పవర్‌ఫుల్ “కోడ్” – కానీ – ELECTION CODE – ELECTION COMMISSION OF INDIA

By KTV Telugu On 21 March, 2024
image

KTV TELUGU :-

దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  ఇప్పుడు  పాలన అంతా ఎన్నికల కమిషన్ దే. అధికారులంతా ఎన్నికల సంఘం చెప్పినట్లు వినాల్సిందే.  రాజకీయ బాసులు..  చెప్పిటన్లు వింటే బలైపోతారు.  అంత పవర్ ఫుల్ ఎన్నికల కోడ్.   ఎన్నికల సంఘం ఎంత నిష్పాక్షికంగా ఉంటే… ప్రజాస్వామ్యం అంత గొప్పగా ఉంటుంది. కానీ ఎన్నికల అధికారులే… ఓ పార్టీకి అనుకూలంగా మారితే.. అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అవుతుంది. ఇలాంటి వాటిలో… రక్షకులుగా ఉండాల్సిన అధికారులే… తీరుగా మారితే… మొత్తానికే తేడా వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఈసీలో ఉండే అధికారుల తీరుపై తరచూ విమర్శలు వస్తున్నా.. పక్షపాతం చూపిస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్నా చేయాలనుకున్నది మాత్రం చేస్తున్నారు.

నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పని చేశా.. ఇక కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ్టి నుంచి పీసీసీ అధ్యక్షునిగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. నిజానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావు. అయినా రేవంత్ రెడ్డి అలా అనడానికి కారణం.. ఎన్నికల కోడ్ అంత  పవర్ ఫుల్ కావడమే. మఖ్యమంత్రి అయినప్పటికీ .. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ఇక పీసీసీ చీఫ్‌గా పని చేస్తానంటున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి  అక్కడ కూడా సేమ్ రూల్స్.

దేశంలో అయినా, రాష్ట్రాల్లో అయినా ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్‌ను పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటినే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదా  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. రాజకీయ పార్టీలు అధికార, ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఎన్నికల కోడ్ లక్ష్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు,ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎలక్షన్ కమిషన్‌ కి ఉంటుంది. ఇతర నిబంధనలు ఎలా ఉన్నా అధికారంలో ఉన్న వారు ఓటర్లను ప్రభావితం చేయకుండా.. దుర్వినియోగం చేయకుండా కోడ్ ను పటిష్టంగా అమలు చేస్తారు. అందుకే ఈసీకి సంపూర్ణ హక్కులు దఖలు పడతాయి.

మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ లేదు. ప్రధాని మినహా ఎవరికీ సెక్యూరిటీ, ప్రోటోకాల్ ఉండేందుకు వీల్లేదు. వ్యక్తులు, సంస్థలకు భూ కేటాయంపులపై ఈసీ అనుమతి కావాల్సిందే. సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇచ్చేందుకు వీల్లేదు. అంటే ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రులుగా ఉన్న రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు కూడా ప్రోటోకాల్ ఉండదు. వారు సాంకేతికంగా ఆ పదవిలో ఉంటారు.. కానీ ఆ పదవితో పెత్తనం చేయడానికి మాత్రం అవకాశం ఉండదు.   ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోకూడదు. ఎంపీ గానీ, మంత్రి గానీ అధికారిక పర్యటనను, పార్టీ పర్యటనను వేర్వేరుగా ఉండేలానే చూసుకోవాలి. రెండింటినీ కలపకూడదు.  ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, నేతలపై దర్యాప్తు చేయడానికి, వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉంది.

ప్రధాని మోదీ కానీ ముఖ్యమంత్రి హోదాలో  రేవంత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. 1990ల్లో ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. అందులోనూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ కు… కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయని అధికారాలు ఉంటాయని తెలియదు.  కానీ నిఖార్సయిన అధికారిగా టీఎన్‌ శేషన్‌ ఇలాంటి విస్తృత అధికారాలను గుర్తించారు. ఉపయోగించారు. అక్రమార్కులకు సింహస్వప్నంగా మారారు. ఎంతగా ఉంటే.. అక్రమాల పోలింగ్‌కు కొద్ది గంటల ముందు పంజాబ్‌ ఎన్నికల మొత్తంపై నిషేధం విధించారు. 1993లో  హిమాచల్‌ ప్రదేశ్‌  గవర్నర్‌గా ఉన్న గుల్షర్‌ అహ్మద్‌ .. మధ్యప్రదేశ్‌లో తన కుమారుడి కోసం ప్రచారం చేయడంతో.. ఆ ఎన్నికను సస్పెండ్‌ చేశారు.   నిజానికి ఆనాడు ప్రస్తుతం ఉన్నంత కట్టుదిట్టంగా కూడా కోడ్‌ లేదు. అయినా శేషన్‌ ఆర్టికల్‌ 324తో ఈసీకి వచ్చే అధికారాలను సమర్థంగా ఉపయోగించుకుని ఎన్నికల అక్రమాలను నిరోధించగలిగారు.  కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

ఎన్నికల కమిషనర్ల నియామకమే ఏకపక్షంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వమే నియమిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ముందే ఇద్దరు కమిషనర్లను నియమించారు. వారు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్నది సందేహమే. అసలు  ప్రభుత్వాల అధికార దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని రాజకీయవర్గాలు ఊహించలేవు.  ఎన్నికల సంఘం ఎప్పుడు  వంద శాతం పర్ ఫెక్ట్ గా వ్యవహరిస్తుందో అప్పుడే ప్రజాస్వామ్య పునాదులు మరితం బలోపేతం అవుతాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి