నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి . చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. టిడిపి నేతలు మాత్రం ఈ సారి లక్ష మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? కుప్పంలో అసలు ఏం జరగబోతోంది?
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ ఎప్పట్నుంచో ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కుప్పంలో వేలాది దొంగ ఓట్లను తొలగించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావంతో కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ ఎన్నికలోనూ చంద్రాబు మెజారిటీ తగ్గుతూ…ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది.
ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు చంద్రబాబు ఓటమి ఖాయమంటోంది వైసీపీ. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నది వైసీపీ విమర్శ. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టిడిపికి ఘోర పరాజయాలు వచ్చాయి. అప్పట్నుంచీ చంద్రబాబు నాయుడు నియోజక వర్గంపై ప్రత్యేక దృష్ఠి సారించారు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయన సతీమణి తరచుగా కుప్పం వెళ్తూ జనంతో మమేకం అవుతున్నారు.
1989 నుండి చంద్రబాబు నాయుడు కుప్పంలో వరుసగా గెలుస్తూనే ఉన్నారు. అయితే ఆయన మూడున్నర దశాబ్దాల్లో చేయలేకపోయిన మంచి పనులు తాము అయిదేళ్లలో చేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 2019 తర్వాతనే కుప్పం మున్సిపాలిటీ అయ్యింది. రెవిన్యూ డివిజన్ గానూ ప్రమోట్ అయ్యింది. ఈ ఎన్నికలకు కొద్ది వారాల ముందే హంద్రీ నీవా జలాలు కుప్పానికి చేరాయి. ఇవి కాక తమ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు కుప్పంలో 95 శాతం ఇళ్లకు చేరాయని వైసీపీ నేతలు అంటున్నారు.ఈ అంశాలన్నీ తమ విజయానికి దోహద పడతాయని వైసీపీ నమ్మకం పెట్టుకుంది.
2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారని వైసీపీ చెప్పుకుంటోంది. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసమే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొని కూటమిని ఆశీర్వదించారని టిడిపి అంటోంది.
కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆవర్గానికి చెందిన భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టిడిపి నాయకులు… ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు వరుసగా ఎనిమిదో సారి గెలుస్తున్నారని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ ఎవరికి లాభిస్తుందన్నదే కీలకం అంటున్నారు పరిశీలకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…