ఇంద్రకరణ్…. ఎందుకింత జాప్యం..!

By KTV Telugu On 28 April, 2024
image

KTV T ELUGU :-

తెలంగాణ మాజీ మంత్రి అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక అనూహ్యంగా జాప్యమవుతూ వచ్చింది. దానిపై ఇంద్రకరణ్ అనుచరుల్లో  ఉత్కంఠ కూడా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వద్దన్నదా….  ఆయనే మనసు మార్చుకున్నారా అన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే  ఇప్పుడు క్లారిటీ వచ్చిందని  ఆ అనుచరులే చెబుతున్నారు. ఒకటి రెండు  రోజుల్లో ఈ పని పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇంద్రకరణ్  రాక కాంగ్రెస్ పార్టీకి అదనపు  ఆకర్షణ కూడా అవుతుంది….

ఒకప్పుడు ఆయన బీఆర్ఎస్  బాస్ కేసీఆర్ కు  అత్యంత సన్నిహితుడు. మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయనే  చూసుకునే వారు. ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన  తర్వాత ఇంద్రకరణ్ రూటు మార్చారు. చాలా మంది లాగే పక్క చూపులు చూశారు. కాంగ్రెస్ పార్టీలో  చేరే వారి జాబితాలో ఆయన  పేరు కూడా చేరిపోయింది..కాకపోతే చేరిక కొంత జాప్యమైంది. నిజానికి బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ పార్లమెంట్ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. బలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ నేతలను చేర్చు కుంటోంది.  అయితే నిర్మల్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  చేరికపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతూ వచ్చింది. గత నెలరోజులుగా ఎన్నో తేదీలు మారుతూ వచ్చాయి. చివరకు ఈనెల 6న తుక్కుగూడ బహిరంగసభలో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కారణాలేవైనా ఆయన చేరలేదు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు మాత్రం.. మా సార్ చేరడం గ్యారెంటీ అని ప్రచారం చేస్తున్నారు.

ఇంద్రకరణ్ చేరికలో జాప్యానికి కారణాలున్నాయి. మాజీ సహచరుడు శ్రీహరిరావు అభ్యంతరం చెబుతూ వచ్చారన్నది ఒక వార్త. అయితే సీఎం రేవంత్ జోక్యం చేసుకుని అన్ని సమస్యలు పరిష్కరించినట్లుగా చెబుతున్నారు.

నిజానికి నిర్మల్ నియోజకవర్గంలో   ఇంద్ర కరణ్ రెడ్డి వర్గం బలంగా ఉంది. ఈ క్రమంలో  ఇంద్రకరణ్ రెడ్డిని గత నెలలో  బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఆయన.. తన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జానారెడ్డిని కూడా కలిశారు. బీఆర్ఎస్ ను వీడిన కేశవరావు తో భేటీ అయ్యారు..దీంతో ఇంద్ర కరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ముహూర్తం ఫిక్స్ అయిందనుకున్నారు. అయితే  ఇంద్ర కరణ్ రాకను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. శ్రీహరి రావు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంద్ర కరణ్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. తర్వాత కాలం లో ఆయన తో విభేధించి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఇంద్ర కరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత శ్రీహరి రావు రాజకీయం గా నష్టపోయారు.దీంతో కొన్నాళ్ళ క్రితం కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావు పార్టీలో బలపడ్డారు.  నిర్మల్ లో  ఇంద్రకరణ్, శ్రీహరి రావు ఇద్దరు ఓడిపోవడంతో ఇప్పుడు నేతల మధ్య పోరు తీవ్రమైందనే చెప్పాలి. బీఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు మంత్రి హోదా లో ఇంద్ర కరణ్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ బహిరంగంగా నిరసన గళం వినిపిస్తున్నారు. కొన్ని వ్యతిరేకతల నడుమ ఇటీవల ఇంద్ర కరణ్ రెడ్డి అనుచరులు చాలా మంది  కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరికొంత మంది కూడా చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇంద్రకరణ్ ను  చేర్చుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం డిసైడైంది. రేవంత్ రెడ్డి స్వయంగా పావులు కదిపారు. ఒకటి రెండు రోజుల్లో  ముహుర్తం ఖరారవుతుందని చెబుతున్నారు…..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ బలమైన నాయకుడే. వ్యక్తిగత పరపతితో ఎదిగిన  నేత అని కూడా చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికారపార్టీలోకి వస్తే రాజకీయ లబ్ధి ఖాయమని ఎదురుచూస్తున్నారు. చేరడం కూడా ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవచ్చు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి