జనసేన అధినేత పవన్‌కల్యాణ్ లారీ లోకల్ పర్మిట్ తీసుకుంది. వారాహి పేరుతో తయారు చేయించుకున్న పెద్ద లారీ మీద పర్యటిస్తూ జనసేన కార్యకర్తలకు ప్రచారం చేయబోతున్నారు పవన్. అయితే పవన్ లారీ కేవలం జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే వెళుతుంది. టీడీపీ అభ్యర్థులున్న సెగ్మెంట్లలో తిరిగేందుకు పవన్ లారీకి పర్మిషన్ ఇవ్వలేదా? పవన్ బరిలో నిలుస్తానంటున్న పిఠాపురంలోనే 20 రోజుల పాటు వారాహి తిరుగుతుందట. సగం రోజులు పిఠాపురంలోనే..మరి పవన్ రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడంలేదు. వాచ్ దిస్ స్టోరీ..
పార్టీ అగ్రనేతలు ఎవరూ కూడా సొంత నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని లైట్ తీసుకుంటారు. ఒకసారి వెళ్ళొస్తారు. మిగిలిన ప్రచార వ్యవహారాలన్నీ స్థానికంగా ఉన్న నాయకులే చూసుకుంటారు. కాని జనసేనకు అధినేతగా ఉంటున్న పవన్ మాత్రం సగం రోజులు తాను పోటీ చేస్తానని ప్రకటించిన పిఠాపురం నియోజకవర్గానికే కేటాయించబోతున్నారు. మిగిలిన సగం రోజుల్ని తన పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడినపుడు మిగిలిన పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పవన్ ఎందుకు ప్రచారం చేయబోవడంలేదు? సొంత నియోజకవర్గానికే సగం రోజులు కేటాయించడానికి కారణం ఏంటి?
పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుతో ఆయన ఎవరిపైన అయితే నమ్మకం పెట్టుకున్నారో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాపు సామాజికవర్గం ఓట్లు భారీగా ఉన్నందునే వెతికి వెతికి పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు. గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేయడానికి పవన్ సాహసించలేకపోయారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి ఆ పార్టీకి ఆక్సిజన్ అందించానని..బీజేపీ అగ్రనేతలతో చీవాట్లు తిని టీడీపీతో పొత్తుకు వారిని ఒప్పించానని పవన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కాని సీట్ల విషయం వచ్చేసరికి చంద్రబాబు చెప్పినట్లే వింటున్నారు. కాపు సామాజికవర్గానికి పవన్ నాయకత్వం వల్ల మేలు జరుగుతుందని వారు భావించారు. కాని పవన్ మాత్రం చంద్రబాబు ఇస్తున్న ప్యాకేజీలకోసం తన సామాజికవర్గాన్నే టీడీపీకి తాకట్టు పెట్టారని వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ శ్రయోభిలాషులైన చేగొండి హరిరామజోగయ్య కుటుంబం, ముద్రగడ కుటుంబం పవన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ..వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిపోయారు.
వంగవీటి రంగాను హత్య చేసిన నాయకుల ఆధ్వర్యంలోని టీడీపీకి పవన్ కల్యాణ్ ఊడిగం చేయడాన్ని కాపు నేతలు సహించలేకపోతున్నారు. పైగా ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో..ఎలా మాట్లాడుతాడో ఆయనకే తెలియన పవన్ నాయకత్వం మీద అందరికీ నమ్మకాలు పోతున్నాయి. ఆఖరుకు పిఠాపురంలో కూడా పవన్‌కు పనిచేసేవారు ఇప్పుడు కరువయ్యారు. గత ఎన్నికల్లో పిఠాపురంలో పోటీచేసిన శేషకుమారి కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. స్థానికంగా కూడా పలువురు నేతలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఆధ్వర్యంలో ఫ్యాన్ కిందకు చేరిపోతున్నారు. ఈ పూర్వరంగంలో పవన్‌కు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ సగం రోజులు తన నియోజకవర్గంలోనే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్న నారా లోకేష్‌ను కూటమి సభలకు ఇప్పటికే దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు. లోకేష్ తెలివి తేటల మీద టీడీపీలోనే ఎవరికీ నమ్మకం లేదు. పైగా అవగాహన లేకుండా ఏదోఒకటి మాట్లాడి పదే పదే పార్టీ పరువు తీస్తున్నారని లోకేష్ గురించి అందరూ అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కూడా తన పుత్రుడిని అతను పోటీ చేస్తున్న మంగళగిరికే పరిమితం చేశారు. ఇక దత్తపుత్రుడు పవన్ కూడా ఊగిపోతూ ఉపన్యాసాలు ఇవ్వడంతో..ఆవేశంతో ఏది పడితే అది మాట్లాడటంతో ఆయన్ను కూడా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావాలని చంద్రబాబు ఆదేశించినట్లు టాక్ నడుస్తోంది. అందుకే తన పర్యటన ప్లాన్‌ను కేవలం జనసేన అభ్యర్థులు, తాను పోటీ చేస్తున్నా పిఠాపురం వరకే తయారు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు
పిఠాపురంలోని జనసేన నాయకులంతా పార్టీ వీడి వెళ్లిపోతుండటం..టీడీపీ నాయకుల సహాయ నిరాకరణతో పవన్‌కు దిక్కు తోచడంలేదు. అందుకే తప్పనిసరిగా పిఠాపురంకే పరిమితం కావాలనుకుంటున్నారు. మిగిలిన తన పార్టీకి చెందిన 20 నియోజకవర్గాలకు రెండేసిసార్లు వెళ్ళేవిధంగా ప్లాన్ చేశారు. ఎన్నికల తర్వాత ఎలాగూ పిఠాపురం పవన్ కనిపించడని..అటువంటి వ్యక్తి కోసం రాజకీయ భవిష్యత్ ఎందుకు నాశనం చేసుకోవడం అనే ప్రశ్న అక్కడి కాపుసామాజికవర్గం నేతల్లో మొదలైంది. అందుకే పవన్‌కు పనిచేయానికి ఎవరూ ఉత్సాహం చూపించడంలేదు. మొత్తం మీద పవన్‌కు ఇవే ఆఖరు ఎన్నికలనే టాక్ బాగా వినిపిస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…