లోక్ సత్తా కు NDA ని గెలిపించేంత సీన్ ఉందా? – Not a Local Satta

By KTV Telugu On 24 March, 2024
image

KTV TELUGU :-

లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మళ్లీ లైమ్  లైట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగని ఆయన ఎన్నికల్లో  పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఆయనకు అంత సీన్ లేదు. అందుకే ఎన్డీయేకు మద్దతు పలుకుతున్నారు. మరి లోక్ సత్తాకు ఎన్డీయేను గెలిపించేంత సీన్ ఉందా.  అసలు ఎన్డీయేకు లోక్ సభా మద్దతు అవసరమవుతుందా…

జయప్రకాష్ నారాయణ ఇప్పుడు టీవీల్లో కనిపించడం కూడా తగ్గించేశారు. సడన్ గా ప్రత్యక్షమైన ఆయన  రాజకీయ స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి కామెంట్ చేయని లోక్ సత్తా… ఏపీలో మాత్రం ఎన్డీయేకు మద్దతిస్తోంది. అక్కడ అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయి. కాంగ్రెస్ పార్టీ సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. గత వైభవం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యులైన వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోనుంది. దీంతో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. అయితే వైసీపీ, ఎన్డీయే  కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఈ తరుణంలో లోక్ సత్తా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది.పైగా సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధికి ఓటేయ్యాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. అందులో బహిరంగ సందేశమూ ఉంది. వైసీపీ వల్ల అభివృద్ది సాధ్యం కాదని, అది టీడీపీతోనే కుదురుతుందని చెప్పేందుకు లోక్ సత్తా అధినేత ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి ఇప్పుడు అత్యవసరమని ఎవరైనా ఒప్పుకుంటారు. కాకపోతే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన పనేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం అన్నట్లుగా జయప్రకాష్ నారాయణ తీరు ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి…

జయప్రకాష్ నారాయణ  పార్టీ పేరు లోక్ సత్తా. ఆ పార్టీకి లోకల్ గా కూడా ఎక్కడా సత్తా లేదు. వార్డు మెంబర్ గా గెలిచే సీన్ కూడా క్రియేట్ చేసుకోలేకపోయారు. ఐనా ఇప్పుడు కీలక ఎన్నికల్లో నేను సైతం అంటూ ఏదో స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారన్న ఫీలింగు వస్తోంది..

ఆయన సమర్థుడైన ఐఏఎస్ అధికారి అనడంలో సందేహించాల్సిన అవసరం లేదు.  ఉద్యోగంలో ఉన్నప్పుడు  ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పనులను ఇప్పుడు కూడా  చాలా మంది నెమరువేసుకుంటుంటారు. విశాఖ ఉక్కు భూనిర్వాసితులకు  ఆయన దగ్గరుండి మెరుగైన పరిహారం ఇప్పించారు. కెరీర్ చివరి దశకు రాకముందే ఎందుకో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనిపించింది. జయప్రకాష్ నారాయణ లోక్ సత్తాను ఉద్యమ సంస్థగా ప్రారంభించారు. తరువాత ఆ వేదికను రాజకీయ పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ బరిలో దిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయప్రకాష్ నారాయణ గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను దించారు. కానీ జేపీ ఒక్కరే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి జేపీ పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటినుంచి రాజకీయాలకు స్వస్తి పలికారు. అప్పటి నుంచి సమకాలిన రాజకీయ అంశాలపై టీవీ చర్చలకు పరిమితమయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియలో లోక్ సత్తా ప్రయోగం  ఫలించలేదని తేలిపోయింది.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయినా.. అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో స్థాపించిన  లోక్ సభా ఫెయిలయ్యిందని నిరూపితమైంది. తెలుగు  ప్రజలకు అలాంటి ప్రయోగాలు నచ్చవని తేలిపోయింది. అయినా పెద్దాయన్న  జయప్రకాష్ నారాయణకు ఆశచావలేదనిపిస్తోంది. ఏదో విధంగా పొలిటికల్  లైమ్ లైట్లో ఉండాలనుకుంటున్నారు…

టీడీపీ తరహాలో లోక్ సత్తా ప్రభంజనలా రాలేకపోయింది. తొలుత  పరిమిత స్థాయిలో మద్దతు లభించినా, తర్వాత గాలి తీసిన బెలూన్లా అది తుస్సున పోయింది. మీటింగులకు పరిమితమైన జయప్రకాష్ నారాయణ.. ఇప్పుడు మళ్లీ రాజకీయ ఆకాంక్షలతోనే ఎన్డీయేకు మద్దతిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే తెలుగు  ప్రజల్లో ఒక శాతం బలం కూడా లేని లోక్ సత్తా మద్దతిస్తే ఎంత ఇవ్వకపోతే ఎంతే. అంతా మిథ్య కాకపోతే..ఎందుకు ఇలాంటి స్టేట్ మెంట్స్….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి