తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాళ్లు అక్కడక్కడా ఉంటారు. టిడిపి నేత నందమూరి బాలయ్య కూడా ఈ కోవలోకే వస్తారని రాయలసీమ మేథావులు మండి పడుతున్నారు. రాయలసీమ పెట్టిన రాజకీయ భిక్షతో చట్టసభలో అడుగు పెట్టిన బాలకృష్ణ.. అదే రాయలసీమను తన సినిమాల్లో హింసకు కేరాఫ్ అడ్రస్ గా చూపిస్తూ విషం చిమ్ముతున్నారు. హిందూపురం ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే..పదేళ్ల లో పది సార్లు కూడా నియోజక వర్గానికి రాలేదు బాలయ్య. పిఏల తో నియోజకవర్గాన్ని ఏలేస్తున్నారు.ఈ ఎన్నికల్లో మాత్రం బాలయ్య ఓటమి ఖాయమంటున్నారు స్థానికులు. తమకి అందుబాటులో ఉండే వారినే ఎమ్మెల్యేని చేసుకుంటాం అంటున్నారు ఇక్కడి ప్రజలు.
1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుండి హిందూపురం నియోజక వర్గం ప్రజలు టిడిపినే గెలిపిస్తున్నారు. 41ఏళ్లుగా టిడిపిని ఆదరించినా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడంలో టిడిపి ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలం అయ్యారు. 2014,2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ హిందూపురం లో గెలిచారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే బాలకృష్ణ ఆ తర్వాత మళ్లీ కనిపించరు. పిఎలను పెట్టుకుని నియోజక వర్గాన్ని దోచుకునే బాధ్యత వారికి అప్పగించేసి తాను హైదరాబాద్ లో మకాం ఉంటున్నారు.
ఏడాదికి రెండు సినిమాలకు తగ్గకుండా 365 రోజులూ సినిమా షూటింగులతో బిజీగా ఉంటారు. వాటితో పాటు టీవీ షోలోనూ పాల్గొంటున్నారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నియోక వర్గానికి రావడం ఎడ్లబండిపై , బైక్ పై తిరుగుతూ సర్కస్ ఫీట్లు చేస్తూ ఉండేవారు. అధికారం కోల్పోయిన తర్వాత హిందూపురం వైపు చూడ్డమే మానేశారు బాలయ్య.తననె రెండు సార్లు గెలిపించిన నియోక వర్గ ప్రజల సమస్యలేంటి అన్నది ఏనాడూ ఆయన పట్టించుకోలేదు. తమ సమస్యలు చెప్పుకుందామని ప్రజలు అనుకున్నా బాలయ్య అందుబాటులో ఉండరు. ఆయనకు ఏదైనా సమస్య గురించి చెప్పుకోవాలంటే హైదరాబాద్ అయినా వెళ్లాలి..లేదంటే ఆయన సినిమా షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లాలి.
తనకి రాజకీయ భిక్షపెట్టిన రాయలసీమ అంటే వీసమెత్తు అభిమానం కానీ కృతజ్ఞత కానీ లేవు బాలయ్యకి. రాయలసీమ ప్రజలు పరమ కిరాతకులు, హింసాపిపాసులు అన్నట్లు బాలయ్య సినిమాలు తీసి డబ్బులు సంపాదించారు. రాయలసీమ అంటే ఆయనకు ఎంత ద్వేషం ఉందో ఆయన సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది.సమర సింహారెడ్డి నుండి వీర సింహారెడ్డి వరకు రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో బాలయ్య నటించిన ప్రతీ సినిమాలోనూ రాయల సీమ అంటేనే ఫ్యాక్షన్ సీమ అయినట్లు అక్కడి ప్రజలకు వేటకొడవళ్లతో నరుక్కోవడం తప్ప మరో పనిలేనట్లు చిత్రీకరిస్తారని రాయలసీమ మేథావుల ఫోరం నేతలు ఆరోపిస్తున్నారు.
రెండు సార్లు గెలిచిన బాలయ్య నియోజక వర్గాన్ని గాలికి వదిలేయడంతో ప్రజల్లోనూ మార్పు వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యను గెలిపించిన హిందూపురం ప్రజలు రెండేళ్లు తిరక్కుండానే జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాలు కట్టబెట్టారు. టిడిపిని భూస్థాపితం చేశారు. మున్సిపాలిటీతో పాటు మెజారిటీ ఎంపీటీసీ,జెడ్పీటీసీ స్థానాలను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్సు గెలుచుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
2014లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు బాలయ్య.2019లో వరుసగా రెండో సారి గెలిచారు. ఈ పదేళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ విచ్చలవిడిగా సినిమాలు తీసుకుంటున్నారు. పదేళ్ల కాలంలో 13 సినిమాలు విడుదల చేశారు బాలయ్య .అంతకు ముందు 2004 నుండి 2014 వరకు పదేళ్లలో 14 సినిమాల్లో నటించారు బాలయ్య. మొత్తానికి ఏడాదంతా ఆయన సినిమాలకే అంకితం అవుతున్నారు. సినిమాలే జీవితం అనుకునే బాలయ్యని గెలిపిస్తే తమకి కష్టాల సినిమాలు చూపిస్తున్నారని ప్రజలు మండి పడుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బాలయ్యకు ఊహించని షాక్ ఇచ్చి ఇంటికి పంపేయాలని ప్రజలు నిశ్చయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…