అక్కడ కుల సమీకరణాలే లెక్క….? -Vijayanagaram-YSRCP-TDP-JAGAN-CBN

By KTV Telugu On 22 February, 2024
image

KTV TELUGU :-

టీడీపీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. ఇదీ ఒట్టి ప్రచారం. వైసీపీ  ఎంపీ టికెట్ కోసం వందల  మంది పోటీ పడుతున్నారు. ఇదీ అంత కంటే పెద్ద ఓటి ప్రచారం. ఇప్పుడు ప్రతీ లోక్ సభా స్థానంలోనూ భారీగానే ఆశవహులు కనిపిస్తున్నారు. వాళ్ల బయోడేటా చూస్తే టికెట్ ఇవ్వాల్సిందే  అనేంతగా చర్చ జరుగుతోంది… ఉత్తరాంధ్ర సాంస్కృతిక కేంద్రం విజయనగరంలో ఇప్పుడు  రసవత్తర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ  సెగ్మెంట్లలో పోటా పోటీ ఎలా ఉన్నా… విజయనగరం లోక్ సభా స్థానానికి ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న చర్చ ప్రతి వీధిలోనూ వినిపిస్తోంది. ఆశావహుల్లో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. రెండు ప్రధాన పార్టీల్లో ఎవరికి వారు టికెట్ తమకేనంటూ ధీమాగా ఉన్నప్పటికీ లోలోన భయం వారిని వెంటాడుతోంది.  వడపోతలో ఎవరు కిందకు జారిపోతారో, ఎవరు  బలంగా పట్టుకుని నిలబడతారో అర్థం కాని పరిస్థితి  నెలకొంది. వైసీపీ ఎంపీ టికెట్ కోసం  ఇద్దరు  అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతుంటే..టీడీపీలో ముగ్గురు నుంచి ఆరుగురు మేమంటే మేము అని అంటున్నారు. పైగా అక్కడ తూర్పు కాపు సామాజికవర్గం  డామినేషన్ ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తోంది.వైసీపీ విజయనగరం ఎంపీ నియోజకవర్గం  అభ్యర్థిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు  పేరు దాదాపుగా ఖరారైందని టాక్ వచ్చిన నేపథ్యంలోనే డామిడ్ కథ అడ్డం తిరిగిందన్న వార్తలు కూడా వస్తున్నాయి.అయితే వైసీపీ అధిష్టానం మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్  ను మళ్లీ పోటీ చేయించాలని  జగన్ భావిస్తున్నారు. మజ్జి శ్రీనివాసరావు, లేదా బెల్లాన చంద్రశేఖర్ లో ఎవరు  పోటీ చేస్తారో త్వరలోనే తెలుస్తుంది.

విజయనగరం లోక్ సభా  స్థానానికి ఇంత పోటీ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అదీ అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీలోనే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. కుల సమీకరణాలు లెక్కచెప్పడంతో పాటు ఎంత డబ్బు  అయినా ఖర్చు పెట్టుకుంటామని అంటున్నారు.

విజయనగరం లోక్ సభా స్థానానికి టీడీపీలో  ఇప్పుడు పెద్ద తలకాయలే పోటీ పడుతున్నాయి. డెంకాడ ఎంపీపీగా పనిచేసిన కంది చంద్రశేఖర్  కొంతకాలం క్రితం ఎమ్మెల్యే టికెట్ అశించారు. అందుకు చంద్రబాబు సుముఖంగా లేకపోవడంతో  ఇప్పుడు విజయనగరం లోక్ సభ అడుగుతున్నారు. మరో పక్క వెంపడాపు రమేష్ నాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన రాజకీయంగా పలుకుబడి ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు వెంపడాపు సూర్యనారాయణ కుమారుడు కావడం విశేషం. మరో పక్క కడగల ఆనంద్ కుమార్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షికి స్వయాన సోదరుడు.  గట్టిగా పోటీ పడుతున్న ముగ్గురు బలమైన తూర్పుకాపు   సామాజికవర్గానికి చెందిన నాయకులు కావడంతో ఎవరికి  టికెట్ కేటాయించాలనేది కొంత ఇబ్బందికర పరిణామమే అవుతుంది. వీళ్లందరినీ కాదని మాజీ ఎంపీ, విజయనగరం స్ట్రాంగ్ మేన్ అశోక్ గజపతిరాజుకు టికెట్ కేటాయించాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు ఉన్నట్లు చెబుతున్నారు. మరో పక్క కళా వెంకట్రావు తన కుమారుడి కోసం టికెట్ అడుగుతున్నారు. తనకు ఎచ్చెర్ల అసెంబ్లీ, తన కుమారుడు రాంమల్లిక్ నాయుడుకి విజయనగరం ఎంపీ టికెట్ ఆయన ఆశిస్తున్నారు. ఇక  మీసాల గీత, సుజయ క్రిష్ణరంగారావు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనిలేదు…

విజయనగరం నుంచి గజపతినగరం వరకు ఎక్కడ చూసినా  టీడీపీకి మంచి పట్టే ఉంది. అందుకే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు చాలా మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నాయి. కొందరు వ్యాపారవేత్తలు కూడా టికెట్  ఇస్తే తక్షణమే పార్టీలో చేరతామని చెప్పుకుంటున్నారు. వాళ్లయితే అలవోకగా వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడతారు. మరి పార్టీల అధినేతల మదిలో ఏముందో చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి