పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు కీలకమని చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కవ సీట్లు వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఏ మాత్రం సహించని బీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు. అందుకే తన వంతు సాయం చేశారు. కొన్ని స్థానాల్లో అసలు ప్రచారమే చేయలేదు. బీజేపీకి మేలు చేశారు. అయితే బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుందా అంటే కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే తానే రక్షణగా ఉండి కాపాడుతుందంటున్నారు. ఎందుకంటే ఇందులో చాలా సమీకరణాలు ఉన్నాయి మరి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొదలు ఆ ప్రభుత్వం ఉండదని పదే పదే అభిప్రాయం చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు. అంత ఈజీగా ప్రభుత్వం పడిపోతుందా అని జనం ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఒకే లాజిక్ చెప్పేవారు. అదేమిటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పరిమితంగా సీట్లు వస్తాయని.. ఆ తర్వాత బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుందని. కేసీఆర్ కూడా తమ పార్టీ సమావేశాల్లో ఇవే చెబుతూ వచ్చారు. వందకుపైగా ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ కు సహించే ప్రశ్నే ఉండదని ఆయన అంటున్నారు. ఈ పరిస్థితి తీసుకు రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కేసీఆర్ బీజేపీకి సహకరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తేల్చేందుకు బీ జేపీకి సైలెంట్ గా సపోర్టు చేశారు. ఫలితంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోరాటం లోక్ సభ ఎన్నికల్లో జరిగింది. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఒక్క సీటు ఎక్కువగా వస్తే అసలు కథ ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు.టట
కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీకి సీట్లు రాకపోయినా.. బీజేపీకి లోపాయికారీగా సహకరించడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ ఉసురు తీయడమే. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ ఆశ. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే.. ఎమ్మెల్యేలను కూడా చీల్చాలి. చీల్చినా బీఆర్ఎస్ సాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటంది. చెడ్డ పేరు అంతా బీజేపీకి వస్తుంది. కానీ అధికారంలో బీఆర్ఎస్ కు భాగస్వామ్యం లభిస్తుంది. కేసీఆర్ ఇదే ఆలోచించారు. కానీ బీజేపీ ఈ విషయంలో అంత తేలికగా కేసీఆర్ ట్రాప్ లో పడే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వస్తే తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉన్న పళంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి.. ఆ పార్టీతో కలిసి అధికారం చేపట్టాలని అనుకోకపోవచ్చు.
బీజేపీ ప్రధమంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెడుతుంది. ఆ పార్టీ ఉనికిని వీలైనంతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కనీస బలం చూపించలేకపోతే ముఖ్యంగా గట్టి ఓటు బ్యాంక్ ను కాపాడుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. ఎక్కువగా బీజేపీ పంచన చేరిపోతారు. ఎందుకంటే.. మరో రెండు, మూడేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీగా బీజేపీనే చూస్తారు. అందుకే ఆ పార్టీలో చేరిపోతారు. బీఆర్ఎస్ బలహీనపడుతుంది. క్రమంగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలోనూ ప్రతిపక్ష స్థానానికి చేరుతుంది బీజేపీ.
తాము బలపడేందుకు అయినా.. బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి ఉన్నట్లుగా తెచ్చేందుకు ప్రధానంగా కొంత కాలం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వచ్చేందుకు బీజేపీ సిద్ధపడదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కారణంగా ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు ప్రభుత్వంపై తిరుగబడతారన్న భావన బీజేపీలో ఉంది. ఎంత అసంతృప్తి చెందితే బీజేపీకి అంత మేలు జరుగుతుంది. ఇంత కాలం అన్ని పార్టీలకు చాన్సిచ్చారు.. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వమని అడగితే.. ప్రజలు స్పందించే అవకాశం ఉంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరూ ఊహించుకుంటున్నట్లుగా బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఉందు. బీఆర్ఎస్ ట్రాప్‌లో బీజేపీ పడే అవకాశాలు తక్కువే.
రాజకీయాలను అర్థం చేసుకోవం అంత తేలిక కాదు. ఒక్కో సారి ప్రభుత్వాన్ని కాపాడటం కూడా ప్రతిపక్ష పార్టీలకు చాలా సేఫ్ గేమ్ అవుతుంది. అలాంటి గేమే.. తెలంగాణలో పధ్నాలుగో తేదీ తర్వాత జరిగే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…