పిల్లలు కొట్టుకున్నారనుకోండి తల్లి ఎవరి పక్షం వహిస్తుంది… ఈ ప్రశ్న నిజానికి చాలా క్రిటికిల్. చాలా మంది అమ్మలు డిప్లొమాటిక్ గా వ్యవహించి సమస్యను పరష్కరించుకుంటారు. అంబానీ కుటుంబంలో ఆస్తి తగాదా వచ్చినప్పుడు కూడా వాళ్ల అమ్మ గొడవలు లేకుండా పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీలో మాత్రం ఏం జరుగుతుందోనని కొంత మేర ఉత్కంఠ ఉన్న మాట వాస్తవం. జగన్ వర్సెస్ షర్మిల ఆస్తి వివాదంతో పాటు పొలిటికల్ వివాదంలో తల్లి విజయమ్మ కుమిలిపోతున్నారని తెలుస్తోంది. ఇద్దరినీ ఒక రేంజ్ దాటకుండా ఎలా చూసుకోవాలో అర్థం కాక ఆమె ఇబ్బంది పడుతున్నట్లుగా భావిస్తున్నారు..అలాగని సర్దిచెప్పగలరా అంటే అదీ లేదు..
ఏపీ సీఎం జగన్ బుధవారం ఇడుపులపాయ వెళ్లారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు ఆయన వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. అప్పుడు తల్లి విజయమ్మ కూడా ఆయన వెంటే ఉన్నారు. జగన్ ను ఆశీర్వదించడంతో పాటు ఆయన నుదుటిమీద ముద్దు పెట్టి సాగనంపారు. రెండో సారి గెలిచేందుకు జీసస్ దీవెనలు ఆమె కోరారు. తన బిడ్డను జీసస్ కు అప్పగిస్తున్నట్లు, ఆయన్ను గెలిపించే బాధ్యత దేవుడే తీసుకోవాలని ఆమె ప్రార్థించారు. ఇది బయటకు కనిపించే అంశం. విజయమ్మ చాలా ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించారు. నిజానికి ఆమె అంత ఉల్లాసంగా లేరు. టెన్షన్ పడుతున్నారు. జగన్, షర్మిల మధ్య నలిగిపోతున్నారు. జగన్ పై షర్మిల కత్తికట్టి మరీ రాజకీయంగా పోరాడుతున్న తరుణంలో ఏం జరుగుతుందోనని ఆమెకు దిక్కుతోచడం లేదు..
షర్మిలకు జగన్ ఆస్తి పంచివ్వ లేదు. ఎలాంటి రాజకీయ పదవి ఇవ్వలేదు. దానితో ఆగ్రహం చెందిన ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఆయనపై కసి తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. డైరెక్టుగా అటాక్ చేస్తున్నారు. దీనిపై జగన్ నేరుగా విజయమ్మ వద్ద ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కాస్త అసహనం, ఆగ్రహం కూడా అందులో కనిపించిందట.అదే ఇప్పుడు విజయమ్మ టెన్షన్ కు కారణమవుతోంది….
తల్లిని,చెల్లిని వెళ్లగొట్టినోడు రాష్ట్రానికి ఏం చేస్తాడన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాల నినాదం. ఆ నినాదం ప్రతీ ఇంట మారుమోగాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పైగా వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి విజయమ్మను తప్పించిన తర్వాత విపక్షాల విమర్శలకు మంచి అవకాశం దక్కింది. షర్మిల కూడా తెలంగాణ రూటులో ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పీసీసీ అధ్యక్షురాలైన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వేడిని పెంచారు.ఇతర పార్టీలతో కలిసిపోయి షర్మిల తనను టార్గెట్ చేశారని జగన్ నమ్ముతున్నారు. అదే సంగతి ఓ సారి విజయమ్మ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సారి తను అధికారం కోల్పోతే జైలుకు వెళ్లడం తప్పదని అప్పుడు బయటకు రావడం కూడా కష్టమేనని జగన్ వివరించినట్లు సమాచారం.అదే విషయాన్ని షర్మిల వద్ద విజయమ్మ ప్రస్తావిస్తే…మరి నాకు జరిగిన అన్యాయం సంగతేమిటని ఎదురు ప్రశ్న వచ్చిందట. దానితో ఏం చెప్పాలో తెలియక విజయమ్మ బక్కచిక్కిపోయారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నా చెల్లెలి మధ్య ఎన్ని తూటాలు పేలతాయో అర్థం కాక విజయమ్మ టెన్షన్ పడిపోతున్నారు.నువ్వు అన్న పక్షపాతి అని షర్మిల ఆరోపిస్తే ఏం చేయాలో తెలీయక ఆమె ఆందోళన చెందుతున్నారు….
కాంగ్రెస్ లో చేరిందే తడవుగా పీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్న షర్మిల నిదానించే అవకాశాలు లేవు. పైగా వివేకా హత్య కేసు విచారణలో జగన్ నిర్లక్ష్యం వహించారని ఆమె ఆగ్రహం చెందుతున్నారు. ఇక రోజువారీ దబిడిదిబిడేనన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఏం చేయాలో విజయమ్మకు పాలుపోవడం లేదట…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…