బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయోయమం, అనుమానం, డోలాయమాన స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ఎటు పోలుపోవడం లేదని, దిక్కుతోచడం లేదని జనం అనుకుంటున్నారు. పార్టీ భవిష్యత్తు ఏమిటి, ఓడిపోయిన తర్వాత పార్టీని ఏం చేయాలి లాంటి ఆలోచనలు ఆయన్ను వెంటాడుతున్నట్లుగా చెబుతున్నారు. కాకపోతే అవన్నీ ఆర్మ్ చైర్ థియరీలే. గులాబీ బాస్ ఫుల్ క్లారిటీలో ఉన్నారు. తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ఆయన స్పష్టమైన ఆలోచనతోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మరో గూటికి చేరడం ఖాయమన్న చర్చ జరుగుతోంది….
ఉద్యమ కాలంలో అప్పటి టీఆర్ఎస్ ఆటుపోట్లను ఎదుర్కొన్న మాట నిజం. కొన్ని సందర్భాల్లో కీలక నియోజకవర్గాల్లో ఓడిపోయిన మాట అంతే వాస్తవం. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాలో తప్ప… ఉద్యమానికి పట్టుకొమ్మగా ఉన్న వరంగల్, కరీంనగర్ తో పాటు నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీ జయకేతనాలు ఎగురవేసింది. పదేళ్ల పాటు తెలంగాణ అధికారపీఠంపై ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ఇతర పార్టీ నుంచి నేతలను లాక్కుని ప్రత్యర్థులను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అనేక అపవాదులు కూడా మూటగట్టుకున్నారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పట్ల ఎంత ప్రజావ్యతిరేకత పెరిగిందో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. దానితో ఇప్పుడు పార్టీ పరిస్థితి సున్నా స్థాయికే కాదు. మైనస్ వంద స్థాయికి పడిపోయింది. దానితో తదుపరి చర్యలేమిటి రాజకీయంగా ఏం చేయాలన్న ఆలోచన కేసీఆర్ మదిలో మెదలడం మొదలైంది…..
కేసీఆర్ కుటుంబం,వారు చేసే అవినీతి ఒక నాణెనికి రెండు వైపులా లాంటివని రాజకీయంగా వినిపిస్తున్న మాట. ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత .. ఎక్కడో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం వారి కాసుల కక్కుర్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అటు సీబీఐ, ఇటు ఈడీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. తీహార్ జైలు గోడల మధ్య దిక్కుతోచకుండా పడున్న కూతురిని కాపాడేందుకు కేసీఆర్ కొత్త స్కేచ్చులు వేస్తున్నారని, అందులో పార్టీ విలీనం కూడా ఒకటని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.బీఆర్ఎను కేసీఆర్ స్వయంగా మూసెయ్యడం ఖాయమన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. తీసుకెళ్లి ఎక్కడ కలపాలో కూడా ఇప్పుడాయన ఒక నిర్ణయానికి వచ్చేశారట….
కేసీఆర్ కుటుంబంపై తవ్వే కొద్దీ ఆరోపణలు వెల్లువెత్తడం ఖాయం.కాళేశ్వరం అవినీతిపై మూలాల్లోకి వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులన్నీ సమీక్షించి ఎక్కడ ఎంత తిన్నారో నిగ్గు తేల్చాలనుకుంటోంది. పైగా కేటీఆర్, హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ను పూర్తిగా బలహీన పరచడమే ప్రత్యర్థుల ఆలోచనగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎవరూ ఉండకుండా చేయాలని చూస్తున్న మాట కూడా నిజమే. ఈ పరిస్థితుల్లోనే ఎవరి ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందో కూడా ఊహించలేమని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ దిశగానే కవిత కేసును చూడాలి. ఇప్పట్లో ఆమెను ఈడీ, సీబీఐ వదిలిపెట్టడం కుదరదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ మదిలో మరో ప్లాన్ మెదులుతోందని చెబుతున్నారు. పార్టీని కాపాడుకోవడం కంటే కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడం ఆయనకు ముఖ్యమని అనుకోవాలి. కేసుల బారి నుంచి కవితను కాపాడుకోవడం కోసం ఆయన బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ఆలోచనతో ఉన్నారని వినిపిస్తోంది. పైగా కీలక నేతలంతా జారిపోయిన పార్టీని నిలబెట్టడం కుదరదని ఆయన భావిస్తున్నారు. పార్టీని కాషాయ సేనలో కలిపేస్తే కనీసం తన కుటుంబమైనా బాగుపడుతుందని ఆయన చూస్తున్నారట….
కేసీఆర్ ది అవకాశవాద రాజకీయమని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తనకు ఇబ్బంది రాకుండా చూసుకునేందుకు ఆయన ఏ పనైనా చేస్తారు. సీఎం అవ్వాలనుకుని ఆ దిశగా విజయం సాధించారు. తెలంగాణ తెచ్చిన పేరును నిలబెట్టుకున్నారు. ఇప్పుడు కష్టకాలం మొదలైన నేపథ్యంలో కేంద్రంలో అధికారపార్టీలో ఉంటే సేఫ్ గేమ్ ఆడొచ్చు. కూతురిని కూడా కాపాడుకోవచ్చు. అదే ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక ప్లాన్…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…