ఆ నియోజకవర్గంలో వలస నేతకు చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారు.. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ను పక్కన పెట్టేయడంతో ఆయన వర్గం నేతలు కుటుంబ సభ్యులు చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు.. మా మద్దతు లేకుండా చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ఇంతకీ టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారిన నియోజకవర్గం ఏది..? బాబుపై ఆగ్రహంగా ఉన్న ఆ ఎస్సీ సీనియర్ నేత ఎవరు..?
సుళ్లురుపేట ఎస్సీ నియోజకవర్గంలో టిక్కెట్ ఫైట్ రచ్చకెక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి పరసా వెంకటరత్నాన్ని కాదని.. వలస నేతగా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చంద్రబాబు తీరుపై లోలోన రగిలిపోతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలో సుళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయ శ్రీ టికెట్ కేటాయించారు..
దీంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్నా మాజీ మంత్రి పరసా వెంకటరత్నం తీవ్ర మనోవేదనకు గురయ్యారట.. తన అల్లుడు సతీష్ చంద్ర పుట్టుకట్టివ్వాలంటూ చంద్రబాబుని గతంలోనే పరసా వెంకటరత్నం అభ్యర్థించారట. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని.. ఎక్కడ తమకే వస్తుందంటూ పరస వెంకటరత్నం నియోజకవర్గంలో తన అనుచరులకు చెప్పుకుంటూ వచ్చారు.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ వచ్చారు.
పరస వెంకటరత్నం చేస్తున్న ప్రయత్నాలకు.. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గండి కొట్టారట. తన కుమార్తె విజయశ్రీ కి టికెట్ కేటాయిస్తే.. నియోజకవర్గంలో ఉండే నేతలందరూ సహకరిస్తారని.. మరొకరికి టికెట్ ఇస్తే మాత్రం టిడిపి కచ్చితంగా ఓడిపోతుందని అధిష్టానం చెవిలో వేశారట.. దీంతో చంద్రబాబు మాజీ మంత్రిగా సీనియర్ నేతగా ఉన్న పరసా వెంకటరత్నాన్ని పక్కన పెట్టేసారట.. ఈ క్రమంలో నెలవల అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో తన కుమార్తె విజయశ్రీ తెప్పించుకోగలిగారు..
విజయశ్రీ కి సులూరుపేట నియోజకవర్గ టికెట్ అనౌన్స్ కావడంతో పరసా వెంకటరత్నం వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. అండగా ఉన్న తన తండ్రి పరసా వెంకటరత్నానికి కాదని.. పార్టీలు మారే నిలవల సుబ్రహ్మణ్య కుటుంబానికి టికెట్ ఎలా ఇస్తారంటూ పరసారత్నం కుమార్తె శాలిని ప్రెస్ మీట్ పెట్టి మరి అధిష్టానాన్ని ప్రశ్నించింది.. తమ మద్దతు లేకుండా విజయశ్రీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది.. పరస వర్గం సైతం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. నమ్ముకున్నలోనే చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారని.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు వెన్నుపోటు పై మాజీ మంత్రి పరసా వెంకటరత్నం లోలోన రగిలిపోతున్నారట.. తన బలమెంటు తన సత్తా ఏంటో చంద్రబాబుకి చూపిస్తానని తన అనుచరుల వద్ద అంతర్గత సమావేశంలో చెబుతున్నారట. కనీసం మాట మాత్రం తనకు చెప్పకుండా నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి టికెట్ ఎలా కేటాయిస్తారు అంటూ ఆయన అధిష్టానం తీరుపై మండిపడుతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రిగా, చంద్రబాబుకి అనుచరులుగా ఉన్న పరసా రత్నానికే పార్టీలో దిక్కు లేదని అనుచరులు ఫీల్ అవుతున్నారట..
ఇదే క్రమంలో మండలాల వారీగా టిడిపి ముఖ్య నేతలతో పరసారత్నం టచ్ లోకి వెళ్ళారట.. విజయశ్రీ కి సహకారం అందిస్తే తమకు భవిష్యత్తు ఉండదని.. ఆలోచించుకోవాలంటూ నేతలకు సూచనలు చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది.. మొత్తంగా ఎస్సీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తన వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు.. వైసీపీలో ఇన్చార్జిలను మారిస్తేనే.. ఎస్సీలకు ప్రాధాన్యత లేదా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు… పార్టీని నమ్ముకున్న సీనియర్ ఎస్సీ నేతలను చంద్రబాబు ఎలా పక్కన పెట్టేస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…