టీడీపీ, జనసేన మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా భేటీ అవుతునే ఉన్నారు. సమన్వయ కమిటీలు సీట్ల విషయంలో తల బద్దలు కొట్టుకుంటున్నాయి. ఐనా ఏదో వెలితి, చర్చలు ఒక కొలిక్కి రాలేదన్న టెన్షన్. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందోనన్న భయం. వీటన్నింటి నడుమ పవన్ ఒక ఓపెన్ డిమాండ్ చేసేశారు. అది టీడీపీ పెద్దకు అర్థమవుతుందో లేదో…..
పవన్ వరుసగా రెండు మూడు రోజులు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు తన మనోగతాన్ని ఆవిష్కరంచే ప్రయత్నం చేశారు. పొత్తు కోసం ఢిల్లీ పెద్దల దగ్గర చీవాట్లు కూడా తిన్నానని చెప్పుకున్నారు. వారిని కన్విన్స్ చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చిందని పవన్ వెల్లడించారు. అయితే అదంతా ఒక ఎత్తు. జనసేన ఎన్ని స్ఠానాల్లో పోటీ చేస్తుందన చర్చ మరో ఎత్తు. ఎన్ని సార్లు పవన్ చంద్రబాబుతో చర్చలు జరిపినా అసలు సంగతిపై స్పష్టత రాలేదు. ఇక లాభం లేదనుకుని పవన్ డైరెక్టుగానే పబ్లిక్ టాక్ మొదలు పెట్టారు. జనసేనకు 30 అసెంబ్లీ, మూడు లోక్ సభా స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆయన నర్మగర్భంగా ఓపెన్ డిమాండ్ పెట్టారు. అంతకంటే తక్కువ ఇస్తే తీసుకునేది లేదన్నట్లుగా కూడా ఆయన ధోరణి ఉంది. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం లోక్ సభా స్థానాలను జనసేన అడుగుతున్నట్లు సమాచారం. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలనుకుంటున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బాలశౌరిని మచిలీపట్నం నుంచి పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు. ఇక భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఈ విషయమై ఆయన స్థానిక టీడీపీ నేతలతో కూడా చర్చించారు. వారి మద్దతు కోరారు. గత ఎన్నికల్లో ఆయన ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
వైసీపీని ఆ పార్టీ ఫార్ములాతోనే కొట్టాలని పవన్ భావిస్తున్నారు. అందుకే కాపులకు మాత్రమే తాను నాయకుడిని కాదని ఆయన పదే పదే ప్రకటిస్తున్నారు. బీసీ వర్గాలను దగ్గరకు చేర్చుకుని జనసైన్యంలో వారికి భాగస్వామ్యం ఇవ్వాలన్న కోరిక జగన్లో కనిపిస్తోంది….
సీఎం జగన్ విష సంస్కృతిపై పోరాటం చేయడమే తన ధ్యేయమని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసగించి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని జనసేనాని ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ బీసీల పార్టీ కాదని నిజమైన బీసీ పార్టీ జనసేన మాత్రమేనని ఆయన ప్రచారం చేస్తున్నారు. అందుకు పెద్ద కారణమే ఉంది కాపు నేతలు మాత్రమే పవన్ ను సమర్థిస్తున్నారన్న అపవాదు నుంచి బయట పడాల్సిన అనివార్యత ఆయనపై ఉంది. ఆ పనిచేస్తున్న పవన్, ఇప్పుడు బీసీ మంత్రం జపిస్తున్నారు. బీసీల్లో ఐక్యత లోపించిందని అందుకే జగన్ వారితో గేమ్స్ ఆడుతున్నారని పవన్ ఆరోపిస్తున్నారు. అన్ని కులాల వారిని సాధికారత దిశగా తీసుకువెళ్లాలని అప్పుడు జగన్ ఆట కట్టించే అవకాశం ఉంటుందని పవన్ వాదిస్తున్నారు.
ఎవరినీ అణిచివేయకుండా అందరికీ అవకాశాలు ఇచ్చే పార్టీ జనసేన అంటూ పవన్ ప్రచారం చేస్తున్నారు. నిజానికి కాపులను కూడా బీసీల్లో చేర్చాలి. అటువంటి ప్రయత్నాలు చేసి ఆపేశారన్న ఆగ్రహం కాపు వర్గాల్లో ఉంది. పవన్ కూడా దానిపై గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉందనుకోవాలి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన బీసీలను మంచి చేసుకోగలిగితే .. ఎవరితో పొత్తు లేకుండా గెలిచిపోయే వీలుంటుందన్న విశ్వాసం ఆయనకు ఉంది. పైగా పొత్తు భాగస్వామి అయిన టీడీపీకి మొదటి నుంచి బీసీల పార్టీ అన్న పేరు ఉండనే ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…