షర్మిలతో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం..! || Sharmila congress

By KTV Telugu On 25 March, 2024
image

KTV TELUGU :-

వరుస పరాజయాల తర్వాత నిద్రాణంగా పడున్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలా రెడ్డి కొత్త కళ తెస్తున్నారు. ఏపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అహర్నిశలు పనిచేస్తూ పార్టీ యాక్టివిటీస్ పెంచారు. ఈ క్రమంలో నేతలందరినీ కలుపుకుపోతున్నారు. ఇక తమ పనైపోయిందనుకున్న పాత నేతలంతా ఇప్పుడు షర్మిల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమై ఆమె వెంట నడుస్తున్నారు. టీడీపీ, వైసీపీ కంటే తామే  బెటరని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు….

ఆమె కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి  కుమార్తె మాత్రమే అనుకుంటే పొరపాటే. సొంత బలంపైనా,  ప్రజాదరణపైనా ఎదగాలనుకుంటున్న నాయకురాలామె. తాను స్థాపించిన  వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం  చేసినప్పుడు షర్మిలా రెడ్డి పనైపోయిందని ఎవరైనా అనుకుంటే అది వారి పొరబాటు  మాత్రమే. కాంగ్రెస్ అధిష్టానం  పిలిచి పీసీసీ పదవి ఇచ్చిన రోజు నుంచి నేటి వరకు ఆమె అలుపు అనేదే  లేకుండా పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి కడప గల్లీ దాకా ఆమె తిరుగుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చారన్న  పేరు కూడా ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్  పార్టీ జెండా మోసేందుకే నాయకులు లేని రోజుల్లో ఆమె ధైర్యంగా రాజకీయ కదనరంగంలోకి దిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ  గురించి  తెలుగు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి పార్టీని అభివృద్ది చేశారు. ఇదంతా చాలా తక్కువ సమయంలో తన సంకల్పబలంతో ఆమె సాధించగలిగారు..

షర్మిల నాయకత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ సభ మచ్చుతునక మాత్రమే.  వచ్చిన జనాన్ని చూస్తే కాంగ్రెస్  ను ఆమె మళ్లీ ఎలా గాడిలో పెడుతున్నారో అర్థమవుతుంది. పైగా తెలంగాణలో తనను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డినే ఆమె విశాఖ రప్పించగలిగారు. అదీ మామూలు విషయం కాదుగా…..

విశాఖ స్టీల్ ప్లాంట్లో  కాంగ్రెస్ న్యాయసాధన సభ  పేరుతో  నిర్వహించిన  సభకు అసలు జనాలు వస్తారా.. అని చాలా మందిలో అనుమానం ఉండేది.  కానీ అనుహ్యంగా సభలో ఏర్పాటు చేసిన  ఒక్క చైర్ కూడ ఖాళీ లేకుండా జనాలు కూర్చున్నారు.అంతేకాదు బయట నిల్చుని మరి స్పీచులు విన్నారు.ఎయిర్ పోర్టు నుండి సభ స్థలి వరకు  భారీగా స్వాగత భ్యానర్లు,కటౌట్లు ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగానే స్వాగతం పలికారని చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం షర్మిల.. ఏపీసీసీ పగ్గాలు  చేపట్టారని రేవంత్ రెడ్డి చెప్పడం జనంలో ఆమె పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచింది. పైగా ఒక తెలుగువాడిగా తాను అన్ని సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని షర్మిల సమక్షంలో  రేవంత్ రెడ్డి ప్రకటించడం ఒక హైలైట్. రాజకీయంగా ఎదగాలనుకున్న వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారని కూడా రేవంత్ కుండబద్దలు కొట్టారు. విశాఖ సభకు రేవంత్ రావడం ఒక వంతు అయితే..ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుండటం  మరో  వంతు… గత ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ సారి ఇండియా గ్రూపుగా కమ్యూనిస్టులను  కలుపుకుని కాంగ్రెస్ పోటీ చేస్తోంది. అలా చూసినా నాలుగు శాతం ఓట్లు ఉండకూడదు. అయితే తాజా సర్వేలు మాత్రం ఇండియా గ్రూపుకు ఈ సారి ఎన్నికల్లో 20 శాతం వరకు ఓట్లు వస్తాయని చెబుతున్నాయి. కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోందని లెక్కగడుతున్నాయి..

నాయకుల కరిష్మా కూడా పార్టీకి పనిచేస్తుందని  చెబుతారు. దూకుడున్న నాయకులు ఉంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంటారు. అలాంటి నాయకులు ఉన్నప్పుడు నిద్రపోతున్న ద్వితీయ శ్రేణి బ్యాచ్ కూడా  మేల్కొని పనిచేయడం ప్రారంభిస్తుందంటారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది కూడా అదే. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఓటర్లకు రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆశలు పెరిగాయి..టీడీపీ, వైసీపీ పట్ల విసిగిపోయిన వారికి కాంగ్రెస్ ఓ మంచి ప్రత్యామ్నాయం అవుతోంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి