ఇంతకాలం ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేశారామే. అన్నయ్య అని కూడా చూడకుండా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వివేకా హత్య కేసులో సుత్రధారులెవ్వరో తేల్చాలని కోడై కూశారు. ఎలా పోలింగ్ అయిపోయిందో లేదో ఇలా నోటికి జిప్ వేశారు. వివేక హత్య కేసులో ఎవరూ మాట్లాడకూడదన్న ఉత్తర్వులపై కోర్టు స్టేను పైకోర్టు ఎత్తేసినా షర్మిల మాట్లాడటం లేదు. ఎందుకలా జరుగుతోందన్నదే పెద్ద ప్రశ్న…..
షర్మిల తీరు మారిందా. రిజల్ట్ వచ్చే వరకు వేచి ఉండాలని ఆమె అనుకుంటారా. ఈ రెండు మాటల్లో ఏది నిజమన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. రోజుకు నాలుగు స్టేట్ మెంట్స్ ఇచ్చే షర్మిల.. ఇలా సైలెంట్ అయిపోయారేమిటబ్బా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎంత పోలింగ్ అయిపోతే మాత్రం అలా ఉండిపోవాలా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తిట్టే నోరు, తిరిగే కాలు ఊరకే ఉండలేవన్న సామెత సైతం తప్పేమో అని అనుమానం వచ్చే రీలితో షర్మిల ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. పోలింగ్ తర్వాత అన్న జగన్, యూరప్ వెళ్లిపోతే షర్మిల కూడా ఆంధ్రాలో ఉండకూడదనుకున్నారు. ఆమె అమెరికా వెళ్లిపోయారు. షర్మిల కుమారుడు రాజా రెడ్డి అమెరికాలో ఉంటున్నారు. తల్లి విజయమ్మ కొంతకాలం క్రితం అమెరికా వెళ్లిపోయారు. కొడుకు, కూతురు మధ్య గొడవలు తీర్చలేక ఆమె కొన్ని రోజులు యూఎస్ లో ఉండటానికి వెళ్లారు. ఎన్నికలు పూర్తికాగానే షర్మిల కూడా సైలెంట్ గా తల్లిదగ్గరకు చేరారు. ఏపీ ప్రజల బాధలు, వివేక హత్య కేసును పట్టించుకోవడానికి కొంత కాలం గ్యాప్ ఇచ్చారు…
షర్మిల టూర్ వెనుక కొన్ని అనుమానాలు తప్పడం లేదు. ఆమె కుటుంబ రాయబారం ఏదైనా నడుపుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికలతో రాజకీయం ముగిసిందని కుటుంబం అంతా ఒక్కటేనని చెప్పేందుకు ఆమె తహతహలాడుతున్నారని కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న టాక్….
ఒకప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం. గత రెండేళ్లుగా మాత్రం సీన్ మారింది. అన్న తనకు అన్యాయం చేశారని ఆమె అలిగి… కుటుంబం నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. తెలంగాణలో తిరిగి తర్వాత ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు సడన్ గా అంత సైలెంట్ ఎలా అయిపోతారు. ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా జగన్ ఓడిపోతారు… ఆయన అవినీతిని బయటకు లాగుతామని ప్రకటిస్తుంటే షర్మిల మాత్రం ఎన్నికల తర్వాత ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. టీడీపీలో ఉన్న నాయకులంతా ఇప్పుడు జగన్ పై విరుచుకుపడుతున్నారు. రోజూ పది ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపోస్తున్నారు. ప్రజ సమస్యలపై చంద్రబాబు రోజూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. షర్మిల మాత్రం నో కామెంట్స్ అంటున్నారు. ఒక్క సీటు కూడా రాని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని తీసుకుని తప్పుచేశానన్న ఫీలింగ్ ఆమెలో వచ్చిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమైనప్పుడు నైతికంగా బాధ్యత వహించాల్సి వస్తుందన్న టెన్షన్ ఆమెలో పెరిగిపోతోందట. సోనియా, రాహుల్ కు ఏదో చెప్పేసి పార్టీలో చేరిన వెంటనే పీసీసీ అధ్యక్ష పదవిని తీసుకున్న షర్మిల ఇప్పుడు అధిష్టానానికి ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచనలో పడిపోయినట్లు చెబుతున్నారు…
షర్మిల ఇండిపెంటెండ్ గా ఆలోచించే వ్యక్తి అనడంలో తప్పులేదు. కాకపోతే ఏపీ కాంగ్రెస్లో చేరి ఆమె తప్పుచేశారన్న ఫీలింగ్ మాత్రం వైఎస్ కుటుంబ అభిమానులకు కలుగుతోంది. షర్మిల ఆ మాట బయటకు చెప్పకపోయినా అదే ఆలోచనతో ఉండి ఉండొచ్చు. దాని బదులు ఏదో విధంగా తెలంగాణ కాంగ్రెస్ లో చేరిపోతే బావుండేదన్న అభిప్రాయం కూడా ఆమె అనుచరుల్లో కలుగుతుందనుకోవాలి…. చూడాలి మరి ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…