పార్టీల జాతకాల్ని రాసేది రైతే !

By KTV Telugu On 20 April, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా రైతు చుట్టూ తిరుగుతోదంి. సాధరాణం  పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపై ఉంటుంది. కానీ దక్షిణాదిలో మాత్రం రాష్ట్రాల అంశాలే కీలకమవుతాయి. ఆ  ప్రకారం తెలంగాణలోనూ రాజకీయం నడుస్తోంది.  మోదీ పాలన గురించి చర్చ జరగడం లేదు. రాష్ట్ర అంశాల ఆధారంగానే ఓట్లు అడగడానికి పార్టీలు రెడీ అయ్యాయి. ఇందులో అందరూ ప్రధానంగా అందుకుంటున్న అంశం రైతులు.

రైతే రాజు అంటారు. ఇప్పుడు ఆ రైతే తెలగాణలో రాజుల్ని కాపాడతారా ముంచుతారా అన్నది తేల్చపోతున్నారు. అందుకే రాజకీయ పార్టీలన్నీ రైతుల్ని కాకా పడుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో  ఓడిపోయిన  బీఆర్ఎస్ తిరిగి తన బలం పెంచుకునే దిశగా మరోసారి అన్నదాతలనే నమ్ముకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువ స్థానాలు గెల్చుకున్న గులాబీ పార్టీని రూరల్ తెలంగాణలోని ఫలితాలు పెద్ద దెబ్బతీశాయి.  ఉమ్మడి ఖమ్మం, నల్గొండ,వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్దఎత్తున సీట్లు గెల్చుకుని మరో దఫా అధికారం చేపడతామని భావించిన  బీఆర్ఎస్ కు  ఆ జిల్లాల్లో ఘోర పరాభవం మిగిలింది.  మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే  కారు పార్టీ పరువు కాపాడాయి. దీంతో రూరల్ తెలంగాణపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ రైతు ఎజెండాను మరో సారి పైకి తీశారు.

పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు రూరల్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. రైతుల పొలం బాట పట్టి ఎండిన పంటలను పరిశీలించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక  సాగు నీరు ఇవ్వడం లేదని  బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మరో వైపు కేసీఆర్ సైతం నల్గొండ,  వంరగల్ జిల్లాల్లో ప్రత్యేకంగా రైతుల కోసం పర్యటన చేపట్టారు.  ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు .  2 లక్షల  రైతు రుణ మాఫీ పై రేవంత్ ప్రభుత్వాన్నినిలదీసారు.  200 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ జవాబుదారీ అంటూ నిప్పులు చెరిగారు.   రైతు బంధు కింద 15 వేల రూపాయల ఆర్థిక సాయం ,  ఎండిన పంలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా రైతు  సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ , బీజేపీ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ ఎన్నికల రాజకీయాల్లో సాగుతోంది.  బస్సుయాత్రను కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలా కాకుండా రైతుల కోసం చేయనున్నారు.

వికసిత్ భారత్ కోసం మూడో సారి ప్రధానిగా మోదీని గెలిపించాలని దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే  తెలంగాణలో మాత్రం బీజేపీ రైతు అంశాల పైనే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను లక్ష్యాంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. కరీంనగర్ లో ఎంపీ  బండి సంజయ్ ఇటీవలే ఒక రోజు రైతు దీక్ష చేపట్టారు.  హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  కిషన్ రెడ్డి దీక్ష నిర్వహించారు. రైతులకు సాగు నీరు ఇవ్వడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎకరాకు 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు  రూ. 500 బోనస్ ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా బీజేపీ  డిమాండ్ చేసింది. రైతు భరోసా కింద 15వేల ఆర్థిక సాయం చేయాలని, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కమలం నేతలు దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఇలా బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను రైతు సమస్యలపై నిలదీయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ ను అమలు చేస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లెవనెత్తుతోన్న రైతు హమీలపైనే దృష్టి పెట్టి కౌంటర్ చర్యలు చేపట్టింది.  రైతులకు నీరు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే,  తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతుందని, బీఆర్ఎస్ పాలనలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది.  బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా 2 లక్షల రైతు రుణ మాఫీ హమీ పై కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.   నారాయణ పేటలో జరిగిన సభలో  సీఎం రేవంత్ రెడ్డి  ఇచ్చిన ఆరు హమీల్లోని రెండు రైతు హమీలను  అమలు తేదీని ప్రకటించారు. ఆగష్టు 15వ తేదీ  లోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల  రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు.  వచ్చే సీజన్ నుండి ధాన్యానికి 500 రూపాయలు క్వింటాకు బోనస్ గా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.   రైతులు ఎవర్ని నమ్మితే వారికే పట్టం కట్టనున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి