రేవంత్ సర్కారు కూలిపోవచ్చు… బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు REVANTH REDDY | MP DR K LAXMAN |

By KTV Telugu On 1 March, 2024
image

KTV TELUGU :-

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నాయకులు విమర్శలు చేయడం సాధారణ విషయమే బిజెపి ఎంపీకే .లక్ష్మణ్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి పార్లమెంట్ ఎన్నికల  లోపు రాష్ట్ర రాజకీయా ల్లో అనుహ్య మార్పులు వస్తాయని . తెలంగాణలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని, రేవంత్ సర్కారు కూలిపోవచ్చని, ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి నీచమైన భాషల్లో విమర్శలు చేస్తున్నారని, బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, ఎన్నికల ఫలితాల తరువాత కర్ణాటక అవుతుందో, హిమాచల్‌ అవుతుందో చూద్దామని ఆయన అన్నారు.ఇప్పటికే హిమాచల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని, మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

అమలు సాధ్యం కాని హామీలతో కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అవి అమలు కాకపోవడంతో కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే వస్తుందని జోస్యం చెప్పారు.  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌ నాయకులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని, మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రుల వ్యవహార శైలి, హామీల అమలు, రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అర్ధమవుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తూర్పారబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే బడ్జెట్‌కు అదనంగా రూ.1.53 లక్షల కోట్లు అవసరమని లక్ష్మణ్ చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు షరతులు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటకను కాంగ్రెస్‌ పార్టీ వాడుకుందని, ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆయన ఆరోపించారు.

బిజెపి విజయసంకల్పయాత్ర జగన్నాథ రథయాత్ర వంటిదని ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్  ఒక సీటు కూడా గెలవదని అది ముగిసిపోయిన చరిత్ర దానితో మేము పొత్తు పెట్టుకోవడం అన్నది కుదరని విషయం . నోటి దురదతో మాట్లాడిన వారికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అన్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి