లోకేష్ మంగళ “గురి”

By KTV Telugu On 29 April, 2024
image

KTV TELUGU :-

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ,మాజీ మంత్రి నారా లోకేష్, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంకోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికలు ఆయనకు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. ఈసారి గెలిస్తేనే ఆయన రాజకీయాల్లో జైత్రయాత్రను కొనసాగించే  వీలుంటుంది. అందుకే  లోకేష్ పూర్తి  స్థాయిలో మంగళగిరిపై దృష్టి పెట్టారు. ఎక్కడికి వెళ్లకుండా నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. లోకేష్ దెబ్బకు రాజకీయ ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు తాము పోటీలో ఉన్నామా లేదా అన్న అనుమానాలు వారికే కలుగుతున్నాయి…..

ఇంతకాలం లోకేష్ రాష్ట్రం  మొత్తం పర్యటించేవారు. యువగళం పాదయాత్ర చేశారు. యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఎక్కడికి వెళ్లినా జనం ఆయనకు నీరాజనం  పట్టారు. సైకో పోవాలి, సైకిల్  రావాలని ఆని లోకేష్ ఎదుట నినాదాలిచ్చారు. లోకేష్ కూడా ప్రతీ ఒక్కరినీ పలుకరించేవారు. ఎక్కడా విసుగును ప్రదర్శించకుండా  గంటల తరబడి సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ  క్రమంలో జనం మనిషిగా పేరు  తెచ్చుకున్నారు. ఎన్నికల  కోడ్ అమలుకు వచ్చిన  తర్వాత మాత్రం లోకేష్ రూటు మార్చారు.  రాష్ట్రం మొత్తాన్ని తండ్రి చంద్రబాబు చుట్టేస్తుంటే లోకేష్ మాత్రం  తను పోటీ చేసే మంగళగిరి నియోజకవర్గానికి పరిమితమయ్యారు. మంగళగిరి ఇప్పుడు  ఆయనకు ఇజ్జత్ కా  సవాల్ అయ్యింది. అబ్కీ బార్ చంద్రబాబు సర్కార్ రావాలంటే ముందు ఆ పని మంగళగిరి నుంచే మొదలు కావాలని లోకేష్ కు తెలుసు. మంగళగిరిలో ఎక్కడ తేడా కొట్టినా అది పార్టీకే  చెడ్డపేరు అని లోకేష్ గుర్తించి ఇప్పుడు తన నియోజకవర్గానికే వంద శాతం ప్రాధాన్యమిస్తున్నారు..

మంగళగిరిలో లోకేష్ మైక్రో లెవెల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇంటింటికి తిరగడమే కాకుండా  తమ పార్టీ విధానాలను ప్రజలకు చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క వైసీపీ అభ్యర్థి  మురుగుడు లావణ్య ఎక్కడా కనిపించడం  లేదు. ఆమె  కోసం పోస్టర్లు వేయాల్సి వస్తుందని స్థానిక జనం జోకులు వేసుకుంటున్నారు….

లోకేష్ తరపున  వ్యూహకర్తలు అహరహం పనిచేస్తున్నారు. ప్రతీ వీధిని వాళ్లు జల్లెడ పట్టి పార్టీకి ఓటేసే వాళ్లు, తటస్థుల లెక్కలు తీస్తున్నారు. గలీల్లో కూడా లోకేష్ తో మీటింగులు పెట్టించి మాట్లాడిస్తున్నారు. అపార్టమెంట్ల వాసులతో యువనేత ప్రత్యేకంగా  సమావేశమవుతున్నారు. జగన్ తప్పిదాలను వివరించడంతో పాటు టీడీపీని గెలిపించాల్సిన   అనివార్యతను వారికి అర్థమయ్యేట్టు చెబుతున్నారు. గత  ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ ఈ సారి మాత్రం రికార్డు మెజార్టీతో గెలుస్తారని  టీడీపీ వర్గాలు అంచనా  వేస్తున్నాయి. నియోజకవర్గంలో లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. మంచి స్పందన లభిస్తోంది. ఈ సారి మీకే ఓటేస్తామని ప్రతీ ఒక్కరు చెప్పేస్తున్నారు.  ఆయనకు రికార్డు  మెజార్టీ ఖాయమని తాజా  సర్వేలు కూడా చెబుతున్నాయి. వైసీపీకి చెందిన సిట్టింగ్  ఎమ్మెల్యే

ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈసారి పోటీ చేయడంలేదు. ఆయన వైసీపీ మీద నానా రకాల విమర్శలూ చేసి, వైసీపీని వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరి, తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. తిట్టిన నోటితోనే వైసీపీని పొగడుతూ, నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన విలువ తానే తీసేసుకున్నారు. సరైన అభ్యర్థి లేక ఎవరో  ఒకరు చాలన్నట్లుగా వైసీపీ తరపున మురుగుడు లావణ్యను బరిలోకి దించారు. బీసీ సామాజిక వర్గం ఓట్ల కోసం ఆమెను రంగంలేకి దించినా..అది బూమరాంగ్ అయ్యిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తొలినాళ్లలో ప్రచారానికి తగిన స్పందన లేకపోవడంతో ఆమె ఇప్పుడు మొక్కుబడి ప్రచారానికి పరిమితమయ్యారు…

ప్రస్తుత పరిణామాలు చూస్తే మంగళగిరిలో వార్ వన్ సైడ్ అయ్యిందనే  చెప్పాలి.  ఎక్కడ చూసినా లోకేష్ మాటే వినిపిస్తోంది. ఒక్కసారి తమిళనాడులో బీజేపీ తరపున ప్రచారానికి వెళ్లివచ్చిన లోకేష్.. ఇక పూర్తి స్థాయిలో మంగళగిరికే పరిమితం కావడం..ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. చూడాలి మరి మెజార్టీ ఎంత వస్తుందో..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి