KTV TELUGU :-
మీడియాను అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసే వారిలో ఆయన ఒకడు. బ్లాక్ మెయిలింగ్ తో డబ్బు సంపాదించి..ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు.వసూలు రాజాగా పేరు పొందిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏడెనిమిదేళ్లుగా దందాలకే పేరుమోసిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చిందనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది…
ఓటమి ఎరుగని నేతలు చాలా మంది ఉంటారు. ఆయన గెలుపెరుగని వీరుడు.గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఐనా పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టెక్కినట్లుగా ఈ సారి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అలాగని ఆయన ఏమన్నా సంప్రదాయ కాంగ్రెస్ వాదా అంటే అదీ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో గెలవలేకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడ ఆటలు సాగకపోవడంతో కమలం పార్టీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత భువనగిరి ఎంపీ సీటు ఆశించిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. అక్కడ 52 మంది అభ్యర్థులుండటంతో మల్లన్న గెలుపు కోసం సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 27 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులకు తీన్మార్ మల్లన్నకు గెలిపించే బాధ్యత అప్పగించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అందులోనూ బీఆర్ఎస్, బీజేపీ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొందరు ఇండిపెండెంట్లు కూడా శక్తిమంతులుగానే కనిపిస్తున్నారు.. ఐనా సరే కాంగ్రెస్ మాత్రం మల్లన్నతో గాంబ్లింగ్ చేస్తోంది…
తీన్మార్ మల్లన్న ఒకప్పుడు క్రూసేడర్ గా కనిపించేవారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఆయన నిజస్వరూపం బయటపడింది. ఒక చానెల్ పెట్టుకుని దందాలు నిర్వహించారు. రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేశారు. కేసీఆర్ కు తిక్కరేగడంతో మల్లన్నను జైల్లో పడేశారు. ఐనా ఆయన తీరు మారలేదు. కుక్కతోక వంకర అన్నట్లుగా బెయిల్ పై విడుదలైన తర్వాత మల్లన్న తన మార్క్ వసూళ్లు కొనసాగించారు. అందుకే అతడ్ని ఇప్పుడు నయా నయీం అని పిలుస్తున్నారు….
ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడంలో మల్లన్న దిట్ట. పైగా ప్లాన్ ప్రకారం ఇతరులను ఇబ్బంది పెడుతారు. తను అనుకున్నట్లుగా వసూలు కాకపోతే ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చి కూడా రూటు మార్చి బెదిరిస్తారు. చిన్న ఉద్యోగులను సైతం బ్లాక్ మెయిల్ చేసి ఐదు, పది లక్షలు దండుకోవడం తీన్మార్ మల్లన్నకు అలవాటు. అతనిపై పదికి పైగా కేసులున్నాయి. అయితే మొత్తం 56 కేసులున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను కొట్టిన కేసులోనూ, ఒక జ్యోతిష్కుడిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులోనూ తీన్మార్ మల్లన్న గతంలో అరెస్టయ్యారు. బిల్డర్లు, వ్యాపారవేత్తలు, వెంచర్ల యజమానులను బెదిరించి అతను విపరీతంగా డబ్బులు వస్తూలు చేస్తున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు. మల్లన్న కన్ను పడిందంటే కోట్లు వదిలించుకోవాల్సిందేనన్న చర్చ తెలంగాణ రాజకీయ, వ్యాపారవర్గాల్లో వినిపిస్తోంది. వాళ్లంతా సీఎం రేవంత్ కు ఫిర్యాదు కూడా చేశారు. హైదారాబాద్లో చాలా మంది బిల్డర్లు తీన్మార్ మల్లన్న బాధితులేనని తేలిపోయింది. చివరకు తాను ఎమ్మెల్సీ పదవికి పోటీ చేస్తున్నానని, ఖర్చు పెట్టేందుకు నిధులు అవసరమైనందుకు డబ్బులివ్వాలని బిల్డర్లను వేధించినట్లు కూడా మల్లన్నపై ఆరోపణలు వచ్చాయి.అతను అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కేసులో కూడా నిందితుడే. అతని వేధింపులను తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. గూగుల్ లో అప్ లోడ్ చేసిన అమ్మాయిల ఫోటోలను డౌన్ లోడ్ చేసి నెంబర్లు పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న స్వయంగా బ్లాక్ మెయిల్ చేసిన ఆడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. పైగా ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు కూడా చెబుతున్నారు.మోసపోయిన యువకులు ఫోన్ చేస్తే వారిని తిట్టిపోసి బెదిరించారని తెలుస్తోంది.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు….
కాంగ్రెస్ పార్టీ తొందరపడి తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక యూ ట్యాబ్ ఛానెల్ పెట్టుకుని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ తెలిసిపోవడంతో పట్టభద్రులు అసహనానికి లోనవుతున్నారు. బ్లాక్ మెయిలర్ కు ఎలా ఓటెయ్యాలని వారు ప్రశ్నిస్తున్నారు. కేసుల వ్యవహారం ఒక కొలిక్కి రాకుండా అతనికి టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…