ఒకప్పుడు టిడిపి కంచుకోట గా ఉన్న ఆ నియోజకవర్గం లో రెండు సార్లు ఫ్యాన్ గాలి బలంగా వీచింది.దీంతో ఆ కంచుకోటకు బీటలు వారాయి.ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా వైఎస్ఆర్ సిపి జెండా రెపరపలాడ నుందని ఎన్నికల సరళి చెబుతోంది. దీంతో ఆ కంచుకోటలో ఒకప్పుడు వెలుగు వెలిగిన టిడిపి నేతలు టెన్షన్ లో ఉన్నారు. ఇంతకీ ఏంటా నియోజక వర్గం ? ఏమా కథ?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అంటే ఒకప్పుడు టిడిపికి కంచుకోట .ఎందుకంటే ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టినప్పటీ నుండి 2004 ఎన్నికల వరకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఆయన ఏకఛత్రాదిపత్యానికి గండికొట్టేవారే లేకపోయారు అప్పట్లో .దీంతో అందరూ తుని నియోజకవర్గాన్ని టిడిపికి కంచుకోట గా చెప్పుకునే వారు. ఐతే 2009 లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ..తుని లో యనమలను మొట్ట మొదటిసారిగా ఓడించారు. కాంగ్రెస్ నుండి రాజా ఆశోక్ బాబు గెలిచారు.
2009లో మొదటి సారి ఎన్నికల్లో ఓటమి చెందిన యనమల రామకృష్ణుడు ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరికే దూరం అయ్యారు. 2014లో ఎమ్మెల్సీగా ఆయన మంత్రి అయ్యారు.ఆ తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడుని టిడిపి తరపున తుని నుండి పోటీ చేయించారు. ఆ రెండు సార్లూ ఆయన ఓటమి చెందారు. ఈ రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలిచి ..తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించారు.
రెండున్నరేళ్ళ క్రిందట సిఎం జగన్ దాడిశెట్టి రాజా కు రోడ్లు భవనాల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు.ఇదిలా ఉంటే గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన తన సోదరుడు కృష్ణుణ్ని పక్కన పెట్టారు అన్న యనమల. ఈసారి ఎన్నికల బరిలో తన కుమార్తె దివ్యను దింపారు. దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది.మరోవైపు చిన్నాన్న కృష్ణుడు..అతని వర్గాన్ని యనమల కూతురు దివ్య దూరం పెట్టి అవమానించారు .దీంతో మనస్ధాపం చెందిన కృష్ణుడు సిఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు.
దాదాపు 40 ఏళ్లు గా తునిలో అన్నకు అన్ని తానై అండగా ఉండిన కృష్ణుడు తనకు అన్యాయం జరిగిందని కసిగా ఉన్నారు. అందుకే టిడిపిని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. తునిలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం కృష్ణుడు విస్తృతంగా పని చేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్ సిపికి పడేలా పావులు కదిపారు. .గత సార్వత్రిక ఎన్నికల్లో 82.28% శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ ఎన్నికల్లో 83.36% పోలింగ్ నమోదు అయ్యింది.అంటే ఒక్క శాతం ఓటింగ్ శాతం పెరిగింది.మొత్తం తునిలో 2,24,538 మంది ఓటర్లు ఉండగా..ఈ ఎన్నికల్లో 1,87,183 మంది ఓటర్లు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.వీరిలో 93,988 మంది మహిళ ఓటర్లు ఉన్నారు.
తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. యనమల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురం లోనే. అంతేకాదు…యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాదు లో ఉండడం వల్ల ఆమె పై ఇక్కడి ప్రజలకు అంత నమ్మకం లేదు.చివరకు యనమల తన కుమార్తె ఎన్నికల ప్రచారంలో కూడా అంతగా కనిపించలేదు. ఈ ఎన్నికల్లో మంత్రి దాడిశెట్టి రాజా..గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…