రఘురామ ధర్మాగ్రహం – Raghurama Angry On Babu Pavan

By KTV Telugu On 3 April, 2024
image

KTV TELUGU :-

వైసీపీ రెబెల్ స్టార్ ap రఘురామ కృష్ణరాజుకు కోపమొచ్చింది.  ఇంతకాలం జగన్   కు వ్యతిరేకంగా తన సేవలను వినియోగించుకున్న విపక్షాలు  ఎన్నికల వేళ మొండిచేయి చూపిస్తున్నాయన్న ఆగ్రహం  కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. గత నాలుగేళ్ల అనుభవాన్ని చూస్తే ఎవరు ఎంత చేశారు.. ఎవరు ఎక్కడ తప్పించుకు తిరిగారు అన్న లెక్క తేలుతుందని ట్రిపుల్ ఆర్ అంటున్నారు. భయపడుతూ  బతికిన వారిలో దమ్ము తెచ్చిందీ తానేనని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. ఒక్క టికెట్ విషయంలో ఆ మూడు పార్టీలు స్పందించిన తీరు రఘురామను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది.

జగన్ పై తొలి కత్తి దూసిన నాయకుడు రఘురామేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సొంత పార్టీ నేత అయిన సీఎం జగన్ పై కేసు వేసింది కూడా ఆయనే. సీఐడీ అరెస్టు  చేసి లోపలేసి కొట్టినా జంకుబంకు లేకుండా జగన్ వ్యతిరేకోద్యమాన్ని రఘురామ ధైర్యంగా, ధీటుగా  కొనసాగించారు. రఘురామ ఫైట్ చూసి ధైర్యం తెచ్చుకునే టీడీపీ, జనసేనలు జగన్ వ్యతిరేక పోరులోకి దిగాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం కాదు. గత మూడేళ్లుగా జరుగుతున్న ఉద్యమం ప్రతీ ఒక్కరూ కళ్లారా చూసిందే కదా. టీడీపీ వేరు, రఘురామ వేరు అన్న ఫీలింగు పోయి వేర్వేరు పద్ధతుల్లో ఇద్దరు  ఒకే లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారన్న ఫీలింగ్  వచ్చేసింది. జగన్  ను అధికార పీఠం నుంచి లాగి కింద పడేసే సత్తా టీడీపీ మద్దతుతో రాజకీయాలు చేస్తున్న రఘురామకే ఉందని ఏపీ  జనం విశ్వసించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జగన్ కు వ్యతిరేక కూటమిలో రఘురామ కీలక భాగస్వామి అవుతారని తన నర్సాపురం లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందుతారని కూడా జనం బహిరంగంగా  చర్చించుకున్న అంశం. తీరా చూస్తే ఎన్డీయే కూటమి పార్టీల్లో నర్సాపురం నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడం దాన్ని రఘురామకు  కాకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మకు  వెళ్లిపోవడం చకచకా జరిగాయి. తాను నర్సాపురం నుంచి  పోటీ చేస్తున్నానని చంద్రబాబు, పవన్ పాల్గొన్న తాడేపల్లిగూడెం సభలో స్వయంగా ప్రకటించిన రఘురామకు ఈ పరిణామం అర్థం కాలేదు. ఫైనల్ గా ఏమవుతుందో చూద్దామనుకున్న రఘురామకు దిమ్మతిరిగే నిజం తెలిసింది. కూటమి పార్టీల్లో అన్ని సీట్లు ఫిలప్ అయిపోయాయే తప్ప ఆయన పేరు మాత్రం ఎవరి జాబితాలోనూ కనిపించలేదు….

టీడీపీ,జనసేనపై రఘురామ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ల కోసం తాను పోరాడితే తనకే ఠికాణా లేకుండా చేస్తున్నారన్న కోపం పెరుగుతోంది. మీరు ఇళ్లలో దాక్కున్నదీ నిజం కాదా  అని ఆయన నిలదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెబుతున్నారు. కాకపోతే రఘురామకు ఇంకా ఆశ చావలేదు. అందుకే ఆగ్రహం కట్టలు తెంచుకుని బయటకు రాకుండా ఆపుకుంటున్నారు..

రఘురామ  ఇప్పుడు మీడియా మిత్రులు, తన రాజకీయ  మిత్రుల దగ్గర అక్కసు వెళ్లగక్కుతున్నారు. 2019లో జగన్  గెలిచిన తర్వాత  మరో 30 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా ఉంటారని డిసైడైన విపక్ష నేతలు…చాలా కాలం  ఇళ్లలో దాక్కుని పడుకున్నారని రఘురామ బహిరంగ  ఆరోపణలు చేస్తున్నారు. ఏడాది పాటు తాను ఒక్కడినే పోరాడుతుంటే…వాళ్లు పోలీసులకు డబ్బులిచ్చి హౌస్ అరెస్టులు చేయించుకున్నారని కూడా ఆయన అంటున్నారు. అలా బతుకుజీవుడా అని సేఫ్  గేమ్  అడుతున్న వారికి తన ఉద్యమం కారణంగానే  నూతన రాజకీయ జవసత్వాలు కూడాయని రఘురాజు గుర్తు చేస్తున్నారు. జగన్  పాలనలో అరాచకాలు  తారా స్థాయికి చేరిన తర్వాతే చంద్రబాబు, పవన్  బయటకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెట్టారని, అది కూడా తను ఇచ్చిన ధైర్యమేనని రఘురామ వాదిస్తున్నారు. నిజానికి రఘురామ ఎంతో కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు  కలిసి ఏమార్చి పక్కన కూర్చోబెట్టారన్న ఆగ్రహం  ఉన్నప్పటికీ గట్టిగా ఏమీ చేయలేని పరిస్తితుల్లో ఆయన ఉన్నారు. తన ఆగ్రహాన్ని బహిరంగంగా చెప్పుకుంటూ పోతే వైసీపీ వారికి చులకన అవుతానన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. వాళ్లు  ఒక ఆటాడుకుంటారని ఆయనకు తెలుసు. ఐనా కూడా ఎన్డీయే కూటమి చేసిన ద్రోహాన్ని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ టికెట్ ఇవ్వదని రఘురామకు ముందే తెలుసట. చంద్రబాబు చక్రం తిప్పి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చి నర్సాపురం నామినేషన్ చేతిలో  పెడతారని ఆయన ఎదురుచూశారు. ఆ పని జరగకపోవడంతో ఇప్పుడు బాబుపై రఘురాజు తీవ్ర ఆగ్రహం  చెందుతున్నారు.

ఎన్నికల నాటికి ఏదోటి చేసి రఘురామకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొచ్చు. అది కష్టమేమీ కాదు. కాకపోతే ఇప్పుడు  జరిగిపోయిన డేమేజ్ ను మాత్రం  సరిచేయడం ఎవరి వల్లా కాదు. వైసీపీకి భయపడే రఘురామ ఇప్పుడు చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని చెప్పుకుంటున్నారు. అంతే తప్పితే ఏదో అద్భుతం జరిగిపోతుందని  కాదు కదా… వాపు  కూడా లేని రఘురాజు..వాపును సృష్టించుకుని దాన్ని బలుపు అనుకుని ఇంతకాలం రెచ్చిపోవడమే రాజకీయాల్లో చోద్యమని చెప్పాలి. చంద్రబాబుకు కానీ, ఇంకెవరికైనా కానీ  అధికారం అవసరమే తప్ప. వాళ్లకు కావాల్సిందీ రఘురాజు కాదని ఆయన అర్థం చేసుకోలేకపోయారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి