ముగురమ్మలు వర్సెస్ ముగురయ్యలు – AP -TDP-JSP-YCP

By KTV Telugu On 23 March, 2024
image

KTV TELUGU :-

మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేని..పై పెచ్చు చాలా చులకన భావం ఉన్న ముగ్గురు  పురుష నేతలు ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధుల చేతుల్లో  ఓడిపోబోతున్నారా? మహిళా శక్తి ఈ ముగ్గురు నేతలకు ప్రజాస్వామ్య బద్ధంగా గుణపాఠం చెప్పబోతోందా? ఇపుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. మహిళలను తక్కువగా అంచనా వేసే వారు  పెనాల్టీ పే చేయక తప్పదని  రాజకీయపరిశీలకులు అంటున్నారు.

ఎన్నికల నగారా మోగేసింది. మే 13న ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.జూన్ 4న  ఫలితాలు వెలువడతాయి.

ఈ ఎన్నికల్లో మూడు నియోజక వర్గాల్లో పోటీపై సర్వత్రా ఆసక్తి  కనపడుతోంది. ఎందుకంటే టిడిపి-జనసేనలకు చెందిన ముగ్గురు కీలక నేతలు ఈ మూడు నియోజక వర్గాల్లో బరిలో దిగుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి బావయ్య నందమూరి బాలయ్య, ఆయన అల్లుడు చంద్రబాబు  తనయుడు నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ లు పోటీ చేయబోతోన్న నియోజక వర్గాలగురించి   రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ మూడు నియోజక వర్గాల్లోనూ ఈ ముగ్గురు నేతలను కంగారు పెడుతోన్న  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధులు ముగ్గురూ కూడా మహిళలే కావడం విశేషం.

నందమూరి బాలకృష్ణ  మరోసారి హిందూపురం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక మహిళను బరిలో దింపింది. తిప్పెగౌడ నారాయణ్ దీపిక కు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. బీసీ సామాజిక  వర్గానికి చెందిన మహిళ కావడంతో బాలకృష్ణను ఓడించే అవకాశాలు ఉన్నాయని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే హిందూపురం నియోజక వర్గంలో బాలయ్యను కొట్టే శక్తి ఎవ్వరికీ లేదని బాలయ్య అభిమానులతో పాటు టిడిపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ పై  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్ధిని బరిలో దింపింది. బీసీ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న  మంగళగిరి నియోజక వర్గంలో అదే వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు పార్టీ నాయకత్వం టికెట్ కేటాయించింది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేసిన  నారా లోకేష్  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ సారి కూడా లోకేష్ ను ఓడించి తీరాలన్న పట్టుదలతోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్ధి అయిన లావణ్యకు అవకాశం ఇచ్చింది. ఇక జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గం నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి వంగా గీతను ఎదుర్కోవాలి.

ఉన్నత చదువులు చదివిన విద్యావేత్త వంగా గీత. ఆమె రాజకీయంగానూ సుదీర్ఘ అనుభవం ఉన్నవారు. ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలిగా..అయిదేళ్ల పాటు ఎంపీగా వ్యవహరించిన  వంగా గీత 2009లో పిఠాపురం నియోజక వర్గం నుంచే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు కూడా. సేవాకార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే వంగా గీత పట్ల నియోజక వర్గంలో చాలా  మంచి పేరు ఉంది. వంగాగీతపై విజయం సాధించడం పవన్ కు అంత తేలికేమీ కాదంటున్నారు రాజకీయ పండితులు.

ఇక నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ పరిశ్రమలో అత్యంత వెకిలిగా మాట్లాడగల ఆర్టిస్ట్ గా బాలయ్యకు  పేరుంది. ఓ కార్యక్రమంలో మహిళల సమక్షంలోనే నందమూరి బాలయ్య మాట్లాడుతూ అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి..లేదంటే కడుపైనా చేయాలి అంటూ పరమ లంగా భాష మాట్లాడారు.ఆడ బిడ్డకు తండ్రి అయి ఉండి తన కూతురు వయసుండే అమ్మాయిల సమక్షంలో అమ్మాయిల గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే బాలయ్య  ఎంత దిగజారి మాట్లాడతారో అర్ధం చేసుకోండని  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు అంటున్నారు.

ఇక మూడో నాయకుడు పవన్ కల్యాణ్. మహిళలను దేవతలుగా కొలిచే  పుణ్యభూమిలో పుట్టి మూడు పెళ్లిళ్లు చేసుకుని మహిళలపై తనకేపాటి గౌరవం లేదని చాటుకున్నారని ఆయన ప్రత్యర్ధులు అంటున్నారు. అయితే వ్యక్తిగత జీవితాల్లోకి  తొంగి చూడ్డం కరెక్ట్ కాదంటున్నారు జనసైనికులు. అలాగే  బాలయ్య సరదాగా చేసిన కామెంట్స్ కి విపరీతార్ధాలు తీయడం దుర్మార్గమని టిడిపి నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలపై మహిళా అభ్యర్ధులు బరిలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ముగ్గురు మహిళలూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  వారే కావడంతో ముగ్గురు మహిళలూ గెలిచి ఈ ముగ్గురికీ గుణపాఠం చెబుతారని వైసీపీ ప్రచారం చేస్తోంది. వాళ్లకి అంత సీన్ లేదని టిడిపి-జనసేనలు కౌంటర్ ఇస్తున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి