మూడన్నాడు..ఇంట్లో కూర్చున్నాడు.. – Is It The End Of Old Horse – Rayapati – TDP – Chandra Babu

By KTV Telugu On 21 March, 2024
image

KTV TELUGU :-

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయన ఒకప్పుడు తిరుగులేని నాయకుడు.  రాయపాటి అంటే ఓ ఫాలోయింగ్ ఉన్న నేత.  కాంగ్రెస్ లో ఉన్నా. టీడీపీలోకి  వచ్చినప్పుడు అనుకున్నది సాధించిన ధీరుడన్న పేరుండేది. ఇప్పుడు కట్ చేసి చూస్తే సీన్  మారిపోయింది.  ఎన్ని డిమాండ్లు చేసినా రాయపాటి సాంబశివరావును పట్టించుకున్న  వాళ్లు లేరు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇంత చర్చ జరుగుతున్నా రాయపాటి ఎక్కడ అని అనుకున్న  వాళ్లూ లేరు….

గుంటూరు,నరసరావు పేట రెండు  నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు  రాయపాటి. బలమైన సామాజికవర్గం నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల్లో ఉండే వ్యక్తిగా కూడా పేరు పొందారు. గత పది పన్నెండేళ్లుగా మాత్రం ఆయన బాగా డీలాపడిపోయారు. ఆరోగ్య  రీత్యా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా వీల్ చైర్లో తిరుగుతున్నారు. ఐనా ఆశ చావని పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం రాజకీయాల్లో క్రియాశీలమయ్యేందుకు  ప్రయత్నించారు. ఆ క్రమంలోనే రాయపాటి కొన్ని పొరబాట్లు చేసినట్లుగా చెప్పుకోవాల్సి వస్తోంది. తన కుటుంబానికి ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు అడిగి ఆయన పూర్తిగా భంగపడ్డారు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు…

బుచ్చయ్య  తాత అని  కామెడీగా పిలిచే బుచ్చయ్య చౌదరికి కూడా టికెట్ దక్కింది. రాయపాటిని మాత్రం టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదు. టికెట్ ఇవ్వాలన్న కోరిక చంద్రబాబుకు ఉన్నట్లుగా కనిపించను కూడా లేదు. దానితో ఇప్పుడా గుంటూరు కుటుంబం రాజకీయాల్లో సైడ్ అయిపోయే దుస్థితి వచ్చింది…

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాయపాటి చాలా  కాలం ఎక్కడా కనిపించలేదు. టీడీపీ వాళ్లంతా వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతుంటే రాయపాటి ఇంట్లో కూర్చున్నారు. రాయపాటి అనారోగ్యంతో ఉన్నారనుకుంటే ఆయన కుటుంబం కూడా పార్టీలో క్రియాశీలంగా  కనిపించలేదు. పైగా ఎన్నికల ముందు ఒకటి రెండు సార్లు వీల్ ఛైర్లో తిరుగుతూ పెద్ద షో చేశారు. ఎవరికి  ఎక్కడ టికెట్ ఇవ్వాలో తనే చెబుతానన్న రేంజ్ లో కలరింగ్ ఇచ్చారు. తాడికొండ టికెట్ ఎవరికి ఇవ్వాలో రాయపాటి బహిరంగంగా ప్రకటిస్తే.. పార్టీలో చాలా మందికి ఓ రేంజ్ లో చిర్రెత్తుకొచ్చేసింది. పైగా తన కుటుంబానికి టికెట్లు అడిగే క్రమంలో కాస్త  ఉదారంగా ఉంటానన్నట్లుగా  బిల్డప్ ఇచ్చేశారు. మూడు టికెట్లు ఇవ్వలేకపోతే… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్టుకు సర్దుకుంటామని ఆఫరిచ్చారు. అంతా గమనించిన అధిష్టానం టైమ్ వచ్చినప్పుడు రాయపాటిని పక్కన పెట్టేశారు.

అసలే చంద్రబాబు టైము  చూసి కొడతారని అంటారు.  రాయపాటి విషయంలో కూడా అదే జరిగిందనుకోవాలి. అప్పుడు అంత చేటు మాట్లాడిన  రాయపాటి ఇప్పుడు టికెట్ల పంపిణీ టైమ్ లో ఎక్కడా  కనిపించడం లేదు. ఎందుకలా తయారయ్యారో ఆయనకే తెలియాలి

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి