వాళ్ల అసలు టెన్షన్ ..!

By KTV Telugu On 16 February, 2024
image

KTV TELUGU :-

టీడీపీ అధినేత చంద్రబాబు మౌనానికి కారణమేంటి. ఢిల్లీ నుంచి  వచ్చిన తర్వాత బాబు బయటకు ఎందుకు రావడం లేదు. జనసేన వైపు నుంచి కూడా దూకుడు  కనిపించడం లేదు ఎందుకని… చివరకు రాజ్యసభకు కూడా పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు…

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు. కొందరు నేతలను ఇంటికి పిలిపించుకుని  మాట్లాడుతున్నారు. ఆయన భార్య నారా భువనేశ్వరి జిల్లాల పర్యటన చేస్తున్నారు. బాధిత టీడీపీ కుటుంబాలను పరామర్శిస్తున్నారు.అది వేరే ట్రాక్. ఆయన కుమారుడు నారా లోకేష్ అన్నీ తానై శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అధికారానికి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తున్నారు..చంద్రబాబు వైపు నుంచి మాత్రం పొత్తులపై గానీ, మీటింగులపైన గానీ ఎలాంటి అధికారిక  పర్యటన రాలేదు . పైగా జనసేన కూడా టీడీపీ తీరు పట్ల అసంతృప్తిగా ఉందని తెలియడంతో చంద్రబాబు ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఏదీ తేల్చడం లేదని బీజేపీతో పొత్తును ప్రకటించి ఎవరికెన్ని సీట్లో బట్వాడా చేసేస్తే తమదారిన ప్రచారం చేసుకుంటామని జనసేన  ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. అదే ఇప్పుడు టీడీపీ భయానికి కారణమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.  ప్రతీ నియోజకవర్గంలోనూ జనసేన ఆశావహులు సిద్ధమైపోతున్నారు. వారిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదని కింది స్థాయి నుంచి చంద్రబాబుకు రిపోర్టులు రావడంతో సమస్యలను ఎలా పరిష్కరించాలా అని ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు…

పొత్తు సక్సెస్ అవుతుందా. అమిత్ షా  అడిగిందేమిటి. చంద్రబాబు చెప్పి వచ్చిందేమిటి. ఇప్పుడు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటి.. జనసేన నుంచి వస్తున్న వత్తిడి ఏమిటి. టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏమిటి…

పొత్తు అనేది టీడీపీకి రాజ‌కీయంగా లాభం కలిగించడం క‌థ దేవుడెరుగు, శాశ్వ‌తంగా స‌మాధి క‌ట్టేలా వుంద‌నే ఆందోళ‌న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో వుంది. చంద్ర‌బాబు చాణ‌క్యుడ‌ని, ప‌వ‌న్‌లాంటి వారిని మాయ చేసి, అన్ని సీట్ల‌లో త‌న వాళ్ల‌నే నిలుపుకుంటార‌నే ప్ర‌చారం సాగింది. అయితే బీజేపీ ఎప్పుడైతే ఎంట‌ర్ అయ్యిందో అప్ప‌టి నుంచి సీన్ మొత్తం మారిపోతోంది. అమిత్‌షాతో భేటీలో ఏం జ‌రిగిందో చంద్ర‌బాబు బ‌య‌టికి చెప్పుకోలేని ప‌రిస్థితి. మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా దూరంగా వుంటున్నారు. అందుకే పొత్తుపై నీలి నీడ‌లు అలుముకున్నాయి.బీజేపీ-జ‌న‌సేన కూట‌మికి 60 అసెంబ్లీ, 10 లోక్‌స‌భ సీట్లు ఇవ్వాల్సిందే అని అమిత్‌షా ష‌ర‌తు విధించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, అధికారంలో షేర్ కావాల‌ని కూడా అమిత్‌షా తేల్చి చెప్పిన‌ట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అదే జరిగితే టీడీపీని ముసుకోవడమే మంచిదన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది. పైగా జనసేనకే 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందని హరిరోమజోగయ్య లాంటి వాళ్లు పవన్ ను రెచ్చగొడుతున్నారు. బీజేపీతో పొత్తు వల్ల తమకు కూడా కష్టమేనని పవన్ కల్యాణ్ ఆలస్యంగా గ్రహించి ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఒక శాతం ఓట్ షేర్ కూడా లేని పార్టీ అధికారంలో భాగస్వామ్యం అడగడమేంటని జనసేనలో చర్చ జరుగుతోంది.అందుకే రెండు  పార్టీలకు ఇప్పుడు టెన్షన్ పెరిగిపోయింది.

ఈ త్రీవే లవ్ ఎప్పటికి సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. పొత్తు మొత్తం ఫైనలైజ్ అయితే కొందరు నేతలకు టీడీపీ టికెట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. వారికి ఎలా నచ్చజెప్పాలో తెలియక చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. పైగా శంఖారావం సభలు అంటూ క్షేత్రస్థాయిలో  చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.దానికి  పర్యవసానంగా  టికెట్ ఆశించే వారిని ఎలా సంతృప్తి పరచాలి. ఇలాంటివే చంద్రబాబు ముందున్న పెద్ద సవాళ్లు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి