ఎస్ నేతలు అదే తరహా ప్రసంగాలు చేశారు.  కాంగ్రెస్ నేతలూ అదే చెప్పారు. అయితే ఇక్కడ రాజకీయం ఏమిటంటే వీరి ప్రసంగాల్లో ఎక్కడా కేంద్రాన్ని తప్పు పట్టలేదు.  కానీ.. అసలు విలన్ కేంద్రమేనన్న సంకేతాలను గట్టిగా పంపారు. ఈ రాజకీయం చూసి ఎలా స్పందించాలో తెలియక బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. కనీసం నోరు తెరవలేకపోయారు.

కృష్ణా ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తోందనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ.  తాము అప్పగించే ప్రశ్నే లేదని.. గతంలోనే అప్పగిస్తూ సంతకాలు చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఇందులోనే తాము ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది కాంగ్రెస్.. బీఆర్ఎస్ సమర్థించింది. మరి బీజేపీ ఎక్కడ ?.  రెండు విధాలుగా ఇరుక్కుపోయింది బీజేపీ అందుకే సైలెంట్ అయిపోయింది. రెండు పార్టీలు కలిసి  పరస్పర యుద్ధం చేసుకుంటున్నట్లుగా షో చేసి..  బీజేపీని విలన్ గా ప్రజల ముందు పెట్టాయన్న అనుమానాలు బీజేపీ నేతలు పెరుగుతున్నాయి.  అసెంబ్లీ యుద్ధం చూస్తే తెలంగాణలో రాజకీయం అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతోందని అనిపిస్తే అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ విషయంలో బీజేపీ తన వాదన కూడా వినిపించడానికి  ఆసక్తి చూపించలేకపోయింది.

తెలంగాణలో  బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే ఏదో పోరాటం నడుస్తోందని.. రెండు పార్టీల మధ్యే యుద్ధం జరుగుతోందని అనిపించడానికి.. కృష్ణా ప్రాజెక్టుల పేరుతో  రాజకీయం చేస్తున్నారని బీజేపీ అనుమానిస్తోంది. అసలు లేని  వివాదాన్ని తెరపైకి తెచ్చి సభలు.. సమావేశాలు పెట్టుకుంటున్నారని.. ఇదంతా లోక్ సభ ఎన్నికల రాజకీయం అని  గట్టిగా నమ్ముతోంది. కానీ.. కౌంటర్ ఇవ్వడానికి మాత్రం ఆ పార్టీకి సరైన అవకాశం .. వాయిస్ దొరకడం లేదు.  కృష్ణా ప్రాజెక్టుల్ని తాము కాపాడుతున్నామంటే.. తాము కాపాడుతున్నామని  బీఆర్ఎస్, కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా వాదించుకుటంున్నాయి.  నిజానికి విభజన చట్టం పాస్ అయినప్పుడే కేంద్రం అధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లాయి.   పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు కృష్ణా ప్రాజెక్టులపై KRMB అజమాయిషీ మొదటి నుంచి ుంది.   ఎవరికి ఎపప్పుడు ఎంత నీళ్లు కావాలో  కేఆర్ఎంబీనే  నిర్ణయిస్తోంది. బోర్జు సమావేశం ఏర్పాటు చేసి.. ఒప్పందాల మేరకు నీళ్లుకేటాయిస్తోంది.   పదేళ్లలో  కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాల అనుమతులతోనే కదా నీళ్లు ఇస్తోంది.

ఇప్పుడు కొత్తగా అధీనంలోకి తీసుకోవడం అంటే..  భద్రతను చేపట్టడం.  కేంద్ర బలగాల పరిధిలోకి ప్రాజెక్టుల భద్రత తీసుకోవడం. ఇది ఎందుకు జరిగిందంటే..  పోలింగ్ రోజు ఏపీ సర్కార్ చేసిన నిర్వాకం వల్ల జరిగింది.   పోలింగ్ రోజు సాగర్ డ్యాంపై ఏం జరిగిందో అందరూ చేశారు.  ప్రాజెక్టును ఆక్రమించుకున్న ఏపీ పోలీసులు బలవంతంగా గేట్లు కూడా ఎత్తేసుకున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమన్న అనుమానాలు ఉన్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటానికి కారణం అయింది.   మరోసారి   అలా జరగకుండా కేంద్రం రక్షణ ఏర్పాటు చేసింది. నిజానికి ఇది చేయడం కేంద్రానికి అవసరం. రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం కాపాడాలి. ఇందులో  రాజకీయాలకు చోటు లేదు. పైగా  కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల్లో ఒకదానిపై ఇష్టం.. మరో రాష్ట్రంపై అయిష్టత చూపాల్సిన అవసరం లేదు.  అంతిమంగా  నువు కొట్టినట్లుగా నటించు.. నేను ఏడ్చినట్లుగా జీవిస్తానని.. రెండు పార్టీలు ఎవరూ ఊహించని రాజకీయం చేశాయి.  ఇంత కాలం..  బీజేపీతో  ఆ పార్టీ సన్నిహితం.. ఈ పార్టీ సన్నిహితం అని చెప్పి.. ప్రజలను తప్పుదోవ పట్టించారని..  ఇప్పుడు  కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే యుద్ధం చేస్తున్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రజలకు ఎలా చెప్పాలో మాత్రం వారికి అర్థం కావడం లేదు.  పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇదో పెద్ద విషయంగా మారింది. తిప్పికొట్టలేక ప్రజల ముందు  దోషిగా నిలబడాల్సి వస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి